KMM: గత పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చివేయటం దుర్మార్గపు చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అన్నారు. ఆదివారం ఖమ్మం భూదాన్ భూముల్లో కూల్చివేసిన పేదల ఇండ్లను పరిశీలించి మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని పేర్కొన్నారు. ‘ఇది ప్రజా ప్రభుత్వం కాదు..పేదల వ్యతిరేక ప్రభుత్వం’ అని అన్నారు.
ATP: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘మీ కోసం’ 1100 కాల్ సెంటర్ సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ కోరారు. అర్జీదారులు తమ ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకోవడానికి లేదా కొత్తగా నమోదు చేసుకోవడానికి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని అన్నారు. అలాగే రేపు ఉ.9 నుంచి మ.1 గంట వరకు కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు.
ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం PGRS ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం అగ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు. వీటిని ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసి, నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో కీలక మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో టాస్ అత్యంత కీలకం కానుంది. మరి టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లో ఏది ఎంచుకుంటే మంచిదో కామెంట్ చేయండి.
ELR: కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని IFTU ఉమ్మడి ప.గో.జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. పెదవేగి మండలం కూచింపూడిలో ఆదివారం జరిగిన ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ బోర్డులోని పథకాలను మరింత పెంచి, అర్హులైన కార్మికులందరికీ వర్తింపజేయాలన్నారు.
NLG: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కెట్‌పల్లి మండలంలో ఆదివారం పర్యటించారు. కొండపాకగూడెం గ్రామంలో దాసరి గోపాల్ మనవరాలికి, అలాగే చిన్న నారాయణపురం గ్రామంలో బొబ్బలు సైదులు కుమార్తెకు నిర్వహించిన నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
JGL: జగిత్యాల పట్టణంలోని 18వ వార్డులో గల చైతన్య నగర్ అంబేద్కర్ సంఘం నూతన అధ్యక్షునిగా సుద్దాల గంగాధర్, ఉపాధ్యక్షునిగా బొల్లె రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా సుద్దాల విజేందర్, కోశాధికారులుగా బొల్లారపు దినేష్, ఉప్పరి సతీష్, నలువాల కిషోర్ ఎన్నికయ్యారు. సంఘ సభ్యులు దుబ్బయ్య, లక్ష్మణ్, సాయిలు, ప్రవీణ్, సాయి, మరంపల్లి రాజేశం, నారాయణ, రాజేందర్ పాల్గొన్నారు.
ASF: కౌటాల మండలం పాత కన్నెపల్లి వాడలో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులను సర్పంచ్ మోర్లే పార్వతి పరిష్కరించారు. సర్పంచ్ ఆదేశాల మేరకు ఆదివారం ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చారు. మిషన్ భగీరథ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులతో మాట్లాడుతున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆమె తెలిపారు.
BHNG: రామస్వామి తండాలో శ్రీ వీరన్న భద్రకాళి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ దిరావత్ సునీత వెంకటేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సమీప గ్రామాల సర్పంచులు తిరుమణి నాగరాజుగౌడ్, చెలివేరు పావని ఇంద్రసేనారెడ్డి, మాజీ MPTC మచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
CTR: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వేతనాల పెంపు, ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపు, 5G స్మార్ట్‌ఫోన్ల పంపిణీ, గ్రాట్యుటీ కోసం రూ.20 కోట్లు కేటాయింపు వంటి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
NDL: చాగలమర్రి మండలం NREGS మొదటి విడత కింద నిర్మించిన నాలుగు CC రోడ్లను MLA అఖిలప్రియ ఇవాళ ప్రారంభించారు. మొదటి విడతకు రూ.2.50 కోట్లు, రెండో విడతకు రూ.2.02 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మండలంలో రోడ్లు, డ్రైనేజీల కొరత లేకుండా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల హామీల మేరకు ఆళ్లగడ్డ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆమె స్పష్టం చేశారు.
NZB: మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పూలాంగ్ చౌరస్తాలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. మాదిగ ఉపకులాల అభివృద్ధి కోసం అసువులు బాసిన వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
VKB: దుద్యాల మండలం హంసన్‌పల్లి నుంచి బొంరాస్‌పేట మండలం లింగన్‌పల్లి మీదుగా హైదరాబాద్ బీజాపూర్ 163వ జాతీయ రహదారి వరకు ఇటీవల డబుల్ రోడ్డు వేశారు. కాగా, మూలమలుపులు ప్రమాదకరంగా మారినా అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
HYDలో జూబ్లీ బస్టాండ్ నుంచి గోదావరిఖని వెళ్లే బస్సుల లిస్టును ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం 3:51, సాయంత్రం 4:23, 4:26, రాత్రి 11:18 గంటలకు జూబ్లీ బస్టాండ్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని, అటువైపు వెళ్లే ప్రయాణికులందరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు ఉదయం సమయంలో 9:45, మధ్యాహ్నం 12:15, 12:45 గంటలకు సైతం ఉన్నాయి.
TG: సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం విజయనగర్ కాలనీలో కేంద్రమంత్రి బండిసంజయ్ పర్యటించారు. ఈ సందర్బంగా BJP సర్పంచ్ అమూల్యకు రూ.10 లక్షల గ్రాంట్ అందించారు. కాగా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామాల అభివృద్ధికి తక్షణమే రూ.10 లక్షల కేంద్ర నిధులు అందేలా చేస్తానని బండి సంజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.