• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు..!

SDPT: హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఉమ్మాపూర్ గ్రామానికి చెందిన అందే బాలయ్య రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన లారీ ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలయ్య కాలుకు బలమైన గాయం కావడంతో, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను హన్మకొండ ఆసుపత్రికి తరలించారు. 

March 30, 2026 / 08:50 PM IST

త్వరలో దేవరకొండ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తా: గవర్నర్

నల్గొండ జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో రెడ్ క్రాస్ ద్వారా జరుగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సేవలను అభినందించిన గవర్నర్, త్వరలోనే దేవరకొండ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.

March 30, 2026 / 08:49 PM IST

భూ ఆక్రమణపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

SRD: పటాన్‌చెరు మండలం పోచారం గ్రామంలో సర్వే నంబర్ 62లోని 6 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ జగన్ ఆరోపించారు. రైతులకు ఎంతో ఉపయోగపడే నక్ష బాటను సైతం కబ్జాదారులు ఆక్రమించారన్నారు. ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక MROకు వారు వినతిపత్రం అందజేశారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

March 30, 2026 / 08:48 PM IST

BHPL గ్రామాల్లో ఎంత మంది వాలంటర్లు అంటే..!

BHPL: రెవెన్యూ గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించేందుకు BHPL జిల్లాలో వాలంటీర్ల నియామకం జరుపుతున్నట్లు వ్యవసాయ అధికారి బాబూరావు తెలిపారు. రెవెన్యూ గ్రామానికి ముగ్గురు చొప్పున 223 గ్రామాల్లో 669 మందిని నియమించనున్నట్లు వెల్లడించారు. వరంగల్ వ్యవసాయ క్షేత్రంలో మట్టి నమూనాలను విశ్లేషించే శాస్త్రజ్ఞులు వాలంటీర్లకు శిక్షణ ఇస్తారని తెలిపారు.

March 30, 2026 / 08:48 PM IST

మైసిగండి మైసమ్మ హుండీ ఆదాయం ఎంతంటే

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండిలో ప్రసిద్ధి చెందిన మైసమ్మ దేవాలయ హుండీ ఆదాయం రూ. 9,80,780 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి స్నేహలత తెలిపారు. సోమవారం ఆలయ ఆవరణలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గత 60 రోజుల హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ప్రణీత్, ఆలయ ఫౌండర్ ట్రస్టీ శిరోలి, ఎస్సై వరప్రసాద్ పాల్గొన్నారు.

March 30, 2026 / 08:47 PM IST

జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

MDK: 2027 జనగణన ప్రక్రియను జిల్లాలో అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈసారి జనగణన రెండు దశల్లో జరుగుతుందని.. మొదటి దశలో గృహాల వివరాలు, రెండో దశలో జనాభా వివరాల సేకరణ ఉంటుందని వివరించారు.

March 30, 2026 / 08:47 PM IST

సీడ్ బాల్స్ తయారీపై విద్యార్థులకు శిక్షణ

MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని టీజీఎంఎస్ పాఠశాలలో ఇవాళ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రావు విద్యార్థులకు సీడ్ బాల్స్ తయారీపై శిక్షణ ఇచ్చారు.ఈ సీడ్ బాల్స్‌ను చెట్లు లేని ప్రాంతాల్లో వేయడం ద్వారా తెలంగాణలో అడవి విస్తీర్ణం పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని పేర్కొన్నారు.

March 30, 2026 / 08:46 PM IST

‘ఒక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానం’

JGL: ఒక్క సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానమని, మెట్‌పల్లి డీఎస్పీ రాములు అన్నారు. మెట్‌పల్లి పట్టణంలోని 26వ వార్డులో కౌన్సిలర్ రమేశ్ నూతనంగా ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను డీఎస్పీ రాములు సోమవారం ఛైర్మన్ లింబాద్రితో కలిసి ప్రారంభించారు. భద్రతను పెంపొందించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.

March 30, 2026 / 08:45 PM IST

కంపుకొడుతున్న మార్కెట్ యార్డ్

VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని మార్కెట్ యార్డ్ పరిసరాలు చెత్తాచెదారంతో పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్యం అధ్వానంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

March 30, 2026 / 08:45 PM IST

వీర్నపల్లిలో భారీ దొంగతనం.. బంగారం, నగదు అపహరణ

SRCL: జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో పట్టపగలే దొంగతనం జరిగింది. బాధితుడు వడ్లూరి రాజం వివరాల ప్రకారం.. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి రూ. 2 లక్షల నగదు, బంగారు పుస్తెలు, 6 తులాల బ్రాస్లెట్లు, వెండి గొలుసులు అపహరించారని పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

March 30, 2026 / 08:45 PM IST

ధాన్యం సేకరణకు సర్వం సిద్ధం: కలెక్టర్

KMM: ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన యాసంగి (రబీ) 2025-26 ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించి, సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రవాణా వాహనాలకు GPS ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

March 30, 2026 / 08:42 PM IST

‘ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలి’

NRML: ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూ పేద విద్యార్థులకు విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు అన్నారు. మండలంలోని పాక్ పట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు అనేకసార్లు తమ సమస్యలపై ముఖ్యమంత్రికి చెప్పిన అవి పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

March 30, 2026 / 08:42 PM IST

ఒంగోలు పీఎంఏవై 2.0 గృహ ప్రవేశ కార్యక్రమం

ప్రకాశం: ఒంగోలు 29వ డివిజన్ కొనిజేడు బస్ స్టాండ్ వద్ద ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పీఎంఏవై 2.0 గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొని, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మందికి ఇళ్ల కల నెరవేరుస్తున్నామని, అర్హులైన వారు పథకాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

March 30, 2026 / 08:39 PM IST

గోదావరి నదిని పరిశీలించిన నేతలు

PDPL రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని మురికినీరు నేరుగా గోదావరిలో కలవడంపై బీఆర్ఎస్ నేతలు కౌశిక హరి, పర్లపల్లి రవి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నదిని పరిశీలించిన వారు.. వేసవిలో కార్మిక కుటుంబాలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం విఫలమయ్యాయని విమర్శించారు. కలుషిత నీటి వల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు.

March 30, 2026 / 08:39 PM IST

గిగ్ వర్కర్స్, న్యాయవాదుల బిల్లులకు ఆమోదం

TG: రాష్ట్ర శాసన మండలి ఇవాళ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి సంక్షేమం కోసం ‘గిగ్ వర్కర్స్ బిల్లు-2026’కు పచ్చజెండా ఊపింది. అలాగే, న్యాయవాదుల భద్రతను పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన ‘న్యాయవాదుల రక్షణ బిల్లు’ కూడా ఆమోదం పొందింది. ఈ చట్టాలు ఆయా రంగాల వారికి సామాజిక భద్రతతో పాటు వృత్తిపరమైన రక్షణను కల్పిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

March 30, 2026 / 08:39 PM IST