• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

క్రీడల్లో కరీంనగర్ పోలీసుల పతకాల వేట

KNR: సైబరాబాద్లో జరిగిన 4వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు 35 పతకాలతో సత్తా చాటారు. ఇందులో 9 స్వర్ణ, 13 రజత, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఏసీపీ మాధవి, పీసీలు స్వప్న, శ్రీజ, శ్రీధర్ పలు విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. విజేతలను సీపీ గౌష్ ఆలం అభినందిస్తూ.. విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల్లో రాణించడం గర్వకారణమని కొనియాడారు.

February 23, 2026 / 08:06 PM IST

ఉద్యోగులకు అందని వేతనాలు..!

కడప: YVUలోని 140 మంది ఆప్కాస్ ఉద్యోగులు నవంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు నాలుగు నెలలుగా ప్రభుత్వ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బడ్జెట్ లేదనే కారణంతో ఫైనాన్స్ అధికారులు నిధులను మళ్లిస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో వైద్య సేవలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా నిలిచిపోయాయి.

February 23, 2026 / 08:04 PM IST

‘వెలుగొండ ప్రాజెక్టుకు రూ.2000 కోట్లు కేటాయించాలి’

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టుకు రూ.2000 కోట్లు నిధులు కేటాయించి, నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పామూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల తాగునీరు, సాగునీరు అవసరాలకు వెలుగొండ ప్రాజెక్టే కీలకమన్నారు.

February 23, 2026 / 08:04 PM IST

పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

SRPT: జిల్లాలో ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 69 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అదనపు బస్సులు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, ప్రశ్నపత్రాల తరలింపులో పటిష్ట భద్రత పాటించాలని అన్నారు.

February 23, 2026 / 08:02 PM IST

డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ

NZB: నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్​గా సల్మా తహసిన్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల పొత్తుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎంఐఎంకు చెందిన 54వ డివిజన్ కార్పొరేటర్ సల్మాను డిప్యూటీ మేయర్​‌గా ఎన్నుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

February 23, 2026 / 08:02 PM IST

బ్రహ్మోత్సవాల్లో రేపు ఎదుర్కోళ్ల మహోత్సవం

BHNG: శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ప్రధాన ఘట్టం ఎదుర్కోళ్ల మహోత్సవం ప్రత్యేక సేవలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు మోహిని అలంకార సేవతో వేదపారాయణం ప్రారంభమవుతుంది. రాత్రి 8గంటలకు అశ్వ వాహన సేవ, 8:45 ఎదుర్కోళ్ళు మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం పొందాలని ఆలయ ఈవో కోరారు.

February 23, 2026 / 08:02 PM IST

పలు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని అమీనాబాద్, వేములూరిపాడు గ్రామాల్లో రేపు మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఫిరంగిపురం విద్యుత్ ఏఈ దుర్గాప్రసాద్ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ మరమ్మత్తుల పనుల కారణంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

February 23, 2026 / 08:00 PM IST

ప్రజా ఫిర్యాదుల పరిష్కర కార్యక్రమం

CTR: ఇవాళ జరిగిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి ప్రజల నుంచి 36 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపవద్దని అధికారులను ఆదేశించారు. అన్ని పిటిషన్లను చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలని, ఇచ్చిన గడువులోపు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ వారిని ఆదేశించారు. పోలీసులు న్యాయం అందించడానికి నిజాయితీగా పనిచేయాలని ఎస్పీ నొక్కి చెప్పారు.

February 23, 2026 / 08:00 PM IST

తెలంగాణ తల్లి విగ్రహానికి విరిగిన చేయి

RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం దెబ్బతిన్న స్థితిలో కనిపిస్తోంది. విగ్రహం చేయి విరిగిపోయి ఉన్న నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైనది కాదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వందలాది మంది రాకపోకలు సాగించే ముఖ్య కూడలిలో ఇలాంటి పరిస్థితి ఉండటం బాధాకరమని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి విగ్రహాన్ని మరమ్మతు చేయాలన్నారు.

February 23, 2026 / 08:00 PM IST

ప్రజల అర్జీలకు అధిక ప్రాధాన్యత

కృష్ణా: ప్రజల నుంచి అందే అర్జీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ నవీన్‌తో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల గ్రీవెన్స్‌డే నిర్వహించి వివిధ శాఖల ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు.

February 23, 2026 / 08:00 PM IST

ACB వలకు చిక్కిన వీఆర్‌వో

AP: విజయనగరం జిల్లా భోగాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. లక్ష లంచం తీసుకుంటున్న వీఆర్‌వో చిట్టిబాబును అధికారులు పట్టుకున్నారు. 70 సెంట్ల భూమి మ్యుటేషన్‌కు రైతు నుంచి లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో అధికారులు అక్కడికి చేరుకుని రెండ్‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు.

February 23, 2026 / 07:58 PM IST

తాండూరులో పట్టపగలే దారుణ హత్య

VKB: తాండూరు మండలం కరణ్‌కోట్లో సోమవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. స్థానిక ఆటో డ్రైవర్ సాయిలు (45)ను ఓ యువకుడు కత్తితో వెంబడించి మరీ కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. పాత కక్షలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

February 23, 2026 / 07:55 PM IST

భారత్‌లో ఆడటం చాలా ఇష్టం: మిచెల్

భారత్‌ వేదికగా మ్యాచులు ఆడటమంటే చాలా ఇష్టమని న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ తెలిపాడు. భారత్ అభిమానులు న్యూజిలాండ్ జట్టుకు మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నాడు. ఒకవేళ భారత్‌తో మ్యాచ్ జరిగిన సరే.. కొందరు అభిమానులు బ్లాక్ జెర్సీలు ధరించి తమకు సపోర్ట్ చేస్తారని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జరుగుతున్న T20 WC కివీస్ తన తర్వాతి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.

February 23, 2026 / 07:55 PM IST

జింబాబ్వేతో మ్యాచ్‌లో హెట్మేయర్ ఊచకోత

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ హిట్టర్ హెట్మేయర్ మెరుపులు మెరిపిస్తున్నాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో అర్థ సెంచరీ బాదాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ తరఫున T20 WCలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో 22 బంతుల్లో తన పేరిటే ఉన్న రికార్డును తనే బ్రేక్ చేశాడు.

February 23, 2026 / 07:53 PM IST

గ్రీవెన్స్ డేలో 40 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ

నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ బాధితుల వినతులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 40 మంది ఫిర్యాదుదారులు వివిధ సంబంధించిన ఫిర్యాదులు సమర్పించారు. ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సంబంధిత అధికారులకు తక్షణ విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 23, 2026 / 07:52 PM IST