AP: గన్నవరం ఎయిర్‌పోర్టులో సర్వీసుల కొరత ఉందని బోండా ఉమ అన్నారు. కేంద్రమంత్రిగా రామ్మోహన్ ఉన్నా ఉపయోగం లేదన్నారు. కాశీ, గోవా, షిర్డీ, మైసూర్‌కు విమాన సర్వీసులు లేవన్నారు. హైదరాబాద్ నుంచి వందలాది సర్వీసులు ఉన్నాయని, విజయవాడ నుంచి 15 సర్వీసులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. దుబాయ్, దోహా సహా అన్ని రాష్ట్రాల రాజధానులకు విజయవాడ నుంచి నడపాలని తెలిపారు.