NLG: చౌటుప్పల్ మండలంలో జరిగిన రెండు వేర్వేరు బైక్ చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వైన్ షాప్ ముందున్న స్లెండర్, ఇంటి ముందు పార్క్ చేసిన ఆక్టివా ఎలక్ట్రిక్ బైక్లను దొంగిలించిన నిందితులు బతుల మణి, తమ్మిశెట్టి పెద్దిరాజు, కందగట్ల కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు.
E.G: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ ఘటనలో మొత్తం 20 మంది అడ్మిట్ కాగా, ఇప్పటి వరకు మొత్తం 9 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. మిగిలిన 11 మంది బాధితులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అయితే, అందులో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
VKB: మత్తు పదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు ధారూర్ మండలంలో ఇవాళ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సీఐ రఘురాం పర్యవేక్షణలో ధారూర్, నాగసముందర్ సహా పలు గ్రామాల్లో ఈ సదస్సులు జరగనున్నాయి. యువత పెడదారి పట్టకుండా, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరుతూ భారీ ఎత్తున అవగాహన కల్పించనున్నారు.
JGL: పెగడపల్లి మండలంలో నేటి నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రేమ్ సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం, సంక్షేమం, విద్య, మహిళా సంక్షేమ వంటి అంశాలపై మండలంలో అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.
PDPL: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 100 రోజుల కార్యక్రమం అమలులో భాగంగా జిల్లాలో ఈ నెల 6 నుంచి ఆరోగ్య శాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్పెషలిస్ట్ ఆరోగ్య సేవలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. ఇవాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాఘవపూర్ నందు కార్యక్రమం ప్రారంభించబడుతుందని పేర్కొన్నారు.
SKLM: బెంతు ఒరియా కులస్థులకు న్యాయం చేయాలని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు కోరారు. గురువారం అమరావతిలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె.రఘు రామ కృష్ణం రాజును కలిసి వినతిపత్రం అందజేసి, బెంతు ఒరియాల సమస్యలను వివరించారు. వారు ప్రధానంగా ఏ కులంలో ఉన్నారో తెలియని దుస్థితి నెలకొందని, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా జీవిస్తున్నారని తెలిపారు.
ఇంగ్లండ్‌పై T20 WC సెమీస్ విజయంతో భారత్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముందుగా 253/7 స్కోర్ చేసిన సూర్యసేన అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. T20 ఫార్మాట్‌లో అత్యధికంగా 6 సార్లు 250+ స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. గతంలో ఈ రికార్డ్ IPL టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(5) పేరిట ఉండేది. విండీస్(3)-జింబాబ్వే(3) మూడో స్థానంలో ఉన్నాయి.
ADB: పోలీసు అక్క సమాచారంతో బాల్యవివాహాలను నిలిపివేయడం జరుగుతుందని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ గురువారం తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థినిలకు సైబర్ క్రైమ్, మహిళల వేధింపులపై పోలీసు అక్క ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలు ఎలాంటి అత్యవసర పరిస్థితిలోనైనా డయల్ 100 లేదా 8712659953 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.
బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్‌లో కొన్నిసార్లు హిట్ కొట్టాలనే ఆత్రుతతో పాత్రలను అంగీకరించి తప్పు చేశానని తెలిపింది. ఇకపై తనని అగౌరవపరిచే పాత్రలు చేయనని వెల్లడించింది. అలాగే, కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడినట్లు భూమి చెప్పుకొచ్చింది.
NRML: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేసిన ఫైజాన్ అహ్మద్ చేసిన సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు బదిలీపై వెళ్తున్న సందర్భంగా గురువారం రాత్రి కలెక్టరేట్‌లో ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల బలోపేతంఎన్నికల నిర్వహణలో ఆయన చేసిన సేవలను కలెక్టర్ కొనియాడారు.
NLR: ప్రయాణికుల సౌకర్యార్థం రాపూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన RO ప్లాంట్‌ను ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేశ్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ డిపోలలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ అభివృద్ధిపై దృష్టి సారించిందన్నారు.
SDPT: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య కీలక ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా వసతిగృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, వసతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
NZB: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల ప్రకారం.. ఎడపల్లి మండలం ఎమ్మెస్సీ ఫారానికి చెందిన పవన్ బైక్పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఎడపల్లి 108 ఈఎంటీ గంగామణి, పైలట్ అనిల్ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ నిట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మహమ్మద్ ఫారుక్ హష్మీ జపాన్‌లో ఈ నెల 17-19 తేదీల్లో జరిగే IVSP-26 అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. ఈ సదస్సులో ఆయన “ట్రాన్స్‌ఫార్మర్-ఆగ్మెంటెడ్ ఎఫిషియంట్నెట్ V2B3” సాంకేతికత ఆధారంగా మొక్కల వ్యాధులను గుర్తించే ఏఐ పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు.
NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను చిట్యాల మున్సిపాలిటీలో నేటి నుంచి ప్రారంభించనున్నారు. పాలకవర్గం ముందు రోజే వార్డుల్లో చేపట్టవలసిన పనులపై సమీక్ష జరిపారు. పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉ. 7:30 లకు 12వ వార్డులో ప్రారంభం కానుంది.