RR: ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపై మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నేడు సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు. ఉదయం 10 గంటలకు అజీజ్ నగర్లోని మున్సిపల్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో 99 రోజుల కార్యాచరణపై చర్చిస్తామన్నారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు హాజరుకావాలన్నారు.