PLD: చిలకలూరిపేటలో విలీనమైన పసుమర్రు, మానుకొండవారిపాలెం, గణపవరం గ్రామాలపై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మండలిలో మాట్లాడారు. కోర్టు కేసుల వల్ల వీటికి పంచాయతీ, మున్సిపల్ నిధులు రాక ఐదేళ్లుగా అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని కోర్టు కేసును త్వరగా పరిష్కరించాలని కోరారు. వెంటనే ఆ గ్రామాలకు నిధులు మంజూరు చేసి, అభివృద్ధి చేపట్టాలని కోరారు.
HNK: ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ యూత్ నాయకులు ప్రణయ్ రెడ్డి – వైష్ణవి రెడ్డి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథిగా MLA KR నాగరాజు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
ADB: జిల్లాలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ROB, RUB పనులు వేగవంతమయ్యాయి. తాంసి బస్టాండ్ వద్ద అండర్ బ్రిడ్జి, ఆర్టీవో కార్యాలయం వద్ద ఓవర్ బ్రిడ్జి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవి మూడు నెలల్లో పూర్తి కానున్నాయి. దీంతో రైల్వే గేటు వద్ద ఏళ్ల తరబడి పడుతున్న ట్రాఫిక్ ఇక్కట్లు తీరనున్నాయి. ఎట్టకేలకు పనులు కొలిక్కి వస్తుండటంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
VZM: గజపతినగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జామికి చెందిన నీటి సంఘం అధ్యక్షుడు, వైసీపీ నాయకులు సారికి గౌరినాయుడు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ మర్రాపు సురేష్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.
AP: మాజీమంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. బొత్స చెబుతున్న గజదొంగ జగనేనా. జగన్‌ను పట్టుకోవాలని అన్నారా.. మేమూ అదే చేస్తున్నాం. సిట్ విచారణలో తేలింది కదా. మాపై ఆరుకు పైగా కేసులు పెట్టారు. ఒక్క ఆధారమైనా చూపించారా.
AKP: నాతవరం:ఎంపీడీవో ఎం.ఎస్. శ్రీనివాస్ బుధవారం పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్య, చెత్త సేకరణ, తాగునీటి పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని, బయోమెట్రిక్ హాజరు, మూమెంట్ రిజిస్టర్ తప్పనిసరిగా పాటించాలన్నారు. సిబ్బంది నిర్లక్ష్యానికి చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రకాశం: దోర్నాల మండలం గంటవానిపల్లి వద్దగల వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యేలు, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత రైతులతో కలిసి నడుస్తూ పశ్చిమ ప్రాంత సమస్యల గురించి ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
PPM: రానున్న వేసవిని దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం కలగకుండా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతీ గ్రామంలో క్రాష్ ప్రోగ్రాం జరగాలని, ఒక్క గ్రామానికి కూడా నీటి ట్యాంకర్ అవసరం రాకూడదని అన్నారు.
HYD: ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న అపూర్వ ప్రగతికి ఆకర్షితులై BJPలోకి చేరికలు కొనసాగుతున్నాయని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన పలువురు BJPలో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్ద ఎత్తున యువత దేశ సేవలో భాగస్వాములు కావడానికి ముందుకు రావడం హర్షినీయమన్నారు.
ATP: నార్పలకు చెందిన సత్యనారాయణమ్మ బుధవారం కన్నుమూశారు. మరణానంతరం ఆమె కళ్లను కుటుంబ సభ్యులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. శివన్న, నాగరాజు సహకారంతో రెడ్ క్రాస్ సంస్థకు నేత్రాలను అందజేశారు. గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను రెడ్ క్రాస్ సంస్థ ప్రత్యేకంగా అభినందించారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి వెలిచేరుకు చెందిన నల్లం వెంకట్రామారావు కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని బుధవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
KDP: గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై మాజీ సీఎం జగన్ ఆరా తీశారు. మేయర్ సురేష్‌కు ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా సునీల్ కుమార్‌ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సునీల్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేస్తున్నారు.
JGL: మల్యాల మండలం నూకపల్లి సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూకపల్లి సర్పంచ్‌గా గెలిపిస్తే పదవిలో ఉన్నంతకాలం గ్రామంలో జరిగే ప్రతి ఆడపడుచు పెళ్లికి రూ.5వేలు ఇస్తానని ప్రకటించారు. ఆయన గెలిచిన తర్వాత గ్రామంలో జరిగిన మొదటి ఆడపడుచు వివాహానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
GNTR: మార్చి 1 ఆదివారం కావడంతో పింఛనుదారులకు ఒకరోజు ముందుగానే నగదు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 28 శనివారం జిల్లాలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. మొత్తం 2,51,879 మంది లబ్ధిదారులకు రూ.1095.5 కోట్లను అందించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెలవుదినాల కారణంగా ముందుగానే పింఛన్లు ఇవ్వడం ఇది ఏడోసారి.
కోనసీమ: ఇప్పడపాడు నుండి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలసి టీడీపీలో చేరితే జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు బూటకపు చేరికలు అంటున్నారని, బహుశా వారికి కళ్ళు సరిగా కనిపించటంలేదోమోనని చిన్ని గంగాధరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నుండి టీడీపీలో చేరితే అది జీర్ణించుకోలేని వీరబాబు బూటకపు చేరికలని అనటం విడ్డూరం అని అన్నారు.