• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

స్వయంగా చెత్త తొలగించిన కలెక్టర్

ASF: ఆసిఫాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కలెక్టర్ హరిత స్వయంగా శ్రమదానం చేశారు. కార్యాలయ ఆవరణలో చెత్తను తొలగించి ఆదర్శంగా నిలిచారు. ఆమె మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, కార్యాలయాలను స్వచ్ఛంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చొరవను చూసి సిబ్బంది కూడా పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు.

March 6, 2026 / 02:02 PM IST

కొలికిపూడికి చెప్పాల్సింది చెప్పేశా: పల్లా

AP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి పార్టీని ధిక్కరిస్తే క్షమించేది లేదని హెచ్చరించారు. ‘కొలికిపూడికి చెప్పాల్సింది చెప్పేశా. పార్టీని ఇబ్బందిపెడితే ఊరుకునేది లేదు. ప్రజల్లో పార్టీని పలచన చేస్తే ఉపేక్షించేది లేదు’ అని పేర్కొన్నారు.

March 6, 2026 / 02:01 PM IST

నూతన రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

సత్యసాయి: హిందూపురంలోని ఆటో నగర్‌లో నూతన రోడ్లు, కాలువల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు డాక్టర్ సురేంద్ర, బాలాజీ పాల్గొని పనులు ప్రారంభించారు. ఈ పనులను రూ.2 కోట్ల వ్యయంతో చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

March 6, 2026 / 02:00 PM IST

అధికారుల సమన్వయంతో కొమ్మల జాతర విజయవంతం

WGL: కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన అధికారులకు మండల తహసిల్దార్ ఎండీ రియాజుద్దీన్ అభినందనలు తెలిపారు. గీసుకొండ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమన్వయంతో జాతర విజయవంతంగా ముగిసిందని తెలిపారు.

March 6, 2026 / 02:00 PM IST

సాగునీరు విడుదల చేయాలని రైతుల ఆందోళన

MHBD: బయ్యారం మండల కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద అన్నదాతలు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. పెద్ద చెరువు తూము ద్వారా వెంటనే ఆయకట్టు భూములకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా ధర్నా చేశారు. రైతాంగాన్ని ఇబ్బందుల గురి చేస్తున్న నీటిపారుదల శాఖ ఏఈ పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు

March 6, 2026 / 02:00 PM IST

మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి నిధులు మంజూరు

KMM: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.80 లక్షలు మంజూరు చేసినట్లు రెండో వార్డ్ కౌన్సిలర్ రమణ రాథోడ్ తెలిపారు. శుక్రవారం మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కౌన్సిలర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలో ఉన్న గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు.

March 6, 2026 / 02:00 PM IST

‘నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది’

BDK: జిల్లా కేంద్రంలో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసీ నాయకులు కుమార్ పాల్గొని మాట్లాడారు. మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా మొదటి ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు.

March 6, 2026 / 02:00 PM IST

కోటంచలో BJP నేతల ప్రత్యేక పూజలు

BHPL: రేగొండ మండలం కోడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం BJP రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి, BJP జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు, తదితరులు ఉన్నారు.

March 6, 2026 / 02:00 PM IST

‘రాజకీయాలను పోలీసులపై నెట్టడం మంచిది కాదు’

AP: పోలీసుల సంక్షేమంపై ఆలోచించింది కూటమి ప్రభుత్వమే అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జీతాలు కూడా సరిగా ఇవ్వలేదన్నారు. ఇవాళ నెలలో ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉందన్నారు. ‘రాజకీయ కక్షతో ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో చూశాం. రాజకీయాలను పోలీసులపై నెట్టడం మంచిది కాదు. కోర్టు కేసులు క్లియర్ చేసి రిక్రూట్‌మెంట్ చేపట్టాం’ అని తెలిపారు.

March 6, 2026 / 02:00 PM IST

గుత్తి KBN మసీదులో మూడవ జుమా ప్రార్ధనలు

ATP: రంజాన్ మాసం మూడవ జుమా సందర్భంగా గుత్తి కేబీఎన్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మసీదు ఇమామ్ హుస్సేన్ ఉపవాసం, దానధర్మాలు, ఆధ్యాత్మికతపై ప్రసంగించారు. ఈ పవిత్ర మాసంలో చేసే నమాజ్, సత్కారాలకు అధిక పుణ్యం లభిస్తుందని తెలిపారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నమాజ్ పూర్తిచేసి దువా చేశారు.

March 6, 2026 / 02:00 PM IST

ఏటూరునాగారంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ప్రారంభం

MLG: ఏటూరునాగారంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ.. రాబోయే వేసవికాలంలో ప్రజలకు మంచినీటి విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలోని ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

March 6, 2026 / 02:00 PM IST

ముగిసిన ఇరువురి మధ్య వివాదం

NTR: తిరువూరు MLA కొలికిపూడి శ్రీనివాసరావు అసెంబ్లీ లాబీలో రాష్ట్ర TDP అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి ఇటీవల జరిగిన పరిణామాలు, MP చిన్నీతో వివాదంపై వివరణ ఇచ్చుకున్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించిన పరిణామాలపై చింతిస్తున్నానని తెలిపారు. ఇకపై ఏ సమస్య వచ్చినా జోనల్ కోఆర్డినేటర్, పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానన్నారు.

March 6, 2026 / 01:55 PM IST

‘భారత్‌లో ఆ సినిమాలకే క్రేజ్’.. రానా

హీరోగా, నిర్మాతగా రానా తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు నిర్మించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపాడు. భారత్‌లో కుటుంబ కథా చిత్రాలకు (Family Entertainers) ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. వైవిధ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహిస్తూ, ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు తీయడమే తన ప్రాధాన్యత అని రానా వెల్లడించాడు.

March 6, 2026 / 01:55 PM IST

బాణాసంచా నిల్వ కేంద్రాలపై ఎస్పీ తనిఖీలు

ఏలూరు: జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శుక్రవారం జంగారెడ్డిగూడెంలోని హోల్‌ సేల్ బాణాసంచా దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యజమానులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. నిల్వ కేంద్రం వద్ద పని చేసే స్థితిలో ఉన్న ఫైర్ ఎక్స్‌టింగూషర్లు ఇసుక బకెట్లు, తగినంత నీటి నిల్వ ఉండాలని ఆదేశించారు. పరిమితికి మించి బాణా సంచాను నిల్వ చేయవద్దన్నారు.

March 6, 2026 / 01:52 PM IST

ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది: సీఎం

AP: వైసీపీకి ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. ‘ప్రజలు ఓట్లు వేస్తేనే అధికార, ప్రతిపక్ష హోదాలు వస్తాయి. గత ప్రభుత్వం కేంద్ర పథకాలకు సమాన గ్రాంట్లు ఇవ్వలేదు. దీంతో అనేక పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వలేకపోయింది’ అని చంద్రబాబు వెల్లడించారు.

March 6, 2026 / 01:50 PM IST