• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పర్యాటకులను ఆకట్టుకుంటున్న నిజాంకొండ

BHPL: బీచుపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రం సమీపంలోని కృష్ణా నది మధ్యలో ఉన్న నిజాంకొండ పర్యాటకులను ఆకర్షిస్తోంది. నిజాం నవాబుల కాలంలో శత్రువుల కదలికలపై నిఘా కోసం ఈ ద్వీపాన్ని సైనిక స్థావరంగా ఉపయోగించేవారు. నదీజలాలు, పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ఈ కొండను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గద్వాల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.

March 6, 2026 / 08:44 AM IST

పది విద్యార్థులకు బస్ ఫ్రీ..!

KRNL: పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించాలని సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలు జరిగే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఆర్డీనర బస్సుల్లో ఈ సౌకర్య ఉంటుంది.

March 6, 2026 / 08:44 AM IST

బిడ్డను ఉయ్యాలలో వదిలి.. అనంతలోకాలకు

MBNR: అప్పుల బాధ ఆ పసిగుడ్డుకు తల్లిని దూరం చేసింది. తండ్రిని మృత్యువుతో పోరాడేలా చేసింది. జంగమయ్య పల్లిలో చోటుచేసుకున్న దంపతుల ఆత్మహత్యాయత్నం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పులు తీర్చే మార్గం కనిపించక మురుగని దంపతులు తమ పొలంలో పసిబిడ్డను ఉయ్యాలలో వేసి, పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నారు.

March 6, 2026 / 08:43 AM IST

‘ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి’

SRCL: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని చందుర్తి ఎస్సై రమేష్ అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో గురువారం వాహనాలతానికి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీరోజు రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా డ్రైవర్లు వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు.

March 6, 2026 / 08:41 AM IST

కుటుంబ కలహాలతో గర్భిణీ ఆత్మహత్య

అన్నమయ్య: పెద్దమండ్యం మండలం కలిచర్లలో కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీలత (18) అనే ఎనిమిది నెలల గర్భిణీ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.

March 6, 2026 / 08:41 AM IST

‘కొలికపూడి వైసీపీతో అంటకాగుతున్నారు’

AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడికి టీడీపీ నేత శావల దేవదత్ కౌంటర్ ఇచ్చారు. కార్యకర్తల కష్టాన్ని కొలికపూడి గుర్తించడం లేదన్నారు. ‘నీ ప్రస్థానం ఎక్కడ మొదలైందో.. పతనమూ అక్కడే ప్రారంభమైంది. తిరువూరులో అగ్రవర్ణాలే నిన్ను భుజాలపై మోశారు. గతంలో లేని ప్రొటోకాల్ ఇప్పుడే ఎందుకు వచ్చింది. కొలికపూడి వైసీపీతో అంటకాగుతున్నారు’ అని మండిపడ్డారు.

March 6, 2026 / 08:41 AM IST

శ్రీశైలంలో ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట

NDL: శ్రీశైలంలో పాలధార-పంచదార వద్ద ఈనెల 8న శ్రీ శారదాంబ సహిత జగద్గురు ఆదిశంకరచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు EO శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి యాగశాల ప్రవేశం గణపతి పూజ, పుణ్యాహవాచనం,చతుర్వేద పారాయణం,జలాధివాసంపూజలు ఉంటాయన్నారు. సాయంత్రం క్షీరాదివాసం, ఆదివాస హోమాలు నిర్వహిస్తామని చెప్పారు.

March 6, 2026 / 08:40 AM IST

చికిత్స పొందుతూ అక్బర్ నగర్ వాసి మృతి

NZB: రుద్రూర్ మండలం అక్బర్ నగర్‌కు చెందిన కత్తి గంగారాం (42) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సాయన్న శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 28న రుద్రూర్ వ్యవసాయ పరిశోధన స్థానం వద్ద మొరం కుప్పపై పడి గంగారాం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

March 6, 2026 / 08:39 AM IST

క్రీడా పోటీలను ప్రారంభించిన అదనపు కలెక్టర్

BHNG: జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆటల పోటీలకు గురువారం ముఖ్య అతిదిగా రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి హాజరై జెండా ఊపి ప్రారంభించారు. పురాతన కాలంలో మహిళలు అన్ని ప్రాంతాలలో పాల్గొనడానికి సాధికారికత ఇవ్వలేదు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని కోరినారు.

March 6, 2026 / 08:32 AM IST

రక్త బంధం కన్నా మానవత్వమే మిన్న

అనంతపురంలో మానవత్వం చాటుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మృతి చెందిన ధనలక్ష్మి(40) అనే అనాథ మహిళకు బాబావాలి కబ్రస్తాన్ ప్రతినిధులు అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి కుమారుడు అఖిల్ దిక్కుతోచని స్థితిలో ఉండగా, ఐఎంఎం మహబూబ్ భాషా సమాచారం మేరకు వారు స్పందించారు.

March 6, 2026 / 08:31 AM IST

సాంబ జగదీశ్వరుడిని తాకిన భానుడి కిరణాలు

SKL: నరసన్నపేట మండలం తామరపల్లి గ్రామంలోని శ్రీ సాంబ జగదీశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయ ప్రధాన అర్చకులు నాగబాబు ఆలయ ద్వారాలు తెరవగానే, సూర్యుని లేలేత కిరణాలు నేరుగా గర్భగుడిలో కొలువుదీరిన శివలింగాన్ని తాకాయి. ఆలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారి అని అర్చకులు తెలిపారు.

March 6, 2026 / 08:30 AM IST

సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య

NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సూర్యప్రభ వాహన సేవను ఆలయ అధికారులు వైభవంగా నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి వాహన సేవను దర్శించుకున్నారు.

March 6, 2026 / 08:30 AM IST

ఇంటర్ పరీక్షకు ‘సెట్-బి’

SRD: జిల్లాలో ఇవాళ జరుగుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు సంబంధించి అధికారులు ‘సెట్-బి’ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ అధికారి తెలిపారు. ఇవాళ మ్యాథ్స్ పేపర్-2B, జూవాలజీ-2, హిస్టరీ–2 పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఈ అప్డేటు గమనించగలరు. నిబంధనల ప్రకారం స్టూడెంట్స్ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

March 6, 2026 / 08:30 AM IST

ఫర్టిలైజర్ కంపెనీ నూతన సీఈవోగా సంజీవ్

PDPL: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నూతన సీఈఓగా సంజీవ్ గులాటి బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో సుమారు 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన మెకానికల్ ఇంజనీరింగ్, ప్లాంట్ నిర్వహణలో నిపుణులు. సంజీవ్ గులాటి నాయకత్వంలో సంస్థ మరిన్ని ఆవిష్కరణలతో ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.

March 6, 2026 / 08:30 AM IST

ANUలో 20 అవగాహన ఒప్పందాలు ఖరారు

PLD: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం విద్య-పరిశ్రమల సమ్మేళనంలో ANU-పరిశ్రమల మధ్య 20 అవగాహన ఒప్పందాలు కుదిరినట్లు సమ్మేళనం కన్వీనర్ పద్మావతి తెలిపారు. వర్సిటీ రిజిస్టార్ సింహాచలం-వివిధ పరిశ్రమల ప్రతినిధులు అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయటంతో పాటు అవగాహన ఒప్పంద పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు.

March 6, 2026 / 08:30 AM IST