MDK: రేగోడ్ మండలం మక్తా వెంకటాపూర్ సర్పంచ్ సంగమేశ్వర్ ఆధ్వర్యంలో కొండాపూర్ నుంచి తిమ్మాపూర్ వరకు నూతన బాట నిర్మాణ పనులు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ కొత్త మార్గం అందుబాటులోకి రావడం వల్ల గ్రామాల మధ్య ఏకంగా 7 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీనివల్ల రైతులకు, గ్రామస్థులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు సమయం ఆదా అవుతుందని సర్పంచ్ తెలిపారు.
ప్రకాశం: గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదం గురించి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
KKD: గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు సేరికల్చర్ షెడ్ వెనుక పాడుబడిన షెడ్లో అక్రమంగా నిల్వ చేసిన దీపావళి పేలుడు సామాగ్రిని అధికారులు నిర్వీర్యం చేశారు. అక్రమంగా నిల్వ చేసిన మందుగుండు సామాగ్రిని పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రూ.89 వేల విలువ గల పేలుడు పదార్థాలను డంపింగ్ యార్డ్‌లో నిర్వీర్యం చేశారు.
NLR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు జిల్లా పార్లమెంటరీ టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. జోనల్ ఇంఛార్జ్ రాంభూపాల్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ సమక్షంలో ఈ భేటీ నిర్వహించారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి సమాన అవకాశాలు, మహిళలకు ప్రాధాన్యం, జిల్లా అనుబంధ సంఘాల బలోపేతానికి అందరు కృషి చేయాలని చర్చించారు.
NLR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు జిల్లా పార్లమెంటరీ టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు. జోనల్ ఇంఛార్జ్ రాంభూపాల్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ సమక్షంలో ఈ భేటీ నిర్వహించారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి సమాన అవకాశాలు, మహిళలకు ప్రాధాన్యం, జిల్లా అనుబంధ సంఘాల బలోపేతానికి అందరు కృషి చేయాలని చర్చించారు.
సత్యసాయి: కొత్తచెరువు మండల పరిధిలో తీవ్ర మనస్తాపంతో ప్రమాదకర స్థితిలో ఉన్న యువకుడిని పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు, వీడియో కాల్ ద్వారా యువకుడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. మాటలతో అతడిని ఒప్పించి సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
AP: గన్నవరం ఎయిర్‌పోర్టు పరిసరాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పలు విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. రన్‌వే క్లియరెన్స్ లేకపోవడంతో సేఫ్ డ్యాండింగ్‌కు ఇబ్బందులు తలెత్తాయి.
ఇంగ్లండ్‌తో సెమీస్‌లో వరుణ్ తన మార్క్ ప్రదర్శన చేయలేకపోగా.. ఏకంగా 64 రన్స్ సమర్పించుకున్నాడు. దీంతో T20 WC ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న భారత్ బౌలర్‌గా వరుణ్(64/1) నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ జోగిందర్ శర్మ(2007లో 57/0 vs ENG) పేరిట ఉండేది. ఓవరాల్‌గా USA బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్(65/0 vs IND) అగ్రస్థానంలో ఉన్నాడు.
ATP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే JC ప్రభాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ ఉమారెడ్డి దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేడు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నిర్వహణపై సమావేశంలో పాల్గొంటారు. జిల్లాకు చెందిన ఇతర మంత్రులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.
ఫిబ్రవరిలో దేశీయ కార్ల రిటైల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో 3,94,768 యూనిట్లకు చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది 26% వృద్ధి. ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లలో 34.21% పెరుగుదల కనిపించింది. టాప్ 5లో మారుతి సుజుకి(1,54,095) అగ్రస్థానంలో నిలవగా.. టాటా(56,447), మహీంద్రా(53,281), హ్యుందాయ్(45,615), టొయోటా(26,392) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే కస్టమర్లు SUVవీలకే ఎక్కువ మొగ్గు చూపారు.
ASF: జిల్లాలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ నిలిచిపోయింది. పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం కేటాయించిన డోంగల్ గడువు ముగిసింది. రెన్యువల్ చేయడంలో జాప్యం జరుగుతుండటంతో, మీసేవ కేంద్రాల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. నాన్-అవైలబిలిటీ సర్టిఫికెట్ల కోసం కూడా నిరీక్షణ తప్పడం లేదు. ఉన్నతాధికారులు సాంకేతిక సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరారు
AP: అసెంబ్లీ సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. కాసేపట్లో శాసనసభ ప్రారంభం కానుంది. సెజ్ నిర్వాసితులకు నష్టపరిహారం, ఆహార కల్తీ, గోదావరి జిల్లాల్లో పురాతన దేవాలయాల అభివృద్ధిపై చర్చించనున్నారు. అలాగే, మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 2026-27 బడ్జెట్‌కు, VAT సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది.
VKB: ధారూర్ మండల సర్వేయర్‌పై ఆవుసుపల్లి గ్రామానికి చెందిన అంజయ్య కలెక్టర్ దీపక్ తివారీకి ఫిర్యాదు చేశారు. తన భూమిని సర్వే చేయించడానికి సర్వేయర్‌కు డబ్బులు ఇచ్చేందుకు తన దగ్గర డబ్బులు లేవని కలెక్టర్ చొరవ తీసుకుని సర్వే చేయించాలని కోరారు. తహశీల్దార్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం దక్కలేదని అన్నారు. దీంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
ELR: నూజివీడు డాక్టర్ ఎం.ఆర్. అప్పారావు పీజీ సెంటర్లో శుక్రవారం దివిస్ లేబరేటరీస్ ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ నవీన లావణ్య లత తెలిపారు. ఎంఎస్సీ (కెమిస్ట్రీ), బి.ఫార్మసీ, బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది చక్కని అవకాశమని ఆమె పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.