SRCL: మున్సిపల్ కో ఆప్షన్ పదవుల కోసం పలువురు ఆశావహులు నిరీక్షిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీకి చెందిన ముస్లిం నాయకులు అబ్దుల్ రజాక్, పీర్ మహ్మద్, బాబున్, క్రైస్తవ నాయకులు ఇన్నారెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యత్వం కోసం విప్‌తో మంతనాలు జరుపుతున్నారు.
BDK: మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లాలోని సుజాతనగర్ లక్ష్మీదేవిపల్లి, మణుగూరు ఉడతనేని గుంపు గ్రామాల్లో రెండు సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు ఆమోదం తెలిపింది. ఒక్కో ప్లాంట్‌కు రూ.3 కోట్లు కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టులతో మహిళా సంఘాలకు స్థిర ఆదాయం లభించనుందని అధికారులు తెలిపారు.
W.G: భీమవరం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడులు కలకలం రేపాయి. భీమవరం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేశ్ రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక పనికి సంబంధించి బాధితుడి నుంచి నగదు డిమాండ్ చేయడంతో అధికారులు నిఘా పెట్టి పట్టుకున్నారు.
NZB: రేపటి నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోయే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. NZB జిల్లా వ్యాప్తంగా 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 36,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
పిల్లలకు ORSL అనేది అస్సలు మంచిది కాదని.. డాక్టర్ శివరంజిని చెప్పారు. ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని.. దీనివల్ల పిల్లల్లో వాంతులు, విరేచనాలు వస్తాయని చెబుతున్నారు. ORS ను తీసుకోండి.. కానీ ORSL అస్సలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు దీనిపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
MDK: ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలనే సంకల్పంతో గ్రామంలో ‘ప్రతి ఒక్కరు-ఒక చెట్టు’ కార్యక్రమం నిర్వహించడం గర్వకారణమని సీఐ రేణుకరెడ్డి తెలిపారు. సోమవారం టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లిలో సర్పంచ్ నర్సింహారావ్ దేశ్పాండే ఆధ్వర్యంలో చెట్లను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఐ మాట్లాడుతూ.. గ్రామాన్ని మద్యం రహితంగా, హరిత గ్రామంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంమన్నారు.
MLG: ఏజెన్సీలోని SC, ST, BCలు తరతరాలుగా సాగుచేస్తున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడం ద్వారా వారిని వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని TDP జిల్లా అధ్యక్షుడు దేవా నాయక్ ఆరోపించారు. ఛత్తీస్‌గడ్ నుంచి వచ్చినవారితో అడవులను నాశనం చేస్తున్నారన్నారు. తమపై దాడులు ఆపాలని, ఉక్కుపాదం మోపడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. జిల్లాలో రేపటి దళిత సభకు ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు.
మంచిర్యాల జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. గత కొద్ది నెలలుగా విద్యార్థులు చేసిన కృషికి ఫలితం అందుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు.
MDCL: జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్, మరోవైపు శామీర్‌పేట వరకు మెట్రో నిర్మాణానికి సంబంధించి డీటెయిల్స్ పూర్తి చేసి కేంద్రానికి పంపినట్లుగా మెట్రో సంస్థ తెలిపింది. గత కొద్ది రోజులుగా కేంద్ర అనుమతి కోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తే నిర్మాణం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
TG: హైదరాబాద్ అంబర్ పేటలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామ్ రాజ్(55), మాదవి(50), శశాంక్(21) ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
BHPL: వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల పది రోజుల శిక్షణా శిబిరాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ శిబిరంలో BHPL DCC అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పాల్గొన్నారు. నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల వ్యూహరచన, సోషల్ మీడియా నిర్వహణ వంటి అంశాలపై నిపుణుల శిక్షణ అందిస్తున్నట్లు కరుణాకర్ తెలిపారు.
TG: మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ దొరికింది. గత కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ గణపతి నడిపించారు. వృద్ధాప్య సమస్యలతో పార్టీ సెక్రటరీ పదవి వదిలిపెట్టారు. ఆయన నేపాల్ లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అతణ్ని తెలంగాణకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
KMM: భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించవద్దని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జీ. లక్ష్మీనారాయణ కోరారు. సోమవారం KMM కలెక్టరేట్‌లో కలెక్టర్ అనుదీప్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రైవేటీకరణ వల్ల కార్మికులకు దక్కే ప్రయోజనాలు తగ్గిపోయి తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే నేరుగా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు.
MBNR: నవాబ్‌పేట్ మండల కేంద్రంలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రాజు (17) అదృశ్యమయ్యాడు. ఈనెల 21న కళాశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి డేవిడ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై విక్రమ్ కేసు నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు చేపట్టారని తెలిపారు. పోలీసులు మిగిలిన వివరాలను పరిశీలిస్తున్నారు.
డయాబెటిస్ ఉన్నవారికి దాల్చిన చెక్క అద్భుత వరమని నిపుణులు చెబుతున్నారు. ఉదయం టీ/కాఫీలో చక్కెర బదులు దీన్ని వాడటం లేదా దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది బరువు తగ్గించడమే కాకుండా.. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెరుగైన జీర్ణక్రియకు, ఇతర ఉదర సంబంధిత సమస్యల నివారణకు ఇది తోడ్పడుతుంది.