KMM: నివారణాత్మక పోలీసింగ్‌పై దృష్టి సారించాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఖమ్మం పోలీస్ హెడ్ క్వాటర్స్‌లో నిర్మించిన పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గృహ భవనాలను మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డితో కలసి డీజీపీ ప్రారంభించారు. పోలీసు కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఈ కాంప్లెక్స్ నిర్మించామన్నారు.
AP: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గువనపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతపురం నుంచి రాయదుర్గానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. కర్ణాటకలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
WGL: గీసుగొండ మండలం కొమ్మల గ్రామంలో మరో రెండు రోజుల్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రారంభం కానుంది. అయితే ప్రతి ఏడాది ప్రతి ఏడాది జాతర సమయంలో స్థానికంగా రాజకీయ అంతర్గత విభేదాలు, వర్గ పోరాటాలు చర్చనీయాంశమవుతుండగా ఈసారి కూడా అలాంటి పరిస్థితులు తలెత్తుతాయా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
MNCL: సామాజిక సేవా రంగంలో వెలమ సంక్షేమ మండలి ముందుంటుందని MLA ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్లో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో MLA పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు అంశాలను చర్చించి తీర్మానాలు చేశారు. మాజీ DCC అధ్యక్షురాలు సురేఖ పాల్గొన్నారు.
ELR: రాష్ట్రంలో మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా కూటమి పాలనలో అప్‌గ్రేడ్ చేసినట్లు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి ఆదివారం నూజివీడులో విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీలకు వేసవిలో 15 రోజులు సెలవులు, తాగునీరు, దొడ్లకు రూ.87 కోట్లు, రూ.75 కోట్లతో కొనుగోలు చేసిన 5జీ మొబైల్స్ అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా పంపిణీ చేసినట్లు చెప్పారు.
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఉదయం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజా దర్భార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే తెలుసుకొని అర్జీలను స్వీకరిస్తారు. కావున గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.
GNTR: తలశిల చంద్రశేఖరరావు మృతి పార్టీకి తీరని లోటని ప్రత్తిపాడు వైసీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఆదివారం వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు సంతాప సభలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
కడపలోని మేడా కన్వెన్షన్ సెంటర్‌లో వైసీపీ ఆధ్వర్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితర ప్రముఖ నేతలు పాల్గొని కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల ఇంఛార్జ్‌లు, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మార్చి 3న ఉదయం 8 గంటలకు చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి 4న ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.
BHNG: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ మూకుమ్మడి దాడి చేసి ఇరాన్ సుప్రీం ఖమేనిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకదేశ సార్వమాధికారాన్ని దెబ్బతీసే హక్కు మరే దేశానికి లేదు. ప్రపంచ న్యాయ సూత్రాలను ధిక్కరిస్తూ అమెరికా బరితెగించి వ్యవహారిస్తుందన్నారు.
MLG: ఏటూరునాగారం(M)చిన్నబోయినపల్లి గ్రామ సమీపంలోని హునుమాన్ నగర్ వద్ద జాతీయ రహదారి పై HNK వైపు వెళ్తున్న ఇసుక లారీ అకస్మాత్తుగా రోడ్డు పైకి వచ్చిన అడవి పందిని ఢీకొంది. ఈ ప్రమాదంలో పంది అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పంది శవాన్ని తీసుకెళ్లి పంచనామా నిర్వహించారు.
E.G: వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఆదివారం తన కార్యాలయంలో రుడా, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో కోట్లాది రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
VSP: జిల్లాలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలను సేకరించనునట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయుల్లో సీనియార్టీ జాబితాను వెబ్‌సైట్లో పొందుపరిచామన్నారు. దీనిపై అభ్యంతరాలను 7వ తేదీలోగా తెలియజేయాలని కోరారు.
KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఆయన, బాధ్యతా రాహిత్యం వహించిన పెద్దాపురం ఆర్డీవో, డీఎస్పీ, జిల్లా కార్మికశాఖ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం తర్వాత హైదరాబాద్‌లో ఈ నెల 4న గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు కేవలం ఆహ్వానం ఉన్న అతిథులు మాత్రమే హాజరుకావాలని వారు కోరారు. సెక్యూరిటీ, పోలీసుల ఆంక్షల దృష్ట్యా అభిమానులు ఎవరూ రావొద్దని, వచ్చి ఇబ్బంది పడొద్దని విజ్ఞప్తి చేశారు. అభిమానుల క్షేమమే తమకు ముఖ్యమని, వారి దీవెనలు ఎక్కడున్నా తమకు చేరుతాయని ‘విరోష్’ జంట తెలిపింది.