• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశా: ఎంపీ కావ్య

హనుమకొండలో జరిగిన తాగునీటి శుద్ధికరణ పథక కమిటీల మహాసభలో ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. వితంతువులు, ఒంటరి మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తాను సిఫార్సు చేసినట్లు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో తాగునీటి శుద్ధికరణ కేంద్రాలు కీలకమని పేర్కొన్నారు. నీటి నాణ్యతపై కమిటీలు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

March 1, 2026 / 09:44 AM IST

దొడియం-తలమంచిపట్నం రహదారిని అధ్వానం

KDP: దొడియం నుంచి తలమంచిపట్నం వెళ్లే రహదారి గుంతలతో దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. భారీ వాహనాల రాకపోకలతో రోడ్ పైపొర ఊడిపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. గాలి ఫ్యాన్ ప్రాంతానికి వెళ్లే భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్ పై పొర ఊడిపోవడంతో రాళ్లు బయటకు వచ్చాయి.

March 1, 2026 / 09:43 AM IST

అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం వహించవద్దు: ఎంపీ

ADB: ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు చేసుకోవాలని దిశ కమిటీ ఛైర్మన్, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుందని, దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

March 1, 2026 / 09:40 AM IST

మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్

MDK: జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 257 నుంచి రూ. 260 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 292 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 20 వరకు పెరిగింది.

March 1, 2026 / 09:39 AM IST

జిల్లాలో పెరిగిన యాసంగి సాగు

VKB: జిల్లాలో యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో సుమారుగా 3,34,627 మంది రైతులు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా అత్యధికంగా రైతులు వరి పంటను పండిస్తున్నారు. జిల్లాలో ఇదివరకు సాధారణ సాగు 75,838 ఎకరాల్లో ఉండేది. ప్రస్తుతం 93,116 ఎకరాలు పెరిగింది. జిల్లాలో అన్ని పంటలు కలుపుకుని ప్రస్తుతం 1,45,241 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.

March 1, 2026 / 09:36 AM IST

100 శాతం ఫలితాలే లక్ష్యం: ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు MEO-1గా బాధ్యతలు చేపట్టిన ఉందుర్తి శాంసన్ శనివారం MLA ముప్పిడి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని MLA ఆదేశించారు. మండలం వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ భేటీలో UTF నాయకులు పల్లికొండ, విజయ్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 09:35 AM IST

నేడు సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ముగింపు ఉత్సవాలు

నేడు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ గిరిజన భవన్‌లో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజు జయంతి ముగింపు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని గిరిజన విద్యార్థి సేవా సంఘం అధ్యక్షులు రవి రాథోడ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమానికి గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమాన్ నాయక్ ముఖ్యఅతిథిగా వస్తారన్నారు. నేడు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు.

March 1, 2026 / 09:35 AM IST

పేలుడు ఘటన.. యజమాని అరెస్ట్

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనకు సంబంధించి సూర్యశ్రీ ఫైర్ క్రాకర్స్ యూనిట్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. యజమాని అర్జున్‌తో పాటు సోదరుడు వీరబాబును అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 

March 1, 2026 / 09:35 AM IST

మంచి మనసు చాటుకున్న విజయ్, రష్మిక

విజయ్ దేవరకొండ, రష్మిక జంట తమ వివాహ వేడుకను వినూత్నంగా, సేవా కార్యక్రమాలతో జరుపుకుంటూ ఆదర్శంగా నిలిచారు. పెళ్లి తర్వాత ఈ జంట దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇవాళ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, యూపీ, అస్సాంలలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదం, మిఠాయిలు పంచుతూ తమ సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నారు.

March 1, 2026 / 09:34 AM IST

వావిలాలలో LOC అందజేసిన ఎమ్మెల్యే

GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. శనివారం ఇటిక్యాల మండలం వావిలాలలో లివర్ ఆపరేషన్ కోసం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల విలువైన LOC అందజేశారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 09:34 AM IST

అశ్వారావుపాడు వలసలో గిరిజనుడి హత్య

BDK: కరకగూడెం మండలంలోని అశ్వారావుపాడు వలస ఆదివాసీ గ్రామంలో కోవాసి వెంకటేష్ అనే గిరిజనుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అతడిని హతమార్చినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

March 1, 2026 / 09:33 AM IST

ఘనంగా ఆది జగద్గురు రేణుకాచార్యుల జయంతి

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని వీరశైవ పంచ ఆచార్య జంగమ భవన ప్రాంగణంలో ఆదివారం ఆది జగద్గురు రేణుకాచార్యుల జయంతి కార్యక్రమం వీరశైవ జంగమ, లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. తాలూకా జంగమ సమాజ్ అధ్యక్షులు శివకుమార్ స్వామి, మనూర్ మాజీ ఎంపీపీ శంకరయ్య స్వామి రేణుక చార్యుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

March 1, 2026 / 09:31 AM IST

పింఛన్ల పంపిణీలో జిల్లాకు నాలుగో స్థానం

ATP: జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా సాగింది. మొదటి రోజే 2,58,775 మందికి రూ. 115.34 కోట్ల సొమ్మును అధికారులు అందజేశారు. 93 శాతం పంపిణీ పూర్తి చేసి రాష్ట్రస్థాయిలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. కలెక్టర్ ఆనంద్ స్వయంగా ఉప్పరపల్లిలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. శనివారం పింఛన్ అందుకోలేని వారికి ఇవాళ అందజేయనున్నారు.

March 1, 2026 / 09:31 AM IST

యానాం కొత్త అడ్మినిస్ట్రేటర్‌గా శివరాజ్ మీనా

E.G: యానాం 51వ ప్రాంతీయ పరిపాలనాధికారిగా PCS అధికారి శివరాజ్ మీనా శనివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. గతంలో కోవిడ్ సమయంలో అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన ఆయనపై ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. పాత పరిచయాలతో యానాం అభివృద్ధికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

March 1, 2026 / 09:30 AM IST

కల్తీ పాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఉక్కుపాదం

సత్యసాయి: జిల్లాలోని పలు డైరీలు, పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎనుములపల్లి, జగరాజుపల్లె, కొత్తచెరువు, బత్తలపల్లి ప్రాంతాల్లోని ఐదు ప్రధాన డైరీల నుంచి పాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. పాలలో పిండి పదార్థాలు, యూరియా వంటి హానికర రసాయనాలు కలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

March 1, 2026 / 09:30 AM IST