• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పవన్ కళ్యాణ్ కోసం హోంబలే ఫిల్మ్స్!

పవన్‌ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ 2026 మార్చి 26న విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ క్రేజ్, హోంబలే బ్రాండ్ తోడవడంతో అక్కడ రికార్డు వసూళ్లు రావడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 

February 27, 2026 / 12:06 PM IST

డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిరంతర నిఘా

BPT: జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగే ప్రాంతాలపై శుక్రవారం పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం తాగడం, గంజాయి వాడకం, పేకాట, ఈవ్‌టీజింగ్, దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సాంకేతికతను వినియోగించి జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.

February 27, 2026 / 12:05 PM IST

జిల్లాలో నేటితో ముగిసిన FLN శాంపుల్ సర్వే

NRML: SCERT తెలంగాణ ఆధ్వర్యంలో జిల్లాలోని 53 పాఠశాలల్లో FLN శాంపుల్ సర్వే శుక్రవారం పూర్తైంది. 2వ తరగతి విద్యార్థులకు మూడు రోజుల పాటు టాంజెరిన్ యాప్ ద్వారా అసెస్మెంట్ నిర్వహించారు. పిల్లల సామర్థ్యాల స్థాయిని అంచనా వేయడమే లక్ష్యమని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న సందర్భంగా తెలిపారు.

February 27, 2026 / 12:03 PM IST

మేజిక్బస్ ఇండియా ఫౌండేషన్‌తో కేయూ ఒప్పందం

HNK: KU మేజిక్బస్ ఇండియా ఫౌండేషన్‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సంవత్సరం కాలం ఉండే ఈ ఎంఓయూపై రిజిస్ట్రార్ వి.రామచంద్రం, డిప్యూటీ జనరల్ మేనేజర్ శేఖరబాబు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల యువతకు స్కిల్ డెవలప్‌మెంట్, కెరీర్ మార్గదర్శకం, జాబ్ ఓరియెంటెడ్ శిక్షణ,ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 12:02 PM IST

వనపర్తిలోని 31వ వార్డులో పారిశుద్ధ్య పనులు

WNP: పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం సిద్ధిస్తుందని వనపర్తి 31వ వార్డు కౌన్సిలర్ బండారు విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం బసవన్నగడ్డ కాలనీలో మున్సిపల్ కార్మికులతో కలిసి ఆమె పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. మురుగు కాలువలు, రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగింపజేశారు. పరిశుభ్రత విషయంలో కాలనీవాసులు సహకరించాలని ఆమె కోరారు.

February 27, 2026 / 12:01 PM IST

మూడో రోజు ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

MHBD: జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌మీడియట్ పరీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాస్తున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

February 27, 2026 / 12:01 PM IST

డ్రిప్ ఇరిగేషన్ ఆటోమేషన్ పథకం పోస్టర్లు ఆవిష్కరణ

సత్యసాయి: ఏపీఎంఐపీ డ్రిప్ ఇరిగేషన్ ఆటోమేషన్ పథకం పోస్టర్లను కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ విడుదల చేశారు. మొబైల్ యాప్ ద్వారా నీటి సరఫరాను నియంత్రించే ఈ సాంకేతికతతో విద్యుత్, ఎరువులు ఆదా అవుతాయని తెలిపారు. చిన్న రైతులకు 55%, పెద్ద రైతులకు 45% సబ్సిడీ అందుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని 416 రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

February 27, 2026 / 12:00 PM IST

ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి

ప్రకాశం: కంభంలోని కందులాపురం గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను బకాయిలు ఉండటంతో ఎంపీడీఓ వీరభద్రాచారి శుక్రవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎంపీడీఓ స్వయంగా పాల్గొని పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు IVRS కాల్స్ ద్వారా వచ్చే సమాచారం గురించి వివరించి, సమయానికి పన్నులు చెల్లించాలని అవగాహన కల్పించారు.

February 27, 2026 / 12:00 PM IST

చప్పట్లతో వెన్ను నొప్పికి చెక్..!

సాధారణంగా ఎవరినైనా అభినందించడానికి, ప్రోత్సహించడానికి చప్పట్లు కొడతాం. కానీ, చప్పట్లు కొట్టడం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీన్నే క్లాపింగ్ థెరపీ అని కూడా అంటారు. చప్పట్లతో శరీర భాగాలకు సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్లు యాక్టివేట్ అవుతాయి. దీంతో వెన్ను నొప్పి, ఒత్తిడి, ఆందోళ, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

February 27, 2026 / 11:59 AM IST

25% సీట్ల కేటాయింపు గోడపత్రిక ఆవిష్కరణ

VSP: 2026-27విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి తరగతిలో 25% పేద బాలలకు ఉచిత కోటా సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం ఎంవీపీ కాలనీలోని ప్రిన్సిపాల్ డా.కే జగదీశ్వరరావుతో కలిసి గోడపత్రికను ఆవిషరించారు. జిల్లాలో అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీ రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరమ్ కన్వీనర్ నరవ ప్రకాశరావు కోరారు.

February 27, 2026 / 11:59 AM IST

కాసేపట్లో కవిత మీడియా సమావేశం

TG: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్‌కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో విముక్తిపై స్పందించనున్నారు. కాగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత సహా కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాకు విముక్తి లభించిన విషయం తెలిసిందే.

February 27, 2026 / 11:58 AM IST

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిన నూతన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన అనురాగ్ జయంతి శుక్రవారం ఉదయం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త కలెక్టర్‌కి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

February 27, 2026 / 11:58 AM IST

కుల్కచర్లలో తడి-పొడి చెత్త బుట్టల పంపిణీ

VKB: స్వచ్ఛ గ్రామాల లక్ష్యంతో కుల్కచర్ల మండలంలోని చెరువు ముందలితండా గ్రామపంచాయతీలో శుక్రవారం తడి, పొడి చెత్త కోసం వేర్వేరు రంగుల చెత్త బుట్టలను పంపిణీ చేశారు. గ్రామంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, వ్యర్థాలను వేరు చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని శుభ్రతపై అవగాహన పెంపొందించారు.

February 27, 2026 / 11:57 AM IST

‘విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి’

PPM: కురుపాంలోని గురుకుల పాఠశాలలో డయోరియా బారిన పడిన నలుగురు గిరిజన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. అదే పాఠశాలలో గతంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఇంకా ఆ పాఠశాలలో స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వలేదన్నారు.

February 27, 2026 / 11:56 AM IST

సరైన పత్రాలు లేకుంటే చిక్కుల్లో పడతారు: ఏలూరు సీఐ

ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపీ మేస్త్రి కాలనీలో సీఐ అశోక్ కుమార్ శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. సరైన పత్రాలు లేని వాహనాలను కొనుగోలు చేస్తే చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. ఎస్పీ ఆదేశాలతో 8 ప్రత్యేక బృందాలతో కలిసి తనిఖీలు నిర్వహించామన్నారు.

February 27, 2026 / 11:56 AM IST