• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

క్రియాశీలక సభ్యత్వంతో జనసైనికులకు భరోసా: రామయ్య

KDP: దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కల్పించని విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా కల్పిస్తోందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. శుక్రవారం సిద్దవటం మండలం ఉప్పరపల్లెలో జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని రామయ్య ప్రారంభించారు. రామయ్య మాట్లాడుతూ.. సామాజిక న్యాయ సాధనలో జనసేన పార్టీ కట్టుబడి ఉందన్నారు.

February 27, 2026 / 05:16 PM IST

ఈ వారం OTTలోకి వచ్చేసిన చిత్రాలు

➠’హనీ’ – అమెజాన్ ప్రైమ్, సన్‌నెక్స్ట్➠’ది బ్లఫ్’, ‘ఇక్కీస్’ – అమెజాన్ ప్రైమ్➠’హాట్‌స్పాట్ 2 మచ్’ – ఆహా➠’శ్రీ చిదంబరం గారు’ – ఈటీవీ విన్➠’రాస్లిన్: సీక్రెట్ స్టోరీ’ – జియో హాట్‌స్టార్➠’డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు కనబడుటలేదు'(వెబ్‌సిరీస్) – జీ5.

February 27, 2026 / 05:16 PM IST

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

KRNL: ఆస్పరి మండలం పుట్టకలమర్రి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 50 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి శుక్రవారం ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనితకు సిటీ స్కాన్ అవసరమని డాక్టర్ చెప్పడంతో, మెరుగైన చికిత్సకు తక్షణ ఏర్పాట్లు చేస్తామని అయన హామీ ఇచ్చారు.

February 27, 2026 / 05:15 PM IST

పాల డైరీ కేంద్రాలను తనిఖీలు చేసిన అధికారులు

KRNL: ఎమ్మిగనూరులో పాల డైరీ కేంద్రాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్థానిక తిరుమల పాల డైరీ కేంద్రాన్ని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ పరిశీలించి పాల పాకెట్లు, పాలను ల్యాక్టోమీటర్‌తో పరీక్షించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్, కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో పాల శ్యాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు.

February 27, 2026 / 05:15 PM IST

శస్త్ర చికిత్స కోసం LOC అందజేత

ASF: దహేగాం మండలం హత్తిని గ్రామానికి చెందిన అల్లి భాగ్యమ్మకి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 75,000 LOC లెటర్‌ను MLA హరీష్ బాబు శుక్రవారం అందజేశారు. భాగ్యమ్మకి మోకాలు మార్పిడి శస్త్ర చికిత్స కోసమై సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నగదు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 27, 2026 / 05:15 PM IST

కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో: రాయల నాగేశ్వరరావు

KMM: భూదాన్ భూముల విషయంలో కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయం చేస్తున్నారని, తన నోటిని అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు హెచ్చరించారు. అసత్య ప్రచారాలు చేస్తూ BRS నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన శుక్రవారం ఖమ్మంలో చెప్పారు. జిల్లా మంత్రులు పేదలకు వ్యతిరేకం కాదని, దళారులను నమ్మి పేదలు మోసపోయారన్నారు.

February 27, 2026 / 05:14 PM IST

డోన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

నంద్యాల: జిల్లా డోన్ జాతీయ రహదారిపై జగదుర్తి వద్ద శుక్రవారం కారు క్రేన్ ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ప్రమోద్ తిరుమల దర్శనం ముగించి కర్నూలు వైపు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె అక్కడే మృతి చెందారు. ప్రదీప్ తీవ్రంగా గాయపడి స్థానికులు ఆసుపత్రికి తరిలించారు.

February 27, 2026 / 05:14 PM IST

ఉపకార వేతనాలకు విద్యార్థినిల ఎంపిక

NLG: చిట్యాల మండలం ఎలికట్టే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు NMMS ఫలితాలలో ఘనవిజయం సాధించారు. పాఠశాలకు చెందిన పి.హరిణి, ఎస్.కావ్యశ్రీ ఉపకార వేతనాలకు ఎంపికైనట్లు హెచ్ఎం నర్సింహా తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను హెచ్ఎం, ఉపాధ్యాయులు రాంభూపాల్, రవి, పి.వెంకన్న, బి.రామ్మోహన్, డి.వెంకన్న, ఎ.దుర్గయ్య, పి.వెంకన్న అభినందించారు.

February 27, 2026 / 05:12 PM IST

కానిస్టేబుల్ నసీరుద్దీన్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ATP: అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నసీరుద్దీన్ మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. గుండెపోటుతో మరణించిన ఆయన కుటుంబానికి జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు తక్షణ సాయంగా సిబ్బంది రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, సీఐ రాజేంద్రనాథ్ పాల్గొన్నారు.

February 27, 2026 / 05:12 PM IST

రేడియో కాలర్‌తో పులి కదలికల పర్యవేక్షణ

ASR: పులి కదలికలను రేడియో కాలర్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు రంపచోడవరం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. రంపచోడవరం అటవీ డివిజన్ పరిధిలోని రంప, పెద్దకొండ, సూదికొండ, భీమవరం అటవీ సమీప గ్రామాల్లో అటవీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

February 27, 2026 / 05:11 PM IST

కలెక్టర్‌కు MLA గూడెం మహిపాల్ రెడ్డి లెటర్

SRD: పటాన్ చెరువులో 300 కోట్ల CSR నిధుల ‘సూపర్ స్పెషాలిటీ హాస్పటల్’కు దివంగత డాక్టర్ కిషన్ రావు పేరుపెట్టాలని పారిశ్రామిక ప్రాంత మేధావుల బృందం సభ్యులతో పటాన్చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి పంపించిన లెటర్ తన చేరిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. వెంటనే రాష్ట్ర వైద్య విధాన పరిషత్తుకు పంపిస్తున్నట్ల కలెక్టర్ తెలిపారు. ప్రజల నుండి విజ్ఞాపనలు వస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

February 27, 2026 / 05:11 PM IST

జమ్మికుంట మార్కెట్‌లో స్థిరంగా పత్తి ధరలు

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఈ వారం ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. గత కొన్ని రోజులుగా పత్తి క్వింటాల్ ధర గరిష్టంగా రూ. 7,550 నుంచి రూ. 7,600 మధ్యనే ఊగిసిలాడింది. శుక్రవారం మార్కెట్‌కు 28 వాహనాల్లో 226 క్వింటాళ్ల విడి పత్తి రాగా గరిష్టంగా రూ. 7,550 పలికింది.

February 27, 2026 / 05:10 PM IST

‘ఆజాద్ దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తి’

SRCL: చంద్రశేఖర్ ఆజాద్ దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తి అని వేములవాడ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ అన్నారు. పోరాట వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 95 వర్ధంతి సందర్భంగా వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

February 27, 2026 / 05:10 PM IST

చెవి ఆకారంతో వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చా..?

శరీర భాగాల ఆకృతిని బట్టి ఒక వ్యక్తి స్వభావాన్ని అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెద్ద చెవులు ఉన్నవారు ఆత్మవిశ్వాసం, నిజాయితీ కలిగి ఉండి, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారని వివరిస్తున్నారు. చిన్న చెవులు ఉన్నవారు లోతైన ఆలోచనాపరులై, క్రమశిక్షణతో లక్ష్యం వైపు దూసుకుపోతారని అంటున్నారు. ఇలా చెవుల ఆకృతిని బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.

February 27, 2026 / 05:10 PM IST

మున్సిపల్ ఛైర్మన్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ

RR: మొయినాబాద్‌లోని అంజనదేవి గార్డెన్‌లో ఇవాళ మొయినాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్‌లకు సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, MLA కాలే యాదయ్య, HYD మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ అభిరుద్దికి తమ వంతు సహకారం అందచేస్తామని అన్నారు.

February 27, 2026 / 05:07 PM IST