• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘నన్ను భూమ్మీద లేకుండా చేయాలనుకున్నారు’

AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 2న తనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని తెలిపారు. ‘నాపై దాడి చేస్తారని నా గన్‌మెన్‌కి 15సార్లు ఇంటెలిజెన్స్ ఫోన్ చేసింది. నన్ను భూమ్మీద లేకుండా చేయాలనుకున్నారు. నన్ను అంతం చేయాలనే లక్ష్యంతో కొందరు ప్రయత్నించారు. నెమలి గ్రామంలో కరెంట్ కట్‌చేసి దాడి చేయాలనుకున్నారు’ అని వెల్లడించారు.

March 6, 2026 / 08:29 AM IST

అదుపు తప్పి పొలంలో బోల్తా పడిన కారు

WGL: పర్వతగిరి మండలం రావూరు గ్రామం సమీపంలో మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పర్వతగిరి నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కారు శుక్రవారం అదుపు తప్పి వ్యవసాయ పొలంలో దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలైయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని కారు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. బోల్తాపడిన కారును ట్రాక్టర్ సాయంతో బయటకు తీశారు.

March 6, 2026 / 08:28 AM IST

‘అగ్ని గంగమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు’

PPM: నీలావడి అగ్ని గంగమ్మ జాతర సందర్భంగా ఈ నెల 8, 9,10,11 తేదీలలో పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో ప్రబంధకుడు ఎస్.లక్ష్మణరావు గురువారం తెలిపారు. రద్దీని బట్టి అదనంగా బస్సులు పెంచుతామని చెప్పారు. ప్రయాణికులు ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సంప్రదించాలన్నారు.

March 6, 2026 / 08:28 AM IST

గుమ్మడవెల్లిలో తీరిన తాగునీటి కష్టాలు

NLG: గుమ్మడవెల్లి గ్రామంలో తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు సర్పంచ్ ఆదిరాల సుమలత రమేష్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పంచాయతీ సిబ్బందితో కలిసి నీటి ట్యాంకులను శుభ్రం చేయించి, ప్రతి ఇంటికీ సరఫరా పునరుద్ధరించారు. వేసవిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, నీటి వృధాను అరికట్టాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.

March 6, 2026 / 08:28 AM IST

నేడు మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమావేశం

RR: ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపై మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నేడు సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు. ఉదయం 10 గంటలకు అజీజ్ నగర్‌లోని మున్సిపల్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో 99 రోజుల కార్యాచరణపై చర్చిస్తామన్నారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు హాజరుకావాలన్నారు. 

March 6, 2026 / 08:27 AM IST

ఉత్తమ డైరీగా జాతీయ స్థాయి అవార్డు

KMR: బీబీపేట్‌కు చెందిన 14 మంది మహిళలు స్త్రీనిధి బ్యాంకు సహకారంతో క్షీరసాగరం డైరీ ఫామ్ సంస్థ నెలకొల్పారు. ఆ సంస్థ నిర్వహణ తీరుపై జాతీయస్థాయిలో ఓ ఛానెల్ సర్వేలో ఉత్తమ డైరీ అవార్డుకు ఎంపికయ్యింది. దీంతో రేపు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో అవార్డు అందుకోనున్నట్లు మహిళలు తెలిపారు. సంస్థ ప్రారంభం నుంచి లాభల బాటలో నడవడం నిలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

March 6, 2026 / 08:27 AM IST

‘మతసామరస్యానికి ప్రతీక రంజాన్’

BDK: అశ్వాపురం జామా మసీదులో బుధవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక అయిన ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఖురాను అవతరించిన శుభ సందర్భంగా ముస్లిం సోదరులు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రంగా భక్తిశ్రద్ధలతో చేపడతారని తెలిపారు.

March 6, 2026 / 08:26 AM IST

చెత్త రికార్డ్.. ధోనీ సరసన దూబే

T20 WC సెమీస్‌లో రనౌట్ అవ్వడంతో శివమ్ దూబే(43) ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. ఒకే ఎడిషన్ టోర్నీలో అత్యధికంగా 3 సార్లు రనౌటయిన ఆటగాడిగా నిలిచి, 19 ఏళ్ల నాటి MS ధోనీ రికార్డ్ సమం చేశాడు. ఈ టోర్నీలో దూబే నమీబియా, పాక్, ఇంగ్లండ్ మ్యాచ్‌ల్లో రనౌట్ కాగా.. 2007 టోర్నీలో ధోనీ న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా మ్యాచ్‌ల్లో ఇలాగే వెనుదిరిగాడు.

March 6, 2026 / 08:25 AM IST

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు గాంధూళి

SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలోని స్వయంభు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా నేడు ఉదయం 10 గంటలకు గాంధూళి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ రామయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలియజేశారు. గాంధూళి కార్యక్రమం అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఉందని తెలియజేశారు.

March 6, 2026 / 08:25 AM IST

జిల్లాలో పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి..!

KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన 18,542 పక్కా ఇళ్లలో 4,915 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని గృహనిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రాజశేఖర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రూరల్, అర్బన్, రాజుపాలెం మండలాల్లో పూర్తయిన ఇళ్ల వివరాలను వెల్లడించారు. మిగతా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

March 6, 2026 / 08:25 AM IST

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

CTR: జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. 518 పాఠశాలల్లోని 23,095 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్టు చెప్పారు. వీరి కోసం 129 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హాల్ టికెట్లు ఆన్ లైన్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

March 6, 2026 / 08:24 AM IST

నిరుపేద యువతి వివాహానికి NRI సాయం

SDPT: ముస్త్యాల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తరిగొప్పుల సిద్ధులు రెండో కుమార్తె వివాహానికి NRI నూనె కవిత వీరేంద్ర ఫణికుమార్ చేయూతనందించారు. వారి తరపున నిన్న వివాహానికి అవసరమైన పుస్తె మట్టెలను అందజేశారు. అలాగే ఉత్కం భానుచందర్ గౌడ్ రూ. 2,000 నగదు సాయం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొని దాతల ఉదారతను అభినందించారు.

March 6, 2026 / 08:23 AM IST

కేరళ కొత్త పేరు ‘కేరళం’ అంటే ఏంటి?

కేరళ పేరును ‘కేరళం’గా మార్చే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో చాలామందిలో ఉత్పన్నమైన ప్రశ్న ‘కేరళం అంటే అర్థం ఏంటి?’. మలయాళంలో ‘కేర’ అంటే కొబ్బరి, ‘ఆళం’ అంటే భూమి. రాష్ట్ర సంప్రదాయ, చారిత్రక వారసత్వం, మలయాళీ మూలాలను ప్రతిబింబించేందుకు ఈ పేరు మార్పు దోహదపడుతుందని ఆ రాష్ట్ర ప్రజల భావన.

March 6, 2026 / 08:21 AM IST

సింగరాయకొండలో తప్పిన ప్రమాదం

ప్రకాశం: సింగరాయకొండ మాగుంట సుబ్బరామిరెడ్డి ఫ్యాక్టరీ సమీపంలో గురువారం జాతీయ రహదారిపై గ్రానైట్ బండల రోడ్డుకి అడ్డంగా పడ్డాయని ఎస్సై మహేంద్ర తెలిపారు. బల్లికురవలోని కాశిరెడ్డి క్వారీ నుంచి గ్రానైట్ బండలను బెంగళూరు తీసుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఎస్సై మహేంద్ర తెలిపారు.

March 6, 2026 / 08:21 AM IST

10వ తరగతి పరీక్షలకు 3 కేంద్రాలు ఏర్పాటు

VZM: ఈ నెల 16 నుంచి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు దత్తిరాజేరు మండలంలో 3 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ వెంకట్రావు ఇవాళ తెలిపారు. దత్తిరాజేరు, మరదం, పెదమానపురం హైస్కూల్స్ పరీక్ష కేంద్రాలని ఎంఈఓ తెలిపారు. ఈ 3 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 11 పాఠశాలలకు చెందిన 483 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.

March 6, 2026 / 08:19 AM IST