TG: ఇరాన్-ఇజ్రాయెల్‌లోని భారతీయులు సేఫ్‌గా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వాసులను సురక్షితంగా తీసుకువస్తామని అన్నారు. ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విదేశాంగ శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ.. అక్కడి భారతీయుల కదలికలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే సురక్షితంగా భారత్‌కు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.