• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రహదారి విస్తరణ పనులు ప్రారంభం

KNR: శంకరపట్నం మండలంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి హైస్కూల్ వరకు రహదారి విస్తరణ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ ఆకు బత్తిని విజయకుమార్ ఆధ్వర్యంలో యజమానుల అనుమతితో రోడ్డుకు అడ్డంగా ఉన్న పాత ఇళ్ల గోడలను తొలగిస్తున్నారు. ఈ పనుల వల్ల రాకపోకలు సులభతరం అవుతాయని స్థానికులు తెలిపారు.

March 1, 2026 / 04:01 PM IST

ఆత్మకూరు మున్సిపల్ పాలకమండలికి సన్మానం

WNP: ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆత్మకూరు మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ నాగమణి, వైస్ ఛైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కౌన్సిలర్లకు పెద్దమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కమిటీ ఛైర్మన్ ఎం. శ్రీధర్ గౌడ్ శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

March 1, 2026 / 04:01 PM IST

’18న వరంగల్లో దళిత మహాసభ’

ADB: అంబేద్కర్ అభయ హస్తం, చేవెళ్ల డిక్లరేషన్ హామీని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మహేందర్ అన్నారు. ఈనెల 18న వరంగల్లో నిర్వహించనున్న దళిత మహాసభ కరపత్రాలను ఆదివారం ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరించారు. మహాసభను విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ ఉద్య మకారులకు స్థలం కేటాయించాలన్నారు.

March 1, 2026 / 04:01 PM IST

శంకుస్థాపనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

GNTR: తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపాడు శివారులో పిచ్చుకులపాలెం వద్ద జరగనున్న ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ భవన నిర్మాణ శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటారు.

March 1, 2026 / 04:00 PM IST

శంకుస్థాపనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

GNTR: తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొండపాడు శివారులో పిచ్చుకులపాలెం వద్ద జరగనున్న ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ భవన నిర్మాణ శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటారు.

March 1, 2026 / 04:00 PM IST

ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలి: హుస్సేన్ నాయక్

JN: నూతనంగా విజయం సాధించిన సర్పంచ్, వార్డు మెంబర్లు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అన్నారు. నర్మెట్ట మండలంలో నూతనంగా ఎన్నికైన GP పాలకవర్గ సభ్యులను హుస్సేన్ నాయక్ సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని అన్నారు.

March 1, 2026 / 03:58 PM IST

USAలో ‘పెద్ది’ ఈవెంట్.. ఎప్పుడంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా USAలో ఏప్రిల్ మొదటి వారంలో గ్రాండ్ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ సక్సెస్ అయితే ‘పెద్ది’ అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారట. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.

March 1, 2026 / 03:56 PM IST

‘ఆసుపత్రిలోని పత్రిలోని సమస్యలు పరిష్కరించాలి’

సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఔషధాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

March 1, 2026 / 03:55 PM IST

‘ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరించాలి’

సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఔషధాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

March 1, 2026 / 03:55 PM IST

చర్లలో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన

BDK: చర్లలో రూ.10.70 కోట్లతో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఈ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుందని మంత్రి తెలియజేశారు.

March 1, 2026 / 03:55 PM IST

అనాథ యువతి పెళ్లికి ఎమ్మెల్యే సాయం

ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ముదిగల్లుకు చెందిన అనాథ యువతి ప్రమీద వివాహానికి MLA అమిలినేని సురేంద్ర బాబు ఆర్థిక చేయూతనిచ్చారు. తల్లిదండ్రులు లేని ఆ అమ్మాయి పెళ్లి కోసం ఒక పట్టుచీరతో పాటు రూ.15,000 నగదును అందజేశారు. స్థానిక నాయకులు గౌని శ్రీనివాసులు రెడ్డి, ఊటంకి రామాంజనేయులు సమక్షంలో ఈ సాయాన్ని యువతి పెద్దనాన్న, పెద్దమ్మలకు అప్పగించారు.

March 1, 2026 / 03:52 PM IST

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకం: ఎమ్మెల్యే

MBNR: మహబూబ్‌నగర్ ప్రెస్ క్లబ్‌లో TWJF ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు సహాయం అందించేందుకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని సూచిస్తూ ప్రతి నెలా రూ.1 లక్ష నిధికి అందిస్తానని హామీ ఇచ్చారు.

March 1, 2026 / 03:51 PM IST

‘విష్ణు విన్యాసం’ రెండు రోజుల కలెక్షన్స్

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘విష్ణు విన్యాసం’. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అదరగొడుతోంది. రెండు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.9.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన ఈ మూవీకి రధన్ మ్యూజిక్ అందించాడు.

March 1, 2026 / 03:51 PM IST

‘ PRTU భవనానికి స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తా’

SRPT: సూర్యాపేటలో పీఆర్టీయు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తానని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్‌లో ఆత్మకూరు(ఎస్) మండలం ఏవీకే తండా పాఠశాల ఉపాధ్యాయురాలు తంగేళ్ళ పద్మ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.

March 1, 2026 / 03:51 PM IST

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. HYDలో నిరసనలు

TG: హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. ఖమేనీ మృతికి సంతాపంగా వందలాది మంది నిరసనకు దిగారు. ఖమేనీ చిత్రపటాలను ప్రదర్శిస్తూ తమ సంతాపాన్ని ప్రకటించారు. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే.

March 1, 2026 / 03:50 PM IST