అన్నమయ్య: రామసముద్రం మండలం వనగానపల్లిలో ఎస్.రాహుల్ (16) పదో తరగతి విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గురువారం రాత్రి తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: ఆదోని నియోజకవర్గం బసాపురం గ్రామంలో మేక వంకపై వంతెన నిర్మించాలని ఉపసభాపతి రఘురామకృష్ణరాజును ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. గురువారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అదనంగా సర్వే నంబర్లు 20, 21, 64, 47 లో నివాసం కలిగిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఉపసభాపతి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
WG: నరసాపురం పురపాలక సంఘం పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల ఫీజుల వసూలు హక్కుల కోసం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఆర్.రామిరెడ్డి గురువారం తెలిపారు. ఈ వేలం ప్రక్రియ శుక్రవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమవుతుందన్నారు. సదరు పాటదారులు అందరూ బహిరంగ వేలంలో పాల్గొనవలసిందిగా కమిషనర్ కోరారు.
AP: మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదప్‌పై టీడీపీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలతో శంకర్ యాదవ్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని అన్నారు. కార్యకర్తల దగ్గరే కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. ములకల చెరువు మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జయచంద్రారెడ్డి కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. అక్రమంగా తన పేరును FIRలో చేర్చారంటూ వీడియో విడుదల చేశారు.
SKLM: ఎచ్చెర్ల మండలం ఎం.కొత్తపేట–తోటపాలెం రహదారి పనులు గురువారం పూర్తవడంతో గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా ఈ రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే ఈశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన చొరవతో రహదారి నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. ప్రజలు MLA కు కృతజ్ఞతలు తెలిపారు.
MHBD: గార్ల మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన జంగాల వాణిని అదే గ్రామానికి చెందిన తెలగర్ల నవీన్ అనే యువకుడు తరచూ వెంటబడి వేధింపులకు గురి చేస్తున్నాడు. వేధింపులు భరించలేక గురువారం వివాహిత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నవీన్ పై వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సాయికుమార్ తెలిపారు.
క్లాసిక్ లెజెండ్స్ తన యెజ్డీ రోడ్‌స్టర్ మోడల్‌లో ‘రెడ్ వోల్ఫ్’ పేరుతో స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధర ₹2.10 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. ఈ కొత్త ఎడిషన్ ముదురు ఎరుపు రంగు (Deep Red) పెయింట్ ఫినిషింగ్, ఇంజిన్, ఎగ్జాస్ట్ పై క్రోమ్ డిటైలింగ్‌తో ఆకట్టుకుంటోంది. ఇది 334cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది.
NRML: ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి ‘ఇస్సీ సీజన్-13’ రేసింగ్ పోటీల్లో బాసర త్రిపుల్ ఐటీకి చెందిన ‘టీమ్ గరుడ’ ఆల్ ఇండియా స్థాయిలో 5వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. యాక్సిలరేషన్ విభాగంలో మొదటి స్థానాన్ని, డిజైన్ క్విజ్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వర్సిటీ అధికారులు శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు.
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివకళ్యాణం ఏర్పాట్లను, గురువారం రాత్రి ఆలయ జీవో రమాదేవి స్వయంగా స్కూటీ నడుపుతూ పరిశీలించారు. శివార్చన స్టేజ్ వద్ద కళ్యాణ వేదికను సిద్ధం చేశారు. కళ్యాణాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, భోజన వసతి, త్రాగునీరు, నీడ కోసం టెంట్లు, చలువ పందిళ్లు, పరిశీలించారు.
నెల్లూరు రంగనాయకులపేటలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా, తెప్ప పనితీరును పరిశీలించడం కోసం ఉదయం 10:30 గంటలకు పెన్నానది తీరంలోని తెప్పోత్సవ ఘాట్ వద్ద తెప్ప ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
సత్యసాయి: ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 15న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. హిందూపురంలోని సప్తగిరి డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగే ఈ మేళాలో 90కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. యువతీ యువకులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
KKD: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి సభ్యత్వ నమోదు ఎంతో కీలకమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గ నాయకులు, ‘సాధక్’లతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలపై జనసేన చేస్తున్న పోరాటాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
జీవితంలో అప్పు, అగ్ని, శత్రువు, వ్యాధి.. ఈ నాలుగింటిని సగం వదిలేయకూడదని, పూర్తిగా నిర్మూలించాలని విదురుడు హెచ్చరించాడు. వీటిలో ఏ కొద్ది భాగం మిగిలినా మళ్లీ విజృంభిస్తాయి. అప్పు వడ్డీతో పెరుగుతుంది, నిప్పు రాజుకుంటుంది, శత్రువు పగ తీర్చుకుంటాడు, వ్యాధి ప్రాణాలు తీస్తుంది. కాబట్టి ఈ నాలుగింటిని ఎప్పుడూ సమూలంగా నాశనం చేయాలని విదుర నీతి సారాంశం.
KNR: హుజరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒడితెల ప్రణవ్ బాబు చొరవతో కమలాపూర్‌లో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద స్థలాన్ని జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, ఇంజనీర్ ఎల్లేష్ పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు నివారించేందుకు ఆధునాతన మార్కెట్ యార్డు నిర్మించనున్నట్లు మార్కెట్ ఛైర్మన్ తౌటం జాన్సీ రాణి తెలిపారు.