• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను పరామర్శించిన శివరాం

NDL: గోసానిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్ వడ్డె సురేష్‌ను డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి శివరాం ఇవాళ పరామర్శించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.

March 1, 2026 / 05:29 PM IST

కోహెడలో కేంద్రమంత్రి పర్యటన

SDPT:  కోహెడ మండలం విజయనగర్ కాలనీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. బీజెపీ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ సాదుల అమూల్యకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షల గ్రాంట్ అందజేశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులు వినియోగిస్తామని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో విద్యార్థులకు సైకిళ్లు, బోర్లు వంటి పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు.

March 1, 2026 / 05:29 PM IST

ఈ నెల 3న సోమేశ్వరుడి ఆలయం మూసివేత

W.G: చంద్రగ్రహణం పురస్కరించుకుని భీమవరం గునుపూడిలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. తిరిగి 4వ తేదీ (బుధవారం) ఉదయం 7 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని వివరించారు.

March 1, 2026 / 05:27 PM IST

విద్యార్థుల సైకిల్ యాత్రతో ప్రకృతి రక్షణ

NRPT: నర్వ మండల కేంద్రంలోని ఓ స్కూల్ విద్యార్థులు “Save Nature, Secure Future” నినాదంతో భారీ సైకిల్ యాత్ర నిర్వహించారు. ప్రకృతిని కాపాడుకోవడమే మానవజాతి మనుగడకు మూలమని చాటిచెబుతూ.. యాత్ర పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా సాగింది. నర్వ నుంచి యాంకీ, పెద్దకడుముర్, గట్టు మీదుగా చంద్రగట్టు వరకు 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

March 1, 2026 / 05:27 PM IST

భీమవరం సీఐ హెచ్చరిక

W.G: భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు సీఐ నాగరాజు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. వారి ప్రస్తుత జీవన విధానం, వృత్తుల గురించి ఆరా తీశారు. గత నేర ప్రవృత్తిని వీడి, సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని ఆయన హితవు పలికారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

March 1, 2026 / 05:26 PM IST

అభివృద్ధి పథంలో భీమవరం టౌన్ హాల్: ఎమ్మెల్యే

W.G: 86 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భీమవరం టౌన్ హాల్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కుని అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. ఆదివారం గొల్లవానితిప్ప రోడ్డులోని టౌన్ హాల్ నూతన ప్రాంగణంలో నిర్వహించిన 86వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లబ్బులు పదిమందికి ఉపయోగపడేలా, సేవా దృక్పథంతో ఉండాలని అన్నారు.

March 1, 2026 / 05:25 PM IST

డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్ రంగంలో అర్హత కలిగిన వారు MAR 14లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను.. బయోటెక్నాలజీ&బయోఇన్ఫర్మేటిక్స్ విభాగం, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్-500046కు పోస్టు(ఆఫ్‌లైన్)ద్వారా పంపాల్సి ఉంటుంది.

March 1, 2026 / 05:24 PM IST

గాలివీడులో సౌరశక్తి సీసీ కెమెరాల ఏర్పాటు

KDP: గాలివీడు మండలంలో పోలీసుల ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో సౌరశక్తితో పనిచేసే డ్యూయల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరవీడు గ్రామంలో దాత మందపాటి రవీంద్ర బాబు, గరుగుపల్లి సచివాలయం వద్ద మోపురి వెంకటరమణ సహకారంతో కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ భద్రత కోసం సహకరించిన దాతలు, ప్రజలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

March 1, 2026 / 05:24 PM IST

అమృత్ పథకంలో పైపులైను పనులు ప్రారంభం

PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో అమృత్ 2.0 పథకంలో భాగంగా, చేపట్టిన పైపులైన్ పనులను కౌన్సిలర్ గాజుల రాజమల్లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా వార్డు ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పైపులైన్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దశలవారీగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.

March 1, 2026 / 05:24 PM IST

గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు

NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమంలో ఆదివారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి, ఆశ్రమ స్థలదాత పోనక కనకమ్మ విగ్రహానికి పట్టు వస్త్రం, నూలు మాల సమర్పించారు. అనంతరం ఆశ్రమ కమిటీ సభ్యులు దయాకర్ రెడ్డి విద్యార్థులకు ఆశ్రమ స్థల దాత, స్వాతంత్య్ర సమరయోధురాలు పోనక కనకమ్మ జీవిత విశేషాల గురించి వివరించారు.

March 1, 2026 / 05:23 PM IST

మట్లి గంగమ్మ జాతరలో పాల్గొన్న చమర్తి జగన్ మోహన్ రాజు

అన్నమయ్య: మట్లి పెద్దూరులో ఆదివారం నిర్వహించిన గంగమ్మ జాతరకు రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు. పీఏసీ ఛైర్మన్ రాజా నాయుడు ఆహ్వానం మేరకు జాతర కార్యక్రమంలో పాల్గొని భక్తుల ఆదరణను స్వీకరించారు. గంగమ్మ చల్లని చూపులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

March 1, 2026 / 05:23 PM IST

ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష

MBNR: జిల్లా కేంద్రంలో NTR మహిళ డిగ్రీ కళాశాలలో జరిగిన ఎస్సీ స్టడీ సర్కిల్ (5) నెలల శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు 617 మంది హాజరయ్యారు. వీరిలో మెరిట్ 100 మందికి 5 నెలల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో (GROUP1,2,3,&4, SI & PC, RRB, BANKING) DD (SCDD) డి.సునీత, స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు.

March 1, 2026 / 05:22 PM IST

మధ్యాహ్నం వెలుగుతున్న విద్యుత్ దీపాలు

GDWL: అలంపూర్ మున్సిపల్‌లోని పది వార్డులలో స్తంభాలకు విద్యుత్ దీపాలు నిరంతరాయంగా 24 గంటలు వెలుగుతూనే ఉన్నాయి. కాగా ఈ భారం తమ పైన పడుతుందని స్థానిక ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు సమస్యను తీసుకెళ్లినా అదే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

March 1, 2026 / 05:21 PM IST

పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు ఆదివారం మధ్యాహ్నం మరణించడంతో ఈ సంఖ్య పెరిగింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది.

March 1, 2026 / 05:20 PM IST

‘నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోండి’

WGL: జిల్లాలో 108 అంబులెన్స్ సర్వీసుల్లో ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) & డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్ ఇవాళ తెలిపారు. MLT, GNM, ANM, BSC నర్సింగ్ పూర్తి చేసి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అర్హత పత్రాలతో జిల్లాలోని 108 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 1, 2026 / 05:20 PM IST