• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పబ్లిక్ టాయిలెట్లకు ప్రత్యేక శుభ్రత కార్యక్రమం

BPT: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల పురపాలక సంఘం పరిధిలో శుక్రవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ జి. రఘునాధ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ప్రజలు వినియోగిస్తున్న పబ్లిక్ టాయిలెట్లను శుభ్రపరిచారు. పారిశుధ్య సిబ్బంది టాయిలెట్లను పూర్తిగా శుభ్రం చేశారు.

March 6, 2026 / 09:18 AM IST

బుమ్రా బౌలింగ్ అద్భుతం: సూర్య, బ్రూక్

T20 WC సెమీస్‌లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడని భారత్, ఇంగ్లండ్ కెప్లెన్లు సూర్య, బ్రూక్ కితాబిచ్చారు. చక్కగా బ్యాటింగ్ చేస్తున్న ప్రత్యర్థిని కట్టడి చేయడంలో బుమ్రా రాణించాడని.. ఇతర బౌలర్లూ ఇంగ్లండ్ గెలవకుండా చేశారని సూర్య అన్నాడు. బుమ్రా అత్యుత్తమ బౌలర్ అని బ్రూక్ పేర్కొన్నాడు. ముఖ్యంగా అక్షర్ పట్టిన తన క్యాచ్ తాను చూసినవాటిల్లో బెస్ట్ అని చెప్పాడు.

March 6, 2026 / 09:16 AM IST

కబడ్డీ పోటీలను ప్రారంభించిన బీసీ ఇందిరమ్మ..!

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన కబడ్డీ పోటీలను బీసీ ఇందిరమ్మ ఘనంగా ప్రారంభించారు. అనంతరం కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి ఆమె బహుమతులను అందజేశారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.

March 6, 2026 / 09:15 AM IST

వేం నరేందర్‌ను సన్మానించిన డీసీసీ అధ్యక్షుడు

HNK: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వేం నరేందర్ రెడ్డిని కుడా ఛైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి నేడు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయనను కలిసి, పూలబొకే అందజేసి, శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాల గురించి వారు చర్చించారు.

March 6, 2026 / 09:15 AM IST

నేడు ఆలయ పునర్నిర్మాణంలో కీలక ఘట్టం

PLD: మహంకాళి అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆలయ ప్రదక్షణ మండపంలో ‘సూర్య కాంతి స్తంభం’ స్థాపన కార్యక్రమం జరగనుంది. దీనితో పాటు అమ్మవారి 51వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవం కూడా ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల కోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

March 6, 2026 / 09:15 AM IST

వైర్లను సరి చేసుకోవాలి: పెబ్బేరు ఎస్సై

పాత వైర్లను సరి చూసుకొని అవసరమైతే కొత్త వైర్లను మార్చుకోవాలని పెబ్బేరు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు. చాలావరకు విద్యుత్ షాక్‌తో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అవసరం లేనప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం ఉత్తమం అని తెలిపారు. రానున్న ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా మరింత జాగ్రత్త పడాలి అన్నారు.

March 6, 2026 / 09:15 AM IST

నేటి శివ కళ్యాణానికి విస్తృత ఏర్పాట్లు

SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నేడు జరిగే శివకళ్యాణంకు విస్తృత ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయం పార్కింగ్ వద్ద శివార్చన స్టేజ్ వద్ద కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. క్యూలైన్లు, భోజన వసతి, త్రాగునీరు, నీడ కోసం టెంట్లు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలు, కూలర్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు

March 6, 2026 / 09:14 AM IST

పోక్సో కేసులో ఓ వ్యక్తికి జైలు..!

NGKL: పోక్సో కేసులో ఓ నిందితుడికి జిల్లా కోర్టు 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. NGKL లోని శ్రీపురం రోడ్డు సంజయ్ నగర్ కాలనీకి చెందిన సుజిత్ (గణేశ్) (21)పై 2024లో కైమ్ నంబర్ 294 పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం జిల్లా స్పెషల్ జడ్జి నసీం సుల్తానా నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్షతోపాటు రూ. 20 వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.

March 6, 2026 / 09:12 AM IST

‘బాల బాలికలకు హెల్త్ ఐడీ అకౌంట్ ఉండాలి’

AKP: ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం సమాచారాన్ని డిజిటల్ విధానంలో భద్రపరచడానికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడిని ప్రవేశపెట్టినట్లు డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ హైమావతి గురువారం తెలిపారు. అనకాపల్లిలో ఆమె మాట్లాడుతూ.. 14 నుంచి 15 ఏళ్ల బాల బాలికలకు తప్పనిసరిగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీ ఉండాలన్నారు.

March 6, 2026 / 09:11 AM IST

ఉదయాన్నే హైవేపై యాక్సిడెంట్

VSP: చిన్నయ్యపాలెం హైవేపై ఇవాళ గుర్తుతెలియని వ్యాను, ఆటోను ఢీకొట్టడంతో కె.కోటపాడు మండలం సంతపాలెం గ్రామానికి చెందిన నంబారు ఈశ్వరమ్మ తీవ్ర గాయాలపాలైయ్యారు. రైతుబజార్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయాన్నే కురుస్తున్న దట్టమైన పొగమంచుకు వాహనాలు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

March 6, 2026 / 09:11 AM IST

అమరావతిలో నిర్మాణ పనుల పరిశీలన

GNTR: అమరావతిలో సాగుతున్న వివిధ నిర్మాణ పనులను ఏజీఐసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ గురువారం స్వయంగా పరిశీలించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు, ఎన్‌జీవో క్వార్టర్లు, హైకోర్టు, గవర్నమెంట్ కాంప్లెక్స్ పనుల పురోగతిని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించి, నిర్ణీత గడువులోగా పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.

March 6, 2026 / 09:10 AM IST

‘దంతాల సంరక్షణతోనే ఆరోగ్య రక్షణ’

MNCL: జిల్లా కేంద్రంలో శుక్రవారం జాతీయ డెంటిస్ట్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా దంత పరీక్షలు చేసి.. దంతాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ బండి హరీష్ గౌడ్ అవగాహన కల్పించారు. దంతాల సంరక్షణ శరీర ఆరోగ్యానికి, మంచి జీర్ణక్రియకు ముఖ్యమని తెలిపారు.

March 6, 2026 / 09:08 AM IST

తిరుమలలో రీల్స్.. తిరుపతి కోర్టుకు దువ్వాడ

TPT: తిరుమలలో రీల్స్ చేయడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. దీంతో వారిద్దరూ కలిసి తిరుపతి కోర్టుకు గురువారం వచ్చారు. రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి కోటేశ్వరరావు వాదనలు విన్నారు. మే 12వ తేదీన ఇద్దరు పూచీకత్తులతో పాటు జామీను పత్రాలను అందజేయాలని ఆదేశించారు.

March 6, 2026 / 09:06 AM IST

ఆదిలాబాద్ ITI కళాశాలలో అప్రెంటిషిప్ మేళా

ADB: ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కావున జిల్లాలోని ITI ఉత్తీర్ణులైన విద్యార్థులు https://www .apprenticeshipindia.gov.in/mela Registration ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.

March 6, 2026 / 09:04 AM IST

భారీ జీతంతో NCDC ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(NCDC)లో 14 స్పెషలిస్ట్ గ్రేడ్-3(పబ్లిక్ హెల్త్) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. డిప్లొమా, డిగ్రీ, MBBSలో ఉత్తీర్ణత గలవారు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గలవారు తమ అప్లికేషన్‌ను ఢిల్లీలోని NCDC కార్యాలయానికి ఆఫ్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.1,23,500 జీతంగా చెల్లిస్తారు.

March 6, 2026 / 09:03 AM IST