TPT: తిరుమలలో రీల్స్ చేయడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. దీంతో వారిద్దరూ కలిసి తిరుపతి కోర్టుకు గురువారం వచ్చారు. రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి కోటేశ్వరరావు వాదనలు విన్నారు. మే 12వ తేదీన ఇద్దరు పూచీకత్తులతో పాటు జామీను పత్రాలను అందజేయాలని ఆదేశించారు.