• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

లాకప్ డెత్.. మృతదేహానికి రీపోస్టుమార్టం

TG: సూర్యాపేట కోదాడలో లాకప్ డెత్ కేసు వెలుగు చూసింది. ఈ క్రమంలో కర్ల రాజేష్ మృతదేహానికి అధికారులు రీపోస్టుమార్టం నిర్వహించారు. జాతీయ కమిషన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో రాజేష్‌పై ఆరోపణలు ఉన్నాయి.

February 27, 2026 / 10:58 AM IST

కుమ్మెర బాధితులకు న్యాయం కోరుతూ ధర్నా

MBNR: బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఛైర్మన్ విశారదన్ మహారాజ్ కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం డీజీపీ శివధర్ రెడ్డిని కలవనున్నట్లు తెలిపారు. 4 రోజులుగా ధర్నా కొనసాగిస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విధి నిర్వహణ విఫలమైన పోలీసులను సస్పెండ్ చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

February 27, 2026 / 10:54 AM IST

మా నాన్న వారిని శపించాడు: అర్ష్‌దీప్

చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికరమైన ఘటనను పంచుకున్నాడు. ‘సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్‌ను నా తండ్రితో కలిసి టీవీలో చూశాను. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు సిక్స్ కొట్టిన ప్రతిసారీ మా తండ్రి వారిపై అరిచాడు. వారిని శపించాడు’ అని తెలిపాడు.

February 27, 2026 / 10:54 AM IST

గుండెపోటుతో యువకుడి మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలం ఉప్పైరు గ్రామంలో కుమ్మరి మురళి అనే యువకుడు గురువారం అర్థరాత్రి 11 గంటల సమయంలో గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

February 27, 2026 / 10:53 AM IST

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ వెబ్ కష్టాలు

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఐఫోన్ (iOS) యూజర్లు లాగిన్ అవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుండి ఈ సమస్య మొదలైందని నెటిజన్లు ‘X’ వేదికగా వాపోతున్నారు. మొబైల్ యాప్ పనిచేస్తున్నా, వెబ్ వెర్షన్ మొరాయిస్తుండటంతో ఆఫీసు పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

February 27, 2026 / 10:50 AM IST

బిజ్వార్‌లో ఘనంగా చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి

NRPT: ఊట్కూర్ మండలం బిజ్వార్‌లో విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పి.వై.ఎల్. జిల్లా కార్యదర్శి సిద్ధు మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆజాద్ పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

February 27, 2026 / 10:48 AM IST

ఎయిర్‌పోర్టులో సర్వీసుల కొరత: బోండా ఉమ

AP: గన్నవరం ఎయిర్‌పోర్టులో సర్వీసుల కొరత ఉందని బోండా ఉమ అన్నారు. కేంద్రమంత్రిగా రామ్మోహన్ ఉన్నా ఉపయోగం లేదన్నారు. కాశీ, గోవా, షిర్డీ, మైసూర్‌కు విమాన సర్వీసులు లేవన్నారు. హైదరాబాద్ నుంచి వందలాది సర్వీసులు ఉన్నాయని, విజయవాడ నుంచి 15 సర్వీసులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. దుబాయ్, దోహా సహా అన్ని రాష్ట్రాల రాజధానులకు విజయవాడ నుంచి నడపాలని తెలిపారు. 

February 27, 2026 / 10:47 AM IST

సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ

NLG: నార్కట్‌పల్లి నల్గొండ క్రాస్ రోడ్‌లో దుకాణాల లోకి దూసుకు వచ్చిన లారీ దుర్ఘటన స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. సమీపంలోని వారు ఆ భయం నుంచి ఇంకా కోలుకోలేదు. శుక్రవారం ఉదయం సంఘటన స్థలాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవర్, డీఎస్పీ కొలను శివరాం రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

February 27, 2026 / 10:45 AM IST

విజయవాడలో బీద రవిచంద్రను కలిసిన గుడిసె ఆది కృష్ణమ్మ

KRNL: విజయవాడలో కర్నూలు జిల్లా జోనల్–5 కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ బీద రవిచంద్రని కర్నూలు జిల్లా టీడీపి అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ మరింత బలోపేతం చేయడం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ శ్రేణులను సంఘటితం చేయడం, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం వంటి కీలక అంశాలపై సవివరంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

February 27, 2026 / 10:45 AM IST

‘ప్రతివారం ఓ మండలంలో ప్రజావాణి’

మెదక్ జిల్లా నుంచి బదిలీ అయిన కలెక్టర్ రాహుల్ రాజ్ తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు పొందారు. గతంలో కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కార లక్ష్యంగా దూరాభారం తగ్గించేందుకు మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేగోడ్, పెద్ద శంకరంపేట, నిజాంపేట్ మండలాలలో నిర్వహించారు.

February 27, 2026 / 10:41 AM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో బిల్లుల జాప్యంపై ఆవేదన

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కార్యాలయం ఆలస్యంగా తెరుచుకుంటోందని, బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతోందని సిబ్బంది శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం రిటైర్ అయిన జూనియర్ అసిస్టెంట్‌కు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

February 27, 2026 / 10:40 AM IST

రేవంత్ దుర్మార్గాలను రాహుల్ ఆపాలి: ఈటల

TG: భూదాన్ బాధితులకు అండగా ఉంటామని ఎంపీ ఈటల రాజేందర్ భరోసా కల్పించారు. మూసీ పేరుతో పేదల ఇళ్లను కూలుస్తామంటే ఒప్పుకోమని తేల్చి చెప్పారు. మధురిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులకు అండగా ఉంటామని తెలిపారు. సీఎం రేవంత్ దుర్మార్గాలను రాహుల్ ఆపాలంటూ సూచించారు. రాష్ట్రంలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

February 27, 2026 / 10:38 AM IST

బుసయ్యగారి పల్లిలో ఉషశ్రీ చరణ్ ‘కాఫీ విత్ క్యాడర్’

సత్యసాయి: సోమందేపల్లి మండలం బుసయ్యగారి పల్లిలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకూ వెళ్లి ప్రజలను పలకరించారు. గత జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందాయని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అన్యాయం చేస్తోందని విమర్శించారు.

February 27, 2026 / 10:38 AM IST

అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అంత సిద్ధం!

హీరో అల్లు శిరీష్‌ వివాహ వేడుకలు మొదలయ్యాయి. మార్చి 6న నయనికతో ఆయన ఏడు అడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలో మార్చి 2న అల్లు స్టూడియోస్‌లో అత్యంత గ్రాండ్‌గా ‘ప్రీ వెడ్డింగ్‌’ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్‌ ప్రముఖులు, సన్నిహితులు హాజరుకానున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరగనున్న ఈ వేడుక ఏర్పాట్లను శిరీష్ స్వయంగా వెల్లడించాడు.

February 27, 2026 / 10:36 AM IST

వైసీపీ సభ్యులపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

AP: ఇంత అసమర్థ ప్రతిపక్షాన్ని తానెప్పుడూ చూడలేదని మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ జరగకుండా పదేపదే అడ్డుకోవడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ సభ్యులు భయపడుతున్నారని, చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తిరుమల లడ్డూ అంశంపై ఎన్ని రోజులైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 

February 27, 2026 / 10:36 AM IST