• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బాదేపల్లి మార్కెట్‌లో వేరుశనగ ధరల మార్పు

MBNR: జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం 2,082 క్వింటాళ్ల వేరుశనగ చేరింది. ఈ సందర్భంగా గరిష్ట ధర క్వింటాకు రూ.10,269గా నమోదైంది. కనిష్ట ధర రూ.4,500 కాగా, సాధారణ ధర రూ.9,169గా ఉంది. గతంలో క్వింటాకు రూ.12,000కు పైగా ధర పలికిన సందర్భాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

February 20, 2026 / 03:55 PM IST

రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం: టీపీసీసీ

TG: రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుల ఎంపికపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మార్చి 1వ తేదీన తెలంగాణకు రాహుల్ గాంధీ రాబోతున్నారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ సులభంగా దక్కించుకునే అవకాశం ఉంది. 

February 20, 2026 / 03:55 PM IST

19 ఏళ్ల తర్వాత భారత్‌కు షకీరా!

గ్లోబల్ పాప్ స్టార్ షకీరా ఏప్రిల్ 10, 15 తేదీల్లో ముంబై, ఢిల్లీలలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ‘ఫీడింగ్ ఇండియా’ ఆధ్వర్యంలో జరిగే ఈ కాన్సర్ట్‌ల ద్వారా వచ్చే నిధులను చిన్నారుల పోషకాహార లోప నిర్మూలనకు వెచ్చించనున్నారు. 2007 తర్వాత ఆమె మళ్లీ భారత్‌కు వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మెగా ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

February 20, 2026 / 03:54 PM IST

పేరుకు మాత్రమే ఉచిత పార్కింగ్!

మాల్స్‌లో జీవో నెం.15 ప్రకారం మొదటి 30 నిమిషాల పార్కింగ్ ఉచితం. కానీ, మాదాపూర్, గచ్చిబౌలిలోని కొన్ని మాల్స్ ‘డిజిటల్ ఎంట్రీ’ పేరుతో వాహనం లోపలికి వెళ్లకముందే సమయాన్ని లెక్కిస్తూ వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్నాయి. వెయిటింగ్ చేయిస్తూ, 30 నిమిషాలు దాటగానే రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తున్నాయి. షాపింగ్ చేసినా గంట ఉచితం అనే నిబంధనను కూడా గాలికొదిలేశాయి.

February 20, 2026 / 03:54 PM IST

‘సీపీఐ జిల్లాస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి’

KRNL: మంత్రాలయంలో మార్చి 1,2,3 తారీఖులలో జరిగే సీపీఐ జిల్లాస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి మునెప్ప పిలుపునిచ్చారు. శుక్రవారం మంత్రాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ ముస్లింల మధ్య ఘర్షణ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.

February 20, 2026 / 03:53 PM IST

6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

NDL: మహానంది మండలం తిమ్మాపురం ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. ఈ నెల 23న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 03:52 PM IST

బ్రాహ్మణచెరువులో ఫ్రైడే -డ్రై డే కార్యక్రమం

W.G: పెనుగొండ మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మీ, మేల్ అసిస్టెంట్ నాగ భూషణం, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న నీటిని, వ్యర్థాలను తొలగించాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

February 20, 2026 / 03:52 PM IST

జీవన్ రెడ్డికి అభిమానం జరగకుండా చూడాలి: జగ్గారెడ్డి

SRD: మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డికి కాంగ్రెస్‌లో అవమానం జరగకుండా ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం కోరారు. పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఆఫర్లు వచ్చిన బయటకు వెళ్లలేదని గుర్తు చేశారు.

February 20, 2026 / 03:51 PM IST

రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

KRNL: రాష్ట్ర సచివాలయంలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులతో సెన్సస్-2027 నిర్వహణపై శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో చేపట్టాల్సిన ప్రాథమిక ఏర్పాట్లు, శిక్షణ, తదితర అంశాలపై ఆమె అధికారులతో చర్చించారు. జిల్లాలో జనాభా గణనను విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

February 20, 2026 / 03:50 PM IST

దుప్పల్లి గ్రామ వాసికి రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కు

MBNR: చిన్నచింతకుంట మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మన్న కుమారుడికి మంజూరైన రూ.లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (GMR) అందజేశారు. శుక్రవారం గ్రామ సర్పంచ్, నాయకుల సమక్షంలో ఈ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

February 20, 2026 / 03:49 PM IST

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ 

AP: సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. పరిపాలనా భవనాల నిర్మాణంపై చర్చించారు. శాఖలవారీ ఉద్యోగుల మేరకు వర్క్ స్పేస్ కేటాయింపుపై చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. తొలుత 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అంచనా వేశామని.. శాఖలవారీగా ఉద్యోగుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని CSను కోరినట్లు చెప్పారు. వర్క్ స్పేస్‌పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

February 20, 2026 / 03:48 PM IST

‘సమస్యల పరిష్కారమే లక్ష్యం’

అనకాపల్లి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జనసేన నియోజకవర్గం సమన్వయకర్త బీమరశెట్టి రాంకీ తెలిపారు. శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సమస్యలపై వినతులు స్వీకరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓ పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 03:48 PM IST

కడపలో వైసీపీ పత్రికా సమావేశం నిర్వహణ

కడప నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర పాలనపై పార్టీ నేతలు పత్రికా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. కడపకు విచ్చేసిన శైలజానాథ్‌ను పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జ్‌లు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

February 20, 2026 / 03:47 PM IST

పాఠశాలలో ‘సామాజిక న్యాయ దినోత్సవం’

NLG: చిట్యాలలోని ఒక ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం ‘సామాజిక న్యాయ దినోత్సవం’ జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ‘మాక్ కోర్టు’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు న్యాయమూర్తులు, లాయర్ల పాత్రల్లో అభినయించి, న్యాయ ప్రక్రియపై అవగాహన కల్పించేలా మెప్పించారు. ప్రజా ప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.

February 20, 2026 / 03:46 PM IST

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

ATP: తాడిపత్రిలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, MLA అశ్మిత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఆంజనేయస్వామి మాన్యం వెనుక రూ.4.50 కోట్లతో నిర్మించే సోలార్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అలాగే అర్జాస్ స్టీల్ ప్లాంట్ ఎదురుగా మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్, జేసీ పార్క్ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శ్రీకారం చుట్టారు.

February 20, 2026 / 03:45 PM IST