BHNG: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని 1, 2 ,9 వార్డుల గుండా వెళ్లే బృందావన్ కాలువ దశాబ్ద కాలంగా మరమతులకు నోచుకోక అధ్వానంగా తయారయింది. తూములు, సైడ్ వాల్లు, దెబ్బతిని, కాల్వలో పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి చేరుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం రాకముందే ఈ వేసవిలో అధికారులు స్పందించాలన్నారు.