ADB: రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి నిధులు కేటాయించాలని SWF రీజనల్ అధ్యక్షుడు ఎస్. భీమ్ రావు అన్నారు. బుధవారం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు కార్మికులతో కలిసి సంతకాల సేకరణ చేపట్టారు. వేతన సవరణ అలవెన్స్, ఆర్టీసీలో యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. విద్యుత్తు బస్సులను ఆర్టీసీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.