• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కేంద్రమంత్రికి రైతు సంఘాల విన్నపం

GNTR: మొక్కజొన్న క్వింటాకు రూ. 2400 మద్దతు ధర కల్పించాలని కోరుతూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు రైతు సంఘం నాయకులు ఇవాళ వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ. 1600 మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

March 6, 2026 / 09:45 AM IST

కర్నూలు నగర కూడళ్లలో హరిత పందిర్లు: కమిషనర్

KRNL: వేసవిలో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కర్నూలులోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పాయింట్ల వద్ద హరిత పందిర్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులకు శుక్రవారం సూచించారు. చెకోపోస్ట్ నుంచి చౌరస్తా ఉన్న అన్ని కూడళ్లలో, కేఎంసీ తాత్కాలిక కార్యాలయం వద్ద పార్కింగ్ పందిర్ల ఏర్పాటుకు టెండర్ పిలవాలని ఆదేశించారు.

March 6, 2026 / 09:44 AM IST

అక్రమ బాణసంచా స్వాధీనం

W.G. ఇరగవరం మండలం తూర్పు విప్పర్రులో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచాను ఎస్సై జానా సతీష్ గురువారం స్వాధీనం చేసుకున్నారు. నారాయణపురం గ్రామానికి చెందిన మామిడిశెట్టి శ్రీను తూర్పువిప్పర్రులో గోనెసంచుల ఫ్యాక్టరీలో బాణసంచా అక్రమంగా నిల్వ ఉంచినట్లు వచ్చిన సమాచారంతో ఈ దాడి చేశారు. సుమారు రూ.30,000 విలువ చేసే బాణా సంచాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

March 6, 2026 / 09:42 AM IST

నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల

KMR:నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం నాలుగో విడతలో భాగంగా శుక్రవారం 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.270 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాలువల పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు, పశుపాలకులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

March 6, 2026 / 09:41 AM IST

జిల్లాలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

శ్రీకాకుళం నగరపాలక సంస్థలో డయేరియా పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది. ఇవాళ ఉదయం 5.30 గంటల నుంచే పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్, ఇన్‌‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ పర్మాన్ అహమ్మద్ ఖాన్ పనులను పర్య వేక్షిస్తున్నారు. 50 డివిజన్ల పరిధిలో జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రిప్పర్లు అందుబాటులో ఉంచి చెత్తను డంపింగ్ యార్డ్‌కి తరలిస్తున్నారు.

March 6, 2026 / 09:38 AM IST

నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో CMRF వరం

MNCL: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో CMRF వరంలా నిలుస్తోందని మాజీ DCC అధ్యక్షురాలు సురేఖ అన్నారు. మంచిర్యాల 16వ డివిజన్ చెందిన మౌనిక చికిత్స నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.50 లక్షల పత్రాన్ని శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని పేర్కొన్నారు.

March 6, 2026 / 09:37 AM IST

‘సస్యరక్షణ చర్యలు చేపట్టాలి’

MNCL: రైతులు పంటలలో సస్య రక్షణ చర్యలు చేపట్టాలని జన్నారం మండలంలోని క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు పొలాల్లో వివిధ పంటలు చేశారని, ఆ పంటల్లో గడ్డి, కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయన్నారు. వాటి వల్ల పంటలకు నష్టం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పొలాల్లో పెరిగే గడ్డి, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలని ఆయన సూచించారు.

March 6, 2026 / 09:37 AM IST

SPMCLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్(SPMCL)లో 3 సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు. BE/BTechలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల 35 ఏళ్ల లోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి నెలకు రూ.50 వేల జీతం చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం వెట్‌సైట్: https://www.spmcil.com/en/discover-spmcil/

March 6, 2026 / 09:37 AM IST

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

NTR: ఉట్కూర్ మండలం అంబేడ్కర్ కళాభవన్‌లో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. పారా లీగల్ వాలంటీర్ ఎస్. అంజమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, 18 ఏళ్లు పూర్తయ్యాకే వివాహం చేయాలని తెలిపారు. బాల్య వివాహాలు లేని సమాజం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

March 6, 2026 / 09:37 AM IST

నేడు ప్రెస్‌క్లబ్‌లో మంద కృష్ణ మాదిగ ప్రెస్ మీట్

HYD: MRPS అధినేత మంద కృష్ణ మాదిగ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు MRPSనాయకులు తెలిపారు. ఇటీవలే రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎస్సీ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించాలని కోరగా కాంగ్రెస్ పార్టీ కేటాయించకపోవడం పట్ల ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.

March 6, 2026 / 09:37 AM IST

బొబ్బిలిలో నాకాబందీ.. వాహనాల తనిఖీ

VZM: బొబ్బిలి పట్టణంలోని సీఐ కె.నారాయణరావు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. బొబ్బిలి నుంచి రాకపోకలు చేసే వాహనాలను పరిశీలించారు. గంజాయి, మత్తు పదార్థాలు, మందుగుండు సామగ్రి రవాణా జరగకుండా నాకాబందీ నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. మత్తు పదార్థాలు, ఫైర్ క్రాకర్స్ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 6, 2026 / 09:34 AM IST

వైభవంగా ఆలయం పునః ప్రారంభం

AKP: ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని గురువారం వైభవంగా పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా హోమాలు, కలశ పూజలు చేశారు. ఇదే ప్రాంగణంలో మరిడిమాంబ ఆలయాన్ని కూడా ప్రారంభించారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పలువురు అమ్మవారులను దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వినోద్ రాజు పాల్గొన్నారు.

March 6, 2026 / 09:32 AM IST

ప్రొద్దుటూరు పట్టణ ఐద్వా కార్యవర్గం ఎన్నిక..!

KDP: పొద్దుటూరు పట్టణ ఐద్వా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా విజయకుమారి, ఉపాధ్యక్షులుగా సర్వేశ్వరీ, రాములమ్మ, వెంకటసుబ్బమ్మ, భానుమతి, ప్రధాన కార్యదర్శిగా గోకుల ప్రేమ, సహాయ కార్యదర్శులుగా లావణ్య, ఝాన్సీ, గుర్రమ్మ, జ్యోతి, సుదర్శనమ్మ, లక్ష్మీదేవి, పుష్పలత, కోశాధికారిగా పద్మ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

March 6, 2026 / 09:32 AM IST

భానుడి ప్రతాపంలో కావలి టాప్

నెల్లూరు జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోనే కావలిలో నిన్న అత్య ధికంగా 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. అమరావతి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు కంటే ఎక్కువ కాస్తుందని తెలిపారు. ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

March 6, 2026 / 09:31 AM IST

మోత్కూర్ బృందావని కాల్వకు మోక్షం ఎప్పుడో…?

BHNG: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని 1, 2 ,9 వార్డుల గుండా వెళ్లే బృందావన్ కాలువ దశాబ్ద కాలంగా మరమతులకు నోచుకోక అధ్వానంగా తయారయింది. తూములు, సైడ్ వాల్‌లు, దెబ్బతిని, కాల్వలో పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం రాకముందే ఈ వేసవిలో అధికారులు స్పందించాలన్నారు.

March 6, 2026 / 09:30 AM IST