PDPL: అంతర్గాం మండలం కుందనపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాలను కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని వంటగది, సామాగ్రి, పరిసరాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, అందించాలని సూచించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సత్యసాయి: ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు లాభాలు పెరుగుతాయని మంత్రి సవిత తెలిపారు. శనివారం విజయవాడలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. సహజ వనరులతో వ్యవసాయం చేయడం వల్ల నేల సారం పెరుగుతుందన్నారు.
NZB: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి అన్నారు. శనివారం సిరికొండ మండలం న్యావనంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల బాసర విజ్ఞాన విహార యాత్రను ఇవాళ ఎమ్మెల్యే ప్రారంభించారు. పార్టీ నాయకులు ఉమ్మాజి నరేష్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన బస్సును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు.
MNCL: జైపూర్ మండలంలోని వేలాలలో వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం విద్యుత్ శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డేగ స్వప్న నగేష్, డీఈ దుర్గం మల్లేశం, ఎఈ మనోహర్, ఫోర్ మెన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
SRD: మనూరు మండలం డవ్వూరు శివారులోని లొంక హనుమాన్ మందిరంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఆయన సతీమణి అనుపమ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు తీర్థ ప్రసాదాలు అందించి స్వామి వారి ఆశీస్సులు అందజేశారు.
SDPT: బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్ణయించుకుని కష్టపడి చదివితేనే విజయాన్ని సాధించగలమని సూచించారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ చేరారు. వారికి ఎంపీ నగేశ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్, నాయకులు తదితరులున్నారు.
HNK: నడికూడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులను DLPO రవిబాబు, MPDO రామకృష్ణ, తహసీల్దార్ రాణి సన్మానించారు. మహిళలు నేటి సమాజంలో అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ ముందు స్థానంలో నిలుస్తున్నారని, మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని వారు అన్నారు.
JN: స్టేషన్ ఘణపూర్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో నెలకొన్న డ్రైనేజ్ సమస్యపై మున్సిపల్ ఛైర్ పర్సన్ తాటికొండ వినయ్ కుమార్, కౌన్సిలర్ బొల్లు లక్ష్మీ స్పందించారు. శనివారం ప్రతాప్ టెంట్ హౌస్ వద్ద డ్రైనేజ్‌పై నిర్మించిన సీసీని తొలగించేందుకు నోటీసులు ఇచ్చారు. మురుగు నీరు మంచినీటిలో కలుస్తున్న సమస్యపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు.
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ఆయన మాట్లాడుతూ.. ‘అభిషేక్ శర్మ అసాధారణమైన ఆటగాడు. అతను ఒక అద్భుతమైన ప్రతిభావంతుడు. అభిషేక్ బ్యాటింగ్ చేసే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. అతడిని వేరే ఏ ఇతర బ్యాటర్‌తోనూ అస్సలు పోల్చలేము’ అని పేర్కొన్నాడు.
‘ఎస్. సరస్వతి’ కథా వివాదంపై వరలక్ష్మి శరత్‌కుమార్ స్పందించింది. ఈ మూవీ కథను రేప్ చేశారని రచయిత సాయి మాధవ్ బుర్రా ఆరోపణలను ఖండించింది. ‘నేను కథను దొంగిలించలేదు. సరైన పద్ధతిలో డబ్బు చెల్లించి కొనుగోలు చేశాను. ఆరేళ్లుగా ఆయన వద్దే ఉన్న బేసిక్ ప్లాట్‌ను తీసుకుని, నేటి అభిరుచికి తగ్గట్లు స్క్రీన్‌ప్లే మార్చాను. రచయితగా ఆయనకు పూర్తి క్రెడిట్ ఇచ్చాను’ అని పేర్కొంది.
TG: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మహా విజ్ఞాపన సభ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. తాము ఉపాధ్యాయులకు అండగా ఉంటామని ఎమ్మెల్సీలు భరోసా కల్పించారు. న్యాయం జరిగే వరకూ పోరాడదామని పిలుపునిచ్చారు.
AP: వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం వల్ల రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టిందని, కాంట్రాక్టర్లకు రూ.1.35 లక్షల కోట్ల బకాయిలు పెట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.25 వేల కోట్ల బకాయిలను చెల్లించినట్లు ఆయన చెప్పారు.
ATP: అనంతపురం పీవీకేకే సాంకేతిక కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు విద్య, రాజకీయం, సాంకేతిక రంగాల్లో రాణిస్తూ సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని కొనియాడారు.
GNTR: ఫిరంగిపురం దీనాపూర్ లోని సెయింట్ జెవియర్ ఫార్మసీ కళాశాలలో దివిస్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో పలు విభాగాలకు సంబంధించిన సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నిర్వహించిన ఇంటర్వ్యూల అనంతరం 30 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ దాసి జీవన్ మణి బాబు తెలిపారు.