NZB: రుద్రూర్ మండలం అక్బర్ నగర్‌కు చెందిన కత్తి గంగారాం (42) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సాయన్న శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 28న రుద్రూర్ వ్యవసాయ పరిశోధన స్థానం వద్ద మొరం కుప్పపై పడి గంగారాం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు.