CTR: కుప్పంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీక్ష కేంద్రాలకు 9 గంటల లోపే విద్యార్థులు చేరుకోగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1st లాంగ్వేజ్ సెట్ వన్ ప్రశ్నాపత్రం చాలా సులభంగా రావడంతో విద్యార్థులు ఖుషి అయ్యారు.
RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం వద్దకు విద్యార్థులు సమయానికి చేరుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్ష కేంద్రం లోపలికి అనుమతించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయగా..పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
PDPL: సుల్తానాబాద్‌లో మంగళవారం 99మంది లబ్ధిదారులకు రూ. 99,11,484 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, రైతు భరోసా వంటి పథకాలతో అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందని తెలిపారు.
MNCL: మంచిర్యాలకు చెందిన బోడ ధర్మేందర్‌కు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి అత్యున్నత పురస్కారం వరించింది. ఈ ఏడాది ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు మంగళవారం రాత్రి హైదారాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ సుమ చేతుల మీదుగా అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ధర్మేందర్‌ను బ్యాంకు అధికారులు అభినందించారు.
ఇటీవల రిటైర్మెంట్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ కీలక ప్రకటన చేశాడు. సోషల్ మీడియా వేదికగా తన అభిమానుల మెసేజ్‌లకు తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తాను ఇప్పుడప్పుడే సంగీత ప్రపంచం నుంచి తప్పుకోవడం లేదని, మరో రెండేళ్ల వరకూ తన పాటలు వినిపిస్తూనే ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు. ఈ ప్రకటనతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో బుధవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,100గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ.100 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
కోనసీమ: గ్రామ దేవతల ఆరాధన మన ప్రాచీన సంస్కృతికి ప్రతిబింబమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. వాడపాలెం శ్రీ మారెమ్మ తల్లి అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవాల పోస్టర్‌ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
చిత్తూరు జిల్లాలో కాంట్రాక్ట్ టీచర్ వెంకటేశ్‌పై కేసు నమోదైంది. పులిచెర్ల మండలం కల్లూరు పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు ఆత్మహత్యకు యత్నించగా తిరుపతిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ.1,61,890కు చేరింది. అలాగే, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.1,48,400గా నమోదైంది. మరోవైపు వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,95,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందులలో పర్యటిస్తున్నారు. ఇవాళ వేంపల్లి మండలం నందిపల్లి నందీశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమంలో పాల్గొననున్నారు. కాగా, జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆలయానికి రూ.1.8 కోట్లు మంజూరు చేశారు. మొత్తం రూ.6 కోట్లతో ఆలయ నిర్మాణం జరిగింది.
సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుధవారం CM చంద్రబాబు నాయుడును కోరారు. నియోజకవర్గంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలని, హంద్రీనీవా కృష్ణా జలాలతో చెరువులు నింపాలని విన్నవించారు. పుట్టపర్తిని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా, ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.
ASF: కెరమెరి మండలం గోయగాం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. దాహం తీర్చుకోవడానికి చెరువు వద్దకు వచ్చిన ఓ కొండగొర్రెపై కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు దానిని రక్షించినప్పటికీ, తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. FRO యోగేశ్ ఆధ్వర్యంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేశారు. అటవీ శాఖ అధికారులు వెంకట్, నజీర్ అలీ పాల్గొన్నారు.
ATP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 27న అనంతపురం జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీతో అమరావతిలో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరపనున్నారు. శాంతిభద్రతల అంశంపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
SKLM: మార్చి ఒకటి ఆదివారం ఉదయం 10:30 కు మండల అధ్యక్షులు వాన గోపి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో చిన్న మూడు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని అన్నారు. జడ్పిటిసి మెండ విజయశాంతి రాంబాబు అధికారులు సభ్యులు పాల్గొవాలని ఆమె సూచించారు.
ఏలూరు జిల్లా పరిధిలోని ఆసుపత్రులలో ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయ అధికారి పాల్ సతీశ్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. నియామక ప్రక్రియ మెరిట్, రోస్టర్ ప్రాతిపదికన అత్యంత పారదర్శకంగా జరుగుతుందన్నారు. హెచ్చరికలు విస్మరించి దళారులను ఆశ్రయిస్తే నష్టపోతారని, నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.