• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు: హరీష్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా.. దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దేవాదుల ప్రాజెక్టును సందర్శించిన హరీష్.. తాము ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్ వాటిని నిర్వహించలేకపోతోందన్నారు. ఇక్కడ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల జనగామ, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

February 20, 2026 / 04:26 PM IST

‘సర్పంచ్‌పై నిందలు వేస్తే సహించేది లేదు’

E.G: కడియం మండలం మాధవ రాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటిపై నిందలు వేస్తే సహించేది లేదని ఆ గ్రామానికి చెందిన SC, ST ఐక్యవేదిక నాయకులు శుక్రవారం హెచ్చరించారు. చైతన్యనగర్లో తలెత్తిన భూ వివాదం ఆయన వ్యక్తిగతం కాదన్నారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు సర్పంచ్‌పై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలవురు నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 04:25 PM IST

ధరూర్‌లో ఉపాధ్యాయుల సమీక్ష సమావేశం

GDWL: ధరూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల సముదాయ సమావేశం జరిగింది. ఎంఈవో రవీంద్రబాబు మాట్లాడుతూ… ప్రతి పాఠశాలలో ఎఫ్‌ఎల్‌ఎస్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల కనీస సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని.. మధ్యాహ్న భోజన పథకం వివరాలను ప్రతిరోజూ ఎస్ఎంఎస్ ద్వారా పంపించాలని సూచించారు.

February 20, 2026 / 04:24 PM IST

కోహ్లీ లాంటి ప్లేయర్ మాకు లేడు: కమిన్స్

విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంతటి ఒత్తిడిలోనైనా మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా కోహ్లీకి ఉందని కొనియాడాడు. ఆసీస్ జట్టులో కోహ్లీ వంటి ఆటగాడు లేడని, అందుకే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఒత్తిడికి లోనై ఓడిపోయామని పేర్కొన్నాడు. విరాట్ లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే ప్రత్యర్థి జట్లు భయపడతాయని వ్యాఖ్యానించాడు.

February 20, 2026 / 04:22 PM IST

మైనార్టీ గురుకులంలో మార్కుల పరిశీలన

NRPT: మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల నిర్మాణాత్మక మూల్యాంకన (FA) మార్కుల పరిశీలన కొనసాగింది. ఉపాధ్యాయులు నరసింహారావు, లక్ష్మారెడ్డి, సంధ్య బృందం విద్యార్థుల అంతర్గత మార్కులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మార్చిలో జరగనున్న వార్షిక పరీక్షలకు విద్యార్థులు పక్కాగా సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

February 20, 2026 / 04:20 PM IST

ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

WNP: బీఆర్ఎస్ హయాంలో కేవలం పార్టీ కార్యకర్తలకే ఇళ్ల పట్టాలు ఇచ్చారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కొత్తపల్లిలో లబ్ధిదారురాలు గొల్ల శంకరమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో పాల్గొని ఆయన నూతన వస్త్రాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఇళ్లు కడితే కమిషన్లు రావనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వాటిని పెట్టిందని ఆరోపించారు.

February 20, 2026 / 04:20 PM IST

సావర్గవ్‌లో తాగునీటి సమస్యపై గ్రామసభ

KMR: జుక్కల్ మండలం సావర్గవ్‌ గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు శుక్రవారం సర్పంచ్ రవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బోరుబావుల మరమ్మతులు చేపట్టాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టి నీటి వృథాను అరికట్టాలని నిర్ణయించారు. తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా మోటార్లకు మరమ్మతులు చేయించాలని తీర్మానించారు. అలాగే దళితవాడలో మురుగుకాలువల నిర్మాణానికి నిధులు ఇవ్వాలన్నారు.

February 20, 2026 / 04:20 PM IST

వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలి: పయ్యావుల

AP: YCP సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. దేవుడి ఫొటోలు పట్టుకుని చెప్పులతో సభలోకి వచ్చారని ధ్వజమెత్తారు. సభలో ప్రతిరోజూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా YCP తీరు ఉందన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడమేంటని నిలదీశారు. హిందూ సమాజానికి YCP సభ్యులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 04:20 PM IST

భూసేకరణ అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష

ATP: అనంతపురం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ శుక్రవారం భూసేకరణ, భూమి బదలాయింపు అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారులతో కలిసి వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతిని ఆయన చర్చించారు. పెండింగ్‌లో ఉన్న భూమి బదలాయింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

February 20, 2026 / 04:20 PM IST

ప్రజలకు సమాధానం చెప్పాలి: రాజగోపాల్

TG: రాష్ట్రంలో నేతల పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసించడంపట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయన్నారు. కానీ ‘నిజంగా ప్రజల మనసులో ఏం ఉంది? మనం ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చాం అన్నది ముఖ్యం’ అని అన్నారు. అన్నింటిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

February 20, 2026 / 04:15 PM IST

అసెంబ్లీలో మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే

కృష్ణా: అసెంబ్లీలో శుక్రవారం MLA యార్లగడ్డ వెంకట్రావు APకి ప్రత్యేక స్టాంప్ చట్టం తీసుకురావాలని సూచించారు. పాసుపుస్తకాలపై జగన్ ఫోటోలు వేసుకోవడాన్ని ఆయన విమర్శించారు. రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు పంపిణీపై హర్షం వ్యక్తం చేస్తూ, విజయవాడ రూరల్‌లో 10 ఎకరాల భూమితో కృష్ణా యూనివర్సిటీ ఫైలు వేగవంతం చేయాలని కోరారు. MRO రికార్డు ట్యాంపరింగ్‌పై విచారణ చేయాలని కోరారు.

February 20, 2026 / 04:15 PM IST

BREAKING: YCP MLCలకు నోటీసులు

AP: రాజీనామా చేసిన YCP MLCలకు మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. ఈనెల 26న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌కు నోటీసులు పంపించారు. మరోవైపు ఈనెల 25న విచారణకు రావాలని జయమంగళం వెంకట రమణకు సూచించారు.

February 20, 2026 / 04:13 PM IST

భారత్–సింగపూర్ నౌకాదళాల మధ్య సహకారం బలోపేతం

VSP: భారత నౌకాదళాధిపతి దినేష్ కే. త్రిపాఠి సింగపూర్ నౌకాదళాధిపతి షాన్ వాట్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల నౌకాదళాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ముఖ్యంగా ‘సింబెక్స్ విన్యాసాలు, అలాగే ‘ఎక్సర్‌సైజ్ పసిఫిక్ రీచ్ 2025’లో సబ్‌మరైన్ శోధన–రక్షణ సహకారంపై దృష్టి సారించారు.

February 20, 2026 / 04:12 PM IST

‘ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి’

MHBD: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామంలో ఇవాళ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకుబ్ ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. జీరాంజీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ. 600 పెంచాలని కోరారు.

February 20, 2026 / 04:11 PM IST

రెజ్లింగ్ క్రీడాకారుడిని అభినందించిన పీవో

BDK: ఐటీడీఏ పీవో రాహుల్‌ను, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాశీ హుస్సేన్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల యూపీలో జరిగిన ఫెడరేషన్ కప్ రెస్లింగ్ పోటీల్లో వెంకటప్రసాద్ 97 కేజీల విభాగంలో నవీన్ 100 కేజీల విభాగంలో సత్తా చాటారు. బెస్ట్ ర్యాంకుల్లో నిలిచి ఖేలో ఇండియా జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు.

February 20, 2026 / 04:11 PM IST