• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన

SDPT: అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరిపల్లిలో లీడ్ బ్యాంకు సహకారంతో సైబర్ మోసాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై అవగాహన నిర్వహించారు. సర్పంచ్ నాగరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో TGB చిట్టాపూర్ బ్యాంకు మేనేజర్ అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. PMSBY, PMJJBY లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 25, 2026 / 01:18 PM IST

‘రహదారిని అభివృద్ధి చేయాలి’

AKP: ఎలమంచిలి- గాజువాక రోడ్డును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని MLA సుందరపు విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం శాసనసభలో మాట్లాడుతూ.. ప్రస్తుతం 40 అడుగులు ఉన్న రహదారిని విస్తరించాలన్నారు. ఈ రహదారి మీదుగానే SEZ లో పరిశ్రమలకు వెళ్లాలన్నారు. పరిశ్రమలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను జాప్యం లేకుండా తరలించేందుకు రహదారులపై దృష్టి సారించాలన్నారు.

February 25, 2026 / 01:16 PM IST

రైతుల ట్రాన్స్‌ఫార్మర్ చోరీ… ఆగని దొంగల దురాగతాలు

BDK: మణుగూరు మండలం సమితి సింగారం కోడిపుంజుల వాగు వ్యవసాయ క్షేత్రంలో రైతుల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లను గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి అపహరించుకుపోయారు. బుధవారం ఉదయం రైతులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగా ఈ ఘటనను చూసి షాక్ అయ్యారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఇలాంటి దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.

February 25, 2026 / 01:15 PM IST

లంచ్ తర్వాత నిద్రొస్తోందా..?

మధ్యాహ్నం భోజనం తర్వాత వచ్చే నీరసం, మగతను వదిలించుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. తిన్న వెంటనే నిద్రపోకుండా పది నిమిషాల పాటు నడవడం ఉత్తమం. శరీరంలో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు తాగాలి. ఒకేసారి అతిగా తినకుండా, తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. అలాగే రాత్రిపూట కంటినిండా నిద్ర ఉంటే మరుసటి రోజు ఉత్సాహంగా ఉండొచ్చు.

February 25, 2026 / 01:13 PM IST

గుండెపోటుతో సీనియర్ న్యాయవాది కన్నుమూత

SKLM: ఆమదాలవలసలో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన హనుమంతు ప్రసాద్ (70) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఛాతిలో నొప్పి ఉందని కుటుంబ సభ్యులకు తెలపడంతో స్థానిక వైద్యులకు సమాచారం అందించారు. ఆమదాలవలసలోని ఆయన స్వగృహానికి వైద్యులు చేరుకునే సరికి ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

February 25, 2026 / 01:12 PM IST

మరోదారి చూసుకోకపోతే.. ఏమీ మిగలదు: తమన్నా

నటీనటులు ఫామ్‌లో ఉన్నప్పుడే ఆర్థికంగా స్థిరపడాలని తమన్నా తెలిపింది. అవకాశాలు ఉన్నప్పుడే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. తన తండ్రి నుంచి ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకున్నానని, ప్రస్తుతం రియల్ ఎస్టేట్, జ్యువెలరీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టానని, పక్కా ప్లానింగ్ ఉంటేనే కెరీర్ తర్వాత ధైర్యంగా ఉండొచ్చని పేర్కొంది.

February 25, 2026 / 01:12 PM IST

పీఏసీఎస్ వద్ద రైతుల ధర్నా

NLG: నల్గొండ పట్టణం, పానగల్ పీఏసీఎస్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషాం మాట్లాడుతూ.. యూరియా యాప్‌ను రద్దు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. సాగుకు అత్యవసరమైన సమయంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాయకులు, రైతులు పాల్గొన్నారు.

February 25, 2026 / 01:11 PM IST

పరీక్షకు ఆలస్యం.. అనుమతించని అధ్యాపకులు

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాచర్ల గొల్లపల్లికి చెందిన పిట్ల శరణ్య రాచర్ల కళాశాలలో ఇంటర్ చదువుతోంది. పరీక్షా కేంద్రానికి ఉ.9:20కి ఆమె చేరుకోవడంతో ఉపాధ్యాయులు పరీక్ష కేంద్రానికి అనుమతించలేదు. దీంతో విద్యార్థిని రోదిస్తూ గేటు వద్ద ఉండిపోయింది. తన తమ్ముడిని స్కూలుకు పంపించి వచ్చేసరికి ఆలస్యమైందని శరణ్య ఆవేదన వ్యక్తం చేసింది.

February 25, 2026 / 01:11 PM IST

సీఎం రేవంత్‌ రెడ్డి‌తో అడోబ్‌ సీఈవో భేటీ

TG: HYDలో సీఎం రేవంత్‌రెడ్డిని అడోబ్‌ CEO శంతను నారాయణ్‌ కలిశారు. తెలంగాణ రైజింగ్‌ బోర్డు సభ్యుడిగానూ శంతను కొనసాగుతున్న నేపథ్యంలో గ్లోబల్‌ ట్రెండ్స్‌, కొత్త అవకాశాలపై చర్చించారు. ఉద్యోగాలపై AI ప్రభావం, గ్రీన్‌ ఎనర్జీ, ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై మాట్లాడారు. ఏఐని సమర్థంగా వినియోగించుకునే విషయంపై రేవంత్‌ చర్చించినట్లు సమాచారం.

February 25, 2026 / 01:10 PM IST

రాజమండ్రిలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష

E.G: అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం రాజమండ్రిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కొనసాగాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీ వర్కర్లకు తగిన వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీకి నియమ నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేశారు. వివిధ సంక్షేమ పథకాలను వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 01:10 PM IST

యూట్యూబర్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్వీస్ట్

TG: యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిందితుడు అఖిల్ రాయదుర్గం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే అఖిల్ మరో అమ్మాయితో ప్రేమలో ఉండటంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. కోమలి ఆత్మహత్యకు అఖిల్ అనే వ్యక్తి కారణమని ఆమె స్నేహితులు తెలిపారు. కోమలి సూసైడ్ లెటర్‌‌లోనూ అఖిల్ పేరు ఉండటంతో అతడు పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అయ్యాడు.

February 25, 2026 / 01:10 PM IST

మీడియాతో సమావేశం నిర్వహించిన ఎస్సై

TPT: దొరవారిసత్రంలో ఇవాళ ఉదయం ఎస్సై జీవీ చౌదరి మీడియాతో సమావేశం నిర్వహించారు. రోడ్ మీద ట్రాఫిక్ నియంత్రణ, గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి, నిర్లక్ష్యానికి తావులేదని హెచ్చరించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు.

February 25, 2026 / 01:09 PM IST

‘రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి’

SRPT: నడిగూడెం మండలం సిరిపురం రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల రైతులందరూ, ఈనెల 28 లోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఏఈవో రేణుక బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు లబ్ధి పొందేందుకు ఈ నమోదు అవసరమని తెలిపారు. రైతులందరూ 28 లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.

February 25, 2026 / 01:09 PM IST

వెలగమేకలపల్లి బీటీ రోడ్డుకు భూమిపూజ

సత్యసాయి: సోమందేపల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారి నుంచి వెలగమేకలపల్లి గ్రామం వరకు రూ.1.48 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు బుధవారం కూటమి నాయకులు, అధికారులు భూమిపూజ నిర్వహించారు. దశాబ్దాలుగా ఉన్న రవాణా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది.

February 25, 2026 / 01:07 PM IST

గుంటూరులో పాల కేంద్రాల తనిఖీలు

గుంటూరు: పట్టణంలో బుధవారం పశుసంవర్ధక శాఖ జేడీ కె.వి.వి.సత్యనారాయణ పలు పాల కేంద్రాలను తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా పాలు విక్రయించరాదని ఆయన స్పష్టం చేశారు. పలు కేంద్రాల్లో పాల నమూనాలను సేకరించి, పరీక్షల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి పాల విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు.

February 25, 2026 / 01:07 PM IST