VZM: ఈ నెల 16 నుంచి జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు దత్తిరాజేరు మండలంలో 3 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ వెంకట్రావు ఇవాళ తెలిపారు. దత్తిరాజేరు, మరదం, పెదమానపురం హైస్కూల్స్ పరీక్ష కేంద్రాలని ఎంఈఓ తెలిపారు. ఈ 3 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 11 పాఠశాలలకు చెందిన 483 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని ఆయన తెలిపారు.