సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఔషధాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.