ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ఐఫోన్ (iOS) యూజర్లు లాగిన్ అవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుండి ఈ సమస్య మొదలైందని నెటిజన్లు ‘X’ వేదికగా వాపోతున్నారు. మొబైల్ యాప్ పనిచేస్తున్నా, వెబ్ వెర్షన్ మొరాయిస్తుండటంతో ఆఫీసు పనులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.