• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అందరి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం’

ADB: అందరి సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శుక్రవారం ఉట్నూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు.

March 6, 2026 / 11:17 AM IST

వార్డు అభివృద్ధికి రూ.50 లక్షల మంజూరు

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో 23వ వార్డు అభివృద్ధికి ఈ నెలలో రూ. 50 లక్షలు మంజూరు చేస్తానని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ఇవాళ విజయవాడ మంత్రి నివాసంలో 23వ వార్డు కౌన్సిలర్ ఎం రామకృష్ణ మంత్రిని కలిశారు. గతంలో వార్డు అభివృద్ధి కోసం కౌన్సిలర్ ఆమరణ దీక్ష చేసిన సందర్భంగా మంత్రి రూ.కోటి నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు.

March 6, 2026 / 11:17 AM IST

రైతుల సమస్యలను పరిష్కరించిన సర్పంచ్

BDK: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామ రైతులు వ్యవసాయ పంట పొలాలకు వెళ్లే దారి గుంతల మయంగా ఉందని మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్ భూక్య సరిత సుధాకర్‌కు విన్నవించారు. స్పందించిన సర్పంచ్ శుక్రవారం సుమారు నాలుగు కిలోమీటర్ల మేర గ్రావెల్‌తో చదును చేయించి ప్రజల మన్ననలు పొందారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

March 6, 2026 / 11:16 AM IST

నేడు అర్ధరాత్రి నుంచి నీటి సరఫరా బంద్

RR: సింగూరు ప్రాజెక్టు నుంచి HYDకు నీటిని సరఫరా చేసే పైపులైన్‌కు ప్రాజెక్టు వద్ద లీకేజీ ఏర్పడటంతో ఒక రోజు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు మణికొండ డివిజన్ జలమండలి మేనేజర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నీటి సరఫరా ఉండదని, మణికొండ, నార్సింగి, కోకాపేట డివిజన్ల పరిధిలో రావాల్సిన నీరు రాదన్నారు.

March 6, 2026 / 11:16 AM IST

వైరా మున్సిపాలిటీలో ప్రజా పాలన ర్యాలీ

KMM: వైరా పట్టణాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం వైరా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ కాపా చంద్రకళ, వైస్ ఛైర్మన్ కట్ల సంతోష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 99 రోజుల కార్యాచరణలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.

March 6, 2026 / 11:15 AM IST

గవిగట్టులో తీరిన తాగునీటి కష్టాలు..!

KRNL: పెద్దకడబూరు మండలం గవిగట్టు గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన పైప్‌లైన్ల ద్వారా శుక్రవారం తాగునీటి సరఫరా ప్రారంభమైంది. యువ నాయకుడు మునిస్వామి ఆధ్వర్యంలో 6 వీధుల్లోని ప్రతి ఇంటికీ నీరు అందేలా చర్యలు చేపట్టారు. పైప్‌లైన్లను పరిశీలించి, నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందని నిర్ధారించారు. ఏళ్ల నాటి తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

March 6, 2026 / 11:14 AM IST

అక్యూపంక్చర్.. సూదులతో రోగాలకు చెక్

అక్యూపంక్చర్ ఓ పురాతన చైనీస్ చికిత్సా విధానం. శరీరంలోని నిర్దిష్ట పాయింట్ల వద్ద సన్నని సూదులను ఉంచడం ద్వారా శరీర శక్తిని(Qi) క్రమబద్ధీకరిస్తారు. దీనివల్ల దీర్ఘకాలిక నొప్పులు (కీళ్లు, వెన్ను, మెడ), తీవ్రమైన ఒత్తిడి, మైగ్రేన్ సమస్యలు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడి, నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ఇది ఎటువంటి మందులు లేకుండా సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే సురక్షితమైన పద్ధతి.

March 6, 2026 / 11:14 AM IST

వైసీపీ ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం చేసింది: పవన్

AP: గత వైసీపీ ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సుమారు రూ.10 లక్షల కోట్ల అప్పులను వదిలివెళ్లిందని చెప్పారు. కేంద్ర నిధులను కూడా గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. వైసీపీ హయాంలో విద్యార్థిలోకం ఎంతో నష్టపోయిందన్నారు. కేంద్ర నిధులను వాడకపోవడం అవి వెనక్కి వెళ్లిపోయాయని పవన్ వెల్లడించారు.

March 6, 2026 / 11:13 AM IST

జిల్లాలో రూ. 24కోట్ల టార్గెట్..!

చిత్తూరు జిల్లాలోని గ్రామాల్లో పన్నుల వసూళ్లే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 622 పంచాయతీలు ఉన్నాయి. రూ. 24 కోట్ల పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు రూ. 18 కోట్ల రాబట్టారు. ఈనెల 15వ తేదీలోపు మరో రూ. 6 కోట్ల వసూళ్లే లక్ష్యంగా సిబ్బంది గ్రామాల్లో తిరిగి రాబడుతున్నారు.

March 6, 2026 / 11:10 AM IST

శాలి లింగోటం గ్రామంలో తీవ్ర విషాదం

NLG: శాలిగౌరారం మండలంలోని శాలి లింగోటం గ్రామంలో బుధవారం కోనేటి అఖిల్, లోడే పవన్ అనే ఇద్దరు స్నేహితులు మద్యం సేవించి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని స్థానికులు గమనించి 108 వాహనంలో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

March 6, 2026 / 11:10 AM IST

రాజ్యసభ కోటాలో చివరికి నిరాశ ఎదురైంది..!

NGKL: తెలంగాణలో రాజ్యసభ కోటాలో అవకాశం వస్తుందనే ఆశతో ఎదురుచూసిన వంశీ చందర్ రెడ్డికి చివరికి నిరాశ ఎదురైంది. రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్య సభస్థానాల కోసం వివిధ నాయకుల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, చివరి దశలో ఆయనకు అవకాశం దక్కలేదు. పార్టీ పట్ల తన నిబద్ధత కొనసాగుతుందని.. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

March 6, 2026 / 11:10 AM IST

చెత్త దహనం.. నగరవాసుల ఆందోళన

అనంతపురం ఆదిమూర్తి నగర్‌లోని ఉపాధ్యాయ భవన్ వద్ద చెత్తను తగలబెట్టడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉండగా కాల్చడంతో విషవాయువులు వ్యాపిస్తున్నాయని వాపోతున్నారు. చెత్తలో ప్రైవేట్ ఆసుపత్రి వ్యర్థాలు కూడా ఉన్నట్లు ఆరోపిస్తూ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

March 6, 2026 / 11:10 AM IST

‘ఇక్కడేమో ఖజానా లేదా.. కేరళలో ప్రచారమా?’

TG: రాష్ట్ర నిధులతో కేరళలో ప్రభుత్వం ఎన్నికల ప్రచారం చేయడంపై మాజీమంత్రి హరీష్ రావు మండిపడ్డారు. TGలో ఖజానా ఖాళీ అని దుష్ప్రచారం చేస్తూ, కేరళలో మాత్రం కోట్లతో డబ్బా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇక్కడ పథకాలు అమలు చేసే తెలివి లేదని, ప్రకటనల పేరిట ప్రజల ధనాన్ని వృధా చేస్తున్నారని ఆగ్రహించారు. రాష్ట్ర ఖజానాను పక్క రాష్ట్రాల రాజకీయాల కోసం వాడుతారా అని ప్రశ్నించారు.

March 6, 2026 / 11:08 AM IST

క్రికెట్ టోర్నీకి సీఎంకు ఆహ్వాన పత్రం అందచేత

NRPT: అంతర్జాతీయ మహిళా హాకీ సమరానికి భాగ్యనగరం వేదిక కానుంది. ఎఫ్ఎహెచ్ ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీ ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేన రెడ్డి అందజేశారు.

March 6, 2026 / 11:07 AM IST

‘విద్యాభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం’

SRD: ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల మౌలిక వసతుల కల్పనకు నిరంతరం దాతలు సహకరించడం అభినందనీయమని GHM మన్మధ కిషోర్ అన్నారు. శుక్రవారం ఖేడ్ ZPHSలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.10 వేల విలువగల ఇన్సులేటర్ పరికరాన్ని పాఠశాలకు అందించారు. ఈ ఏడాదిలో 900 మంది విద్యార్థులకు బ్యాగులు విద్యా సామాగ్రి, ఆంగ్ల నిఘంటువులు, క్రీడా సామాగ్రీ, క్రీడా దుస్తులు అందించారన్నారు.

March 6, 2026 / 11:06 AM IST