కోనసీమ: అయినవిల్లి మండలం క్రాపలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోటిపల్లి రాజారావు (47) బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు దిగుడుబావిలో పడి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మృతునికి భార్య మాణిక్యం, కుమార్తె ఉన్నారు. అయినవిల్లి ఎస్సై కే జ్యోతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజారావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మునగ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మునగ కొందరు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. గర్భధారణ సమయంలో అసౌకర్యం, సమస్యలకు దారితీస్తుంది. అలాగే పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడే స్త్రీలు కూడా మునగ తినకుండా ఉండాలి. దీనిలోని వేడి లక్షణాలు రక్తస్రావాన్ని మరింత పెంచుతాయి.
గులాబీ నూనెకు యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువ. వేడినీటిలో కాస్త రోజ్ ఆయిల్‌ని వేసి ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడి చర్మం తేమగా మారుతుంది. వెన్న, బ్రౌన్ షుగర్, రోజ్ ఆయిల్ కలిపి శరీరానికి రాసుకుంటే ఇది సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. ఆలివ్, రోజ్ ఆయిల్ కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి.. కాసేపయ్యాక కడిగేస్తే సహజ తేమను పొందుతుంది.
నెలలు నిండే కొద్దీ గర్భిణులకు కాళ్ల వాపులు వస్తాయి. ఇవి తగ్గాలంటే ఎక్కువసేపు కూర్చోకుండా అటూఇటూ తిరగాలి. పాదాల కింద దిండు పెట్టుకొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువసేపు కూర్చొంటే కాళ్లను పైకి పెట్టుకోవాలి. వేడిగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. బరువు పెరగకుండా ఉండాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, తీపి తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మునగ ఆకులే కాకుండా, దాని తొక్కల్లో కూడా అనేక పోషకాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మునగ తొక్కలను శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని సూప్‌లు, పప్పులు వంటి వాటిలో కలపవచ్చు. ఇది ఆహారానికి అదనపు పోషకాలు అందిస్తుంది. మునగ తొక్కల పొడిని పెరుగు, తేనెతో కలిపి ముఖానికి పట్టించవచ్చు. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా చేసి, మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.
లవంగాలు తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడతాయి. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో అధికంగా ఉంటాయి. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం లభించడానికి లవంగం నమలడం మంచిది. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా ఇది చూస్తుంది. నోట్లో లవంగం ముక్క ఉంచుకొని మెల్లగా నమలడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
40 ఏళ్ల తర్వాత శరీరంలో అనేక మార్పులు రావడం మొదలవుతాయి. ఇవి క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. జీవక్రియ మందగించడం వల్ల బరువు పెరగడం సాధారణ సమస్యగా మారుతుంది. హార్మోన్ల మార్పులు శక్తి, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, రక్తపోటు, థైరాయిడ్, విటమిన్ల పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే గుండె సంబంధిత పరీక్షలు, ఇతర స్క్రీనింగ్‌లు కూడా చేయించాలి.
అధికంగా స్క్రీన్‌ను చూడటం వల్ల చిన్నారుల్లో ఏకాగ్రత లోపం, నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయని జైపూర్ SMS ఆసుపత్రి సైకాలజిస్టు డా.జైశ్రీ జైన్ అధ్యయనంలో వెల్లడైంది. 10-16 ఏళ్ల పిల్లల్లో 72% మంది రోజుకు 6-7 గంటలు ఫోన్ వాడుతున్నారని, దీనివల్ల 60% మందిలో ఏకాగ్రత తగ్గుతోందని తేలింది. అలాగే 48% మందిలో చికాకు, 41% మందిలో నిద్రలేమి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
టీ తాగడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. టీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల మీ కడుపు లోపలి భాగంలో ఒక నీటి పొర ఏర్పడుతుంది. ఇది టీలోని అధిక ఆమ్ల ప్రభావం నుంచి కడుపు గోడలను రక్షిస్తుంది. ఎసిడిటీ, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు దరిచేరవు. పళ్లపై మరకలు పడే అవకాశం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థను సిద్ధం చేసి, అల్సర్లను నివారిస్తుంది.
సాయంత్రం నడక వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజంతా ఉండే పని ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా మారుతుంది. రాత్రి భోజనానికి ముందు లేదా తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కేలరీలను కరిగించి శరీర బరువును అదుపులో ఉంచుతుంది. సాయంత్రం శారీరక శ్రమ వల్ల రాత్రి హాయిగా నిద్ర పడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
KKR, RR జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు ఆసక్తికరంగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన 32 మ్యాచ్‌ల్లో KKR 16 సార్లు గెలిచి స్వల్ప ఆధిక్యంలో ఉండగా, RR 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక ఇవాళ మ్యాచ్ జరగనున్న ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన 12 మ్యాచ్‌ల్లో KKR 6, RR 5 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
వేసవిలో శరీరానికి చలువనిచ్చి, శక్తినిచ్చే వెజిటబుల్ సలాడ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాబేజీ, క్యారెట్, దోసకాయ, క్యాప్సికం వంటి కూరగాయలతో చేసిన సలాడ్ ఆరోగ్యానికి మంచిది. ఇందులో విటమిన్ A, C, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు నియంత్రణ, హార్మోన్ల సమతుల్యతకు మేలు చేస్తుంది. ముక్కలపై నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు చల్లుకుంటే శరీరం రీఫ్రెష్ అవుతుంది.
సాధారణంగా చలికాలంలోనే చర్మం పొడిబారుతుందని మనం అనుకుంటాం. కానీ వేసవి ఎండలు కూడా చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. తీవ్రమైన వేడి వల్ల శరీరంలోని తేమ చెమట రూపంలో ఆవిరైపోయి చర్మం పొడిబారుతుంది. నిరంతరం ఏసీ గదుల్లో ఉండటం వల్ల కూడా చర్మం సహజ నూనెలను కోల్పోతుంది. కాబట్టి, వేసవిలో అధికంగా నీరు తాగుతూ.. మాయిశ్చరైజర్ వాడటం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.