• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గాదే శ్రీనివాస రెడ్డి త్యాగం మార్గదర్శనీయం: జూలకంటి

NLG: ప్రజల హక్కుల కోసం నిరంతర పోరాటమే మార్గమని ఆదర్శంగా నిలిచిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఆదివారం నాడు శ్రీనివాస్ రెడ్డి 44వ వర్ధంతి సందర్భంగా ఆయన స్థూపం వద్ద జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎర్రజెండాలతో ర్యాలీని శ్రీనివాస్ రెడ్డి స్తూపం వరకు నిర్వహించారు.

March 1, 2026 / 05:41 PM IST

ప్రమాదానికి గురైన స్కూల్ బస్ సీజ్: డీటీవో

కోనసీమ: సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో ఇటీవల ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు ను సీజ్ చేశామని జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ లేని క్లీనర్ బస్సు నడపడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బస్సు పర్మిట్‌ను నెలరోజులపాటు, డ్రైవర్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేశామన్నారు.

March 1, 2026 / 05:39 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి

ADB: ఇంద్రవెల్లి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. దనోరా గ్రామ సమీపంలో బైక్‌పై అతివేగంగా ప్రయాణిస్తున్న బైక్ ఒక్కసారిగా అదుపుతప్పడంతో రహదారి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాద తీవ్రతకు బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక ఉన్న మరో మహిళకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.

March 1, 2026 / 05:39 PM IST

4వ రోజు బాధితులకు భోజనాలు సమకూర్చిన ఎంపీ

ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలోని భూదాన్ భూమిలో ఇల్లు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు వరసగా 4వ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ భోజనాలను సమకూర్చింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో ఆదివారం వెలుగుమట్ల బాధితులకు అన్నదానం చేశారు.

March 1, 2026 / 05:39 PM IST

జిల్లాలో సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం

NGKL: జిల్లాలో ఓ ప్రైవేట్ గార్డెన్స్‌లో సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి భారతీయుడి కర్తవ్యమని పేర్కొన్నారు. యువత ధార్మిక చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో స్థానిక నాయకులు, ఆధ్యాత్మిక నేతలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 1, 2026 / 05:38 PM IST

నిబద్ధతతో జనగణన విధులు నిర్వర్తించాలి: కలెక్టర్

NTR: జనగణన విధులను అత్యంత నిబద్ధతతో, జవాబుదారీతనంతో నిర్వర్తించాలని లక్ష్మీశ స్పష్టం చేశారు. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో సెన్సస్-2027 తొలి దశ (హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్)పై శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కచ్చితమైన డేటా సేకరణ దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాదిగా నిలుస్తుందని, అందువల్ల ప్రతి అధికారి, తమ బాధ్యతలను అర్థం చేసుకొని పని చేయాలన్నారు.

March 1, 2026 / 05:38 PM IST

ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి: పొన్నం

TG: ఇరాన్-ఇజ్రాయెల్‌లోని భారతీయులు సేఫ్‌గా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వాసులను సురక్షితంగా తీసుకువస్తామని అన్నారు. ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విదేశాంగ శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ.. అక్కడి భారతీయుల కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సురక్షితంగా భారత్‌కు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

March 1, 2026 / 05:37 PM IST

‘ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలి’

BDK: చర్ల మండల కేంద్రంలో నేడు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నూతన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన చేశారు. ప్రజలకు వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండాలని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కలెక్టర్ అంకిత్ పిఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 05:37 PM IST

ఉమ్మడి జిల్లాకు నిధులు మంజూరు

WGL: ఉమ్మడి జిల్లాల గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి పనుల బిల్లుల చెల్లింపుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాల వారీగా దశలవారీగా మంజూరైన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి: WGL జిల్లాకు రూ.14.94 కోట్లు, BHPLకి రూ.11.75 కోట్లు, JNకు రూ.15.23 కోట్లు, MHBDకు రూ.37.97 కోట్లు, MLGకు రూ.14.36 కోట్లు HNK జిల్లాకు రూ.13.78 కోట్లు దశలవారీగా మంజూరయ్యాయి.

March 1, 2026 / 05:36 PM IST

‘సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలి’

MHBD: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు గౌడ కులస్తుల కృషి చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం తొర్రూరు మండల అధ్యక్షుడు బోలగాని మహేష్ గౌడ్ అన్నారు. మండలంలోని పత్తేపురం గ్రామంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు గౌడ కులస్తులకు అందే విధంగా కృషి చేయాలని అన్నారు.

March 1, 2026 / 05:35 PM IST

యాక్తపురంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

GDWL: ఎర్రవల్లి మండలం యాక్తాపురం గ్రామంలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పచ్చర్ల కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లబ్ధిదారుడు ప్రత్యేకంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేష్, పాల్గొన్నారు.

March 1, 2026 / 05:35 PM IST

నిదీష్ కొరుకొండ సైనిక్ పాఠశాల ప్రవేశం

MBNR: హన్వాడ మండలం దొర్రితండా పాఠశాల 5వ తరగతి విద్యార్థి నిదీష్, ఏపీలోని ప్రతిష్ఠాత్మక కొరుకొండ సైనిక్ పాఠశాలకు ఎంపికయ్యాడు. ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించిన నిదీష్ విజయాన్ని గ్రామస్థులు, ఉపాధ్యాయులు హర్షంతో స్వాగతించారు. ఆయన విజయం తండాలోని ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు.

March 1, 2026 / 05:34 PM IST

పట్టణంలో పాలలో కల్తీ పై ‘టేస్ట్ చెక్’

HNK: పట్టణ కేంద్రంలోని కుమార్ పల్లి మార్కెట్లో ఆదివారం సంచార ఆహార కల్తీ ప్రయోగశాల ఆధ్వర్యంలో పాలలో కల్తీ పై ‘టేస్ట్ చెక్’ నిర్వహించారు. పాల ప్యాకెట్ల పై వెన్న శాతం 6.0గా చూపిస్తున్నప్పటికీ వాస్తవంలో 5.5 శాతమే ఉండటం గమనించారు. నిల్వ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బ్రహ్మాజీ ప్రజలకు వివరించారు.

March 1, 2026 / 05:34 PM IST

రాయలసీమ ప్రాజెక్టు ఆగితే ఉద్యమం తప్పదు: ఉషశ్రీ

సత్యసాయి: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును అడ్డుకుంటే ఉద్యమాలు చేస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఇంఛార్జ్‌ ఉషశ్రీ చరణ్‌ హెచ్చరించారు. ఆదివారం కడపలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీమకు నీళ్లు రాకుండా సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తికాకపోతే ప్రాంతం ఎడారిగా మారుతుందని తెలిపారు.

March 1, 2026 / 05:34 PM IST

చెక్కును అందజేసిన కేంద్రమంత్రి

KNR: గన్నేరువరం మండలం పరిధిలోని పీచుపల్లి గ్రామ అభివృద్ధి కోసం రూ. 10 లక్షల నిధులను చెక్ రూపంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సర్పంచ్ రాజిరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, బీజేపీ మండల అధ్యక్షుడు నికేష్, మానస దేవి గుడి ఛైర్మన్ చంద్రారెడ్డి, కొంకటి గణేష్, దళిత నాయకులు, మండల, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

March 1, 2026 / 05:33 PM IST