KMM: జిల్లాలో నేరాల తీరు మారుతోంది. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాల కోసం ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు కిరాయి ముఠాలను ఆశ్రయించడం ఆందోళన కలిగిస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండా పని పూర్తి చేయాలని రూ. లక్షల సుపారీలు ఇస్తున్నా, పోలీసులు సాంకేతికతతో నిందితులను పసిగడుతున్నారు. ఇటీవలి యూట్యూబర్ హత్య ఇందుకు నిదర్శనం.
SKLM: అతిసారం కేసుల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 08942-229080 నంబర్ ద్వారా ప్రజలు సహాయం పొందవచ్చని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. డయేరియా ప్రభావిత ప్రాంతాల ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. గత రెండు, మూడు రోజులుగా నిల్వ ఉన్న నీటిని పారబోయాలని సూచించారు.
AP: ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఎం చంద్రబాబు బెయిల్ రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. విచారణర్హతపై సీఐడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ రద్దు చేయాలని రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది కోరారు. ఇరుపక్షాలు వాదనలు వినిపించాలని, తదుపరి విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.
SRCL: నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టు న్యాయవాది జి.కళ్యాణిపై దాడికి నిరసనగా వేములవాడలో న్యాయవాదులు మంగళవారం కోర్టు విధులు బహిష్కరించారు. మహిళా న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్య నారాయణరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పత్తి కొనుగోళ్లకు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రకటించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియకు గడువును పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో నిర్వహించే అన్నదాన పథకానికి రాజమహేంద్రవరం వాస్తవ్యులు మిధున్ చక్రవర్తి కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళాన్ని మంగళవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ధాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.
AP: నెయ్యి కల్తీ జరగలేదని వైసీపీ అబద్దాలు ఆడుతోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వస్తోందని, వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులు జరిగినప్పుడు కూడా తాము వారిపై ఆరోపణలు చేయలేదన్నారు. నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచి కూడా తయారు చేయవచ్చని చూపించినట్లు తెలిపారు. నెయ్యి కల్తీ అప్పటి టీటీడీ పాలకమండలి బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
TG: ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న BRS నేత బాల్క సుమన్‌ను కలిసేందుకు మాజీ మంత్రి KTR బయలుదేరారు. మార్గమధ్యలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ KTRకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన KTR.. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమే అని.. ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు నిరాశలో ఉన్నారన్నారు.
HYD సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ ద్వారా దేశ వ్యాప్తంగా భారీ నెట్‌వర్క్‌ను ఛేదించారు. 16 రాష్ట్రాల్లో దాడులు చేసి 104 మంది నిందితులను అరెస్ట్ చేయగా.. వీరిలో బ్యాంకు అధికారులు ఉండటం గమనార్హం. వీరిపై 1,055 కేసులు ఉండగా, ఇప్పటివరకు రూ.127 కోట్ల మోసాలకు పాల్పడ్డారు. నిందితుల నుంచి రూ.36 లక్షల నగదు, 200లకు పైగా మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
AP: లిక్కర్ స్కామ్ కేసులో ముప్పిడి అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 26వ తేదీన విచారణ అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. లొంగిపోయిన తర్వాత బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి శ్రీలంకలో తలదాచుకున్నట్లు సమాచారం.
W.G: నరసాపురం పట్టణంలో మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వైఎన్.కళాశాల, సూర్య, గౌతమి, ఆదిత్య, భాస్కర కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పరీక్షల దృష్ట్యా కేంద్రాల పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు.
SS: పుట్టపర్తి కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మంగళవారం కదిరికి చెందిన ఎస్. ఫరూఖ్ అనే హిజ్రాకు ఐడీ కార్డు నుంచి సర్టిఫికెట్‌ను జేసీ అందజేశారు. జిల్లాలో అర్హులైన హిజ్రాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే తక్షణమే కార్డులు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ పథకాలు పొందడానికి ఈ గుర్తింపు కార్డులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
KNR: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో రెండు నెలల పాప మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ స్టేజ్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పూసల సంపత్ మాట్లాడుతూ.. అగ్రవర్ణ దురహంకారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.
ELR: గ్రామాలలో ఆదాయ వనరులను గుర్తించి అభివృద్ధికి సహకరించాలని గణపవరం ఎంపీడీవో పివి.సత్యనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు ఒకరోజు శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శివాజీ, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
PLD: పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శంకరమంచి రాజేశ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు, విశేష అలంకరణలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకన్నారు.