• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాలో మహా సంగీత్ సదు జయంతి ఉత్సవాలు

JGL: వ్యక్తి నిర్మాణం ద్వారానే దేశ పునర్నిర్మాణం సాధ్యమని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ వ్యవస్థాపకుడు ప్రముఖ్ తిరుమల్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలో నగర మహాసాంఘిక్ నిర్వహించారు. 23 శాఖలకు చెందిన సుమారు 500 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. నిత్య శాఖ ద్వారా వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని, శక్తివంతమైన భారతదేశంతోనే ప్రపంచశాంతి సాధ్యమన్నారు.

March 2, 2026 / 07:37 AM IST

సంజూపై కేరళ సూపర్ స్టార్ ప్రశంసలు

T20 ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్‌లో వెస్టిండీస్‌పై భారత్ ఘనవిజయం సాధించి సెమీస్‌కు చేరింది. 196 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97* పరుగులతో వీరవిహారం చేశాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సంజూపై మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రశంసలు కురిపించారు. ఇది అద్భుతమైన మాస్టర్‌ఫుల్ ఇన్నింగ్స్ అని, సంజూ ప్రతిభకు ఇది నిదర్శనమని ఆయన కొనియాడారు.

March 2, 2026 / 07:37 AM IST

రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలి: కడప MP

KDP: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని కడప ఎంపీ YS అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కడప మేడా కన్వర్షన్ హాలులో రాయలసీమ లిఫ్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ 90% పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ను కావాలనే ఆపేశారని ఆరోపించారు. పోలవరం స్పీల్ వే వరకు పూర్తి చేస్తే, పోలవరం ఆశలను సైతం చంద్రబాబు సమాధి చేశారన్నారు.

March 2, 2026 / 07:35 AM IST

ఇంద్రనగర్ అమ్మవారిని దర్శించుకున్న CI శ్రీలత

ASF: రెబ్బెన మండలం ఇంద్రనగర్ అమ్మవారిని కరీంనగర్ జిల్లా మానకొండూర్ సీఐ శ్రీలత ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. లోక కళ్యాణం, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్య క్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:35 AM IST

కాకాణి గోవర్ధన్ రెడ్డిది కాకిగోల: సోమిరెడ్డి

NLR: మాజీమంత్రి కాకాణి తనపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. కాకాణి గోవర్ధన్రెడ్డిది కాకిగోల అని విమర్శించారు. నిద్రపట్టక పిచ్చి కూతలు కూస్తున్నారని ఎద్దేవా చేశారు. కాకాణి మంత్రిగా సంపాదించిన అక్రమ సంపాదనను తాను బయటపెట్టానని అన్నారు. మొదటి నుంచి నిరాధార ఆరోపణలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందని సోమిరెడ్డి మండిపడ్డారు.

March 2, 2026 / 07:34 AM IST

‘బాధిత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలి’

ఏలూరులో దేవ తెలకుల రాష్ట్ర సంఘం కార్యదర్శి కాశిన సత్యనారాయణ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. మండపేట (M) ద్వారపూడిలో జరిగిన పరువు హత్యలో తమ సామాజిక వర్గానికి చెందిన సూర్యప్రకాష్ అన్యాయంగా బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

March 2, 2026 / 07:34 AM IST

నేడు వికారాబాద్‌కు రాహుల్ గాంధీ

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9:20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్, అక్కడి నుంచి 10 గంటలకు హెలికాప్టర్‌లో వికారాబాద్‌కు వెళ్తారు. పార్టీ బలోపేతంపై ఈ పర్యటనలో ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

March 2, 2026 / 07:34 AM IST

పీఏబీఆర్ డ్యాంలో తగ్గుతున్న నీటి మట్టం

ATP: కూడేరు మండలంలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం నాటికి జలాశయంలో 3.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. హంద్రీనీవా నుంచి 300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ధర్మవరం కాలువ, తాగునీటి ప్రాజెక్టులకు కలిపి 685 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది.

March 2, 2026 / 07:32 AM IST

జ్యూడిషియల్ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన

GNTR: రాజధాని అమరావతిలో రూ. 210 కోట్లతో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలను సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ప్రారంభించారు. అదే విధంగా, హైకోర్టు అతిథి గృహం, జ్యూడిషియల్ అకాడమీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:31 AM IST

ఆపరేషన్ సికింద్రాబాద్.. నిందితుడు అరెస్ట్..!

MDCL: ‘ఆపరేషన్ సికింద్రాబాద్’ పేరిట రైల్వే సామాగ్రి దొంగతనాలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మౌలాలి, అశ్వాపురం ప్రాంతాల్లో గాలింపు నిర్వహించి యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. ఈ క్రమంలో ఓ దొంగను పట్టుకుని అతని వద్ద నుంచి ఎలక్ట్రిక్ వైర్, భారీ పంపుసెట్ స్వాధీనం చేసుకున్నారు.

March 2, 2026 / 07:30 AM IST

అనుమతి లేకుండా తుపాకీ.. వేటగాడు రిమాండ్!

VKB: జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తిని కుల్కచర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అడవి పందులను వేటాడేందుకు సదరు వ్యక్తి తుపాకీని వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

March 2, 2026 / 07:30 AM IST

శంషాబాద్‌లో హాకీ ప్లేయర్లకు స్వాగతం

HYD: మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియంలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు వస్తున్న 8 దేశాల క్రీడాకారిణులకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హాకీ వరల్డ్ కప్ ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.

March 2, 2026 / 07:27 AM IST

నేడు యానంలో మీసాల వేంకన్న రథోత్సవం

కోనసీమ: యానాంలో శ్రీ భూ సమేత మీసాల వేంకటేశ్వర స్వామి రథోత్సవం సోమవారం అత్యంత వేడుకగా జరగనుంది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయం నుంచి న్యూ బస్టాండ్ వరకు స్వామివారి రథయాత్ర సాగనుంది. మీసాలతో దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు

March 2, 2026 / 07:27 AM IST

గల్ఫ్ దేశాల్లో తెలుగువారు.. కుటుంబాల్లో ఆవేదన!

TG: పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా మారుతుండటంతో గల్ఫ్ దేశాల్లోని తెలుగువారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. టెహ్రాన్‌లో చదువుతున్న పాతబస్తీ విద్యార్థులు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కరీంనగర్, నిజామాబాద్ కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇజ్రాయెల్‌లోని తెలుగువారు బంకర్లలో తలదాచుకుంటుండగా, వారి భద్రతపై ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 2, 2026 / 07:27 AM IST

మోడల్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు

SDPT: బెజ్జంకి మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాల దరఖాస్తుల గడువును మార్చి 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ మలోత్ సంగీత తెలిపారు. సంచాలకులు సున్నం శ్రీనివాస్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19, 2026న జరగనుంది. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ₹2000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

March 2, 2026 / 07:26 AM IST