టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. రికెల్టన్ 31, బ్రెవిస్ 42, మిల్లర్ 22, జార్జ్ లిండె 30*, స్టబ్స్ 21* పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా 3 వికెట్లు పడగొట్టాడు.