సత్యసాయి: సోమందేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. తహశీల్దార్ మారుతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, రెవెన్యూ సంబంధిత పనుల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
NGKL: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 7 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.
MLG: చెక్ బౌన్స్ కేసులో ఒక వ్యక్తికి కోర్టు 30 రోజుల జైలు శిక్ష విధించింది. 2023లో శంకర్‌కు శ్రీనివాస్ రూ.8 లక్షల అప్పుకు చెక్ ఇచ్చాడు. బ్యాంకులో వేయగా చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు కేసు వేశాడు. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి శిక్ష విధించారు. ఈ విషయాన్ని ఎస్సై ఉపేందర్ తెలిపారు.
TPT: ఏపీ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి సమీపంలో ఉన్న శ్రీభాగ్య అతిథి భవనం వద్ద టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు ఆయనకు స్వాగతం పలికి బస ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.
కోనసీమ: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా పదోన్నతి పొందిన జిల్లా JC నిశాంతిని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇవాళ సత్కరించారు. అమలాపురంలో జేసీను కలిసి ఆమెకు మొక్కను అందించి, శాలువాతో సన్మానించారు. కలెక్టర్‌గా ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని అభిలాషించారు.
SRPT: హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత సాంకేతిక సంస్థలో 2026-27 విద్యాసంవత్సరానికి డిప్లొమా ప్రవేశాలు ప్రారంభమైనట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని, అర్హులైన విద్యార్థులకు నెలకు రూ.2,500 స్టైపెండ్ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు.
BDK: జిల్లాలోని 26వ డివిజన్‌కు చెందిన దుంపల రాజేష్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్లకార్డ్ ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను వెల్లడించారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ డ్రైవర్లకు సరైన జీతాలు ఇవ్వడం లేదని, ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
MDK: ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పెద్ద శంకరంపేట మండల ప్రత్యేక అధికారి జగదీష్ అన్నారు. సోమవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజావాణిలో 2 దరఖాస్తులు వచ్చినట్లు వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభుదాసు పాల్గొన్నారు.
MDCL: భార్య మందలించిందని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్కేసర్ PS పరిధిలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన పన్నీరు నరసింహ(45) రోజూ మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు. ఈ విషయమై భార్య మందలించడంతో మనస్థాపానికి గురై సోమవారం ఉదయం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొన్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.
సిరిసిల్ల బార్ అసోసియేషన్ నూతన కమిటిని ఇవాల ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆవునూరి రమాకాంత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమాకాంత్ మాట్లాడుతూ.. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. అతనికి పలువురు శుభకాంక్షలు తెలిపారు.
HNK: హన్మకొండ నగరంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 142/2022 నమోదైన పాక్సో కేసులో సోమవారం న్యాయమూర్తి అపర్ణ దేవి నిందితుడు వల్లేపు రాజుకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేయడంతో బాధితురాలికి న్యాయం జరిగిందని ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వేడుకకు వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో తల్లీకుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది
PLD: పురపాలక సంఘ ఆస్తిపన్నులు చెల్లించే వారి కోసం మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం రాత్రి 11 గంటల వరకు క్యాష్ కౌంటర్లు తెరిచే ఉంటాయని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు సోమవారం తెలిపారు. ఒకేసారి బకాయిలు చెల్లించే వారికి 50 శాతం డిస్కౌంట్ కల్పించడం జరుగుతుందని బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
VSP: వీఎంఆర్డీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ప్రజల నుంచి 14 వినతులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని, ప్లానింగ్, ఎస్టేట్ తదితర విభాగాలకు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వినతులపై సమగ్రంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.