SRPT: మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన బూదరపు ఉపేందర్ తన ట్రాక్టర్ ద్వారా ముకుందాపురం శివారులోని పాలేరు వాగు నుంచి అక్రమంగా మద్దిరాలకు ఇసుకను తరలిస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్ఐ వీరన్న హెచ్చరించారు.
WGL: రాయపర్తి మండలం శివరామపురంలో తాగునీటి బోర్ల మోటార్లకు శుక్రవారం మర్మమత్తుల కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ పెద్దగోని నాగరాజుగౌడ్ వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో చెడిపోయిన మోటార్లను బయటకు తీసి వాటిని రిపేర్ చేశారు. అనంతరం మళ్లీ బోర్లలో మోటార్లను బిగించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ELR: ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈనెల 7న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా రెడ్డి భీమడోలులో పర్యటించనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో నిర్వహించే ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆమె పాల్గొని కూలీలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహనరావు పార్టీ నేతలతో కలిసి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు.
KRNL: పత్తికొండలోని శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనునారు. ఈ మేళాలో వివిధ కంపెనీలలో 395 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఫార్మసీ చదివి 18-40 ఏళ్ల మధ్య వారు అర్హులు. ఇంటర్వ్యూలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో శుక్రవారం రోజున కళ్యాణ లక్ష్మీ చెక్కుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంది తిరుపతిరెడ్డి వైస్ ఛైర్మన్ బంక చందు తోటపల్లి సర్పంచ్ బంక లక్ష్మీ గాంధీనగర్ సర్పంచ్ పోలు సంపత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొంగోని శ్రీనివాస్ లబ్ధిదారులు, అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.
VSP: రైల్వే టెక్నీషియన్ గ్రేడ్-3 పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో సుమారు పది మంది అభ్యర్ధులు అవకాశం కోల్పోయారు. పెందుర్తి చినముషిడివాడ డిజిటల్ అయాన్ సెంటర్‌లో ఇవాళ ఉదయం మొదటి షిఫ్ట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 నుంచి 8:30 వరకు రిపోర్టింగ్ సమయం కాగా, అభ్యర్థులు 8:35 గంటలకు రావడంతో వారిని అనుమతించలేదు.
NZB: రైల్వే ట్రాఫిక్ బ్లాక్ నేపథ్యంలో కొన్ని రైళ్లకు దారి మళ్లింపు చేసినట్లు CPRO శ్రీధర్ తెలిపారు. మే 3,5వ తేదీల్లో సికింద్రాబాద్-దానాపూర్ (12791) ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట జంక్షన్ మార్గం కాకుండా సికింద్రాబాద్-NZB-పెద్దపల్లి మార్గం మీదుగా నడిపించనున్నారు. మే 4న యశ్వంత్‌పూర్-లక్నో 22683 ఎక్స్‌ప్రెస్‌ను కాచిగూడ-NZB పెద్దపల్లి మార్గంలో దారి మళ్లిస్తున్నారు.
MDK: ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో 100% ఆస్తి పన్ను వసూలు చేయాలని మెదక్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతి రాజు అధికారులను ఆదేశించారు. గురువారం వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్, రెవెన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. నిర్ణీత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
NLG: 6వ తేదీన జరగాల్సిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం ఈ నెల 7కు వాయిదా వేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని అధికారులు, సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేసి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని కోరారు. పరిపాలన పరమైన కారణాల వల్ల సన్నాహక సమావేశం ను వాయిదా వేసినట్లు కలెక్టర్ తెలిపారు.
మారుతి సుజుకి తన అరీనా కార్లపై ఈ నెలాఖరు వరకు భారీ ఆఫర్లను ప్రకటించింది. స్విఫ్ట్ మోడల్‌పై గరిష్టంగా రూ.50 వేల వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, బ్రెజ్జాపై రూ.45,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. వ్యాగన్‌ఆర్, ఆల్టో K10, సెలెరియో, ఈకో కార్లపై రూ.42,500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్లతో నగదు డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్స్ ఉన్నాయి.
HYD: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి 36 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్ హౌస్‌లో మరమ్మతులు, ఆధునీకరణ పనుల కారణంగా జలమండలి (HMWSSB) ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మణికొండ, కోకాపేట్, నార్సింగి, షేక్‌పేట్, భోజగుట్ట వంటి ప్రాంతాల్లో తక్కువ ప్రెజర్‌తో నీరు సరఫరా అవుతుందని అధికారులు తెలిపారు.
SRD: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించడం ఎంతో అవసరమని DM సుబ్రహ్మణ్యం తెలిపారు. నేడు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఖేడ్ TGSRTC డిపో ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం చేపడుతున్న రోడ్డు భద్రత కార్యక్రమాలకు సహకరించాలన్నారు.
కృష్ణా: గుడివాడ మండలం బేతవోలు హై స్కూల్ విద్యార్థులకు మహిళల భద్రతపై వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళల గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
MBNR: హన్వాడ మండలం కిష్టంపల్లికి చెందిన గాయత్రి తనకు పురిటి నొప్పులు రావడం వలన 108కి ఫోన్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది శ్రీనివాస్ ఇంటి దగ్గరే కాన్పు చేయడం వల్ల ఆమె పండంటి మగ బిడ్డకు జన్మించింది. తల్లి, బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. వారిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించినట్లు పైలెట్ సలీం, శ్రీనివాస్ తెలిపారు.
SRPT: నూతనకల్ మండలం పెదనేమిల గ్రామంలో సీసీ రోడ్డు ప్రక్కన మట్టిని చదును చేసి పనులు శుక్రవారం వేగంగా సాగుతున్నాయి. రోడ్డుకు రెండు వైపులా ఎత్తుపల్లాలుగా ఉన్న మట్టి వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారారని గుర్తించిన సర్పంచ్.. ట్రాక్టర్ సహాయంతో లెవలింగ్ చేయించారు. దీనివల్ల ఎదురుగా వచ్చి వాహనాలు పక్కకు తప్పుకోవడానికి వీలుంటుందని సర్పంచ్ తెలిపారు.