VKB: తాండూరు మండలం కరణ్కోట్లో సోమవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. స్థానిక ఆటో డ్రైవర్ సాయిలు (45)ను ఓ యువకుడు కత్తితో వెంబడించి మరీ కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. పాత కక్షలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.