* రోజంతా ఉత్సహంగా ఉండవచ్చు.* ఎదిగే పిల్లల మెదడు చురుగ్గా ఉంటుంది.* శరీర వేడిని తగ్గిస్తుంది.* శారీరక దృడత్వం వస్తుంది.* బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి.* రక్తస్రావం తగ్గుతుంది.* వీర్యకణాల వృద్ధి జరుగుతుంది.
ఊబకాయం చికిత్సలో UAE ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇంజెక్షన్ అవసరం లేకుండా, రోజుకు ఒక మాత్రతో బరువు తగ్గించే ‘ఫౌండాయో’ ఔషధానికి ఆమోదం తెలిపింది. ఎలీ లిల్లీ రూపొందించిన ఈ మాత్రతో 15% బరువు తగ్గొచ్చని తేలింది. అమెరికా అనుమతి పొందిన ఈ మందు మే 2026 నుంచి లభిస్తుంది. బీఎంఐ (BMI) 30 పైన ఉన్నవారు వైద్యుల పర్యవేక్షణలోనే దీనిని వాడాలి.
రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. రోజంతా మనం తినే ఆహార పదార్థాలు దంతాలపై పేరుకుపోయి బ్యాక్టీరియాకు నిలయంగా మారతాయి. బ్రష్ చేయకపోతే అవి ఆమ్లాలను విడుదల చేసి దంత క్షయం, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసనకు దారి తీస్తాయి. కాబట్టి, పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి పూట బ్రష్ చేయడం మంచిది.
గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటిస్తే బెటర్. వాము/జీలకర్రను గోరువెచ్చని నీటిలో వీటిని కలిపి తాగితే గ్యాస్ త్వరగా తగ్గుతుంది. అల్లం ముక్కను నమలడం లేదా అల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో అసౌకర్యానికి పుదీనా నీరు మంచిది. తిన్న తర్వాత కాసేపు నడవడం, తగినంత నీరు తాగడం, ఉప్పు తగ్గించడం మేలు.
మెడపై నలుపును తగ్గించుకోవడానికి పలు సహజ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసం సహజమైన బ్లీచింగ్‌లా పనిచేస్తుంది. దీనిని మెడకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడగాలి, లేదా ఆలుగడ్డ రసాన్ని క్రమం తప్పకుండా రాస్తుంటే చర్మం ఛాయ మెరుగుపడుతుంది. శనగపిండిని పెరుగు లేదా పాలతో కలిపి ప్యాక్‌లా వేయాలి. కలబంద గుజ్జు చర్మాన్ని హైడ్రేట్ చేసి నలుపును తగ్గిస్తుంది.
మహిళల్లో హార్మోన్ల సమతుల్యతకు, PCOD సమస్యలు తగ్గడానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మం, జుట్టు సౌందర్యాన్ని పెంచడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలనూ తొలగిస్తుంది. జ్యూస్ లేదా పొడి రూపంలో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డయాబెటిస్ నియంత్రణకు కూడా ఇది తోడ్పడుతుంది. అందుకే ప్రతిరోజూ ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
రోజూ ఎక్కువ సమయం నిద్రపోతున్నా ఉదయాన్నే నీరసం, చిరాకుగా ఉంటే అది నిద్రలేమి సమస్యే. నాణ్యమైన నిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి తగ్గి, ఏకాగ్రత దెబ్బతింటుంది. ముఖ్యంగా ‘స్లీప్ అప్నియా’ వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. మెరుగైన నిద్ర కోసం చేపలు, గుమ్మడి గింజలు, బాదం లేదా రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తీసుకోవాలని పేర్కొంటున్నాయి.
వెల్లుల్లిలోని అల్లిసిన్ BPని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఇమ్యూనిటీని పెంచి చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలోనూ ఇది కీలకం. అయితే వెల్లుల్లిని వండినప్పుడు పోషకాలు తగ్గుతాయి. కాబట్టి పచ్చిగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనాలు అందుతాయని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని రోజూ వాడితే క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచీ రక్షణ పొందవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా యువత ఏ వయసులో వర్జినిటీ కోల్పోతున్నారనే దానిపై ఓ సంస్థ సర్వే చేసింది. ఇందులో అత్యల్పంగా ఐస్‌లాండ్‌లో 15.6 సంవత్సరాలకే వర్జినిటీ కోల్పోతున్నారని తెలిపింది. అమెరికాలో 18 ఏళ్లకు, ఇటలీలో 19 ఏళ్లకు, చైనాలో 22 ఏళ్లకు వర్జినిటీ కోల్పోతుండగా.. ఇండియాలో 23 ఏళ్లకు సగటున యువత వర్జినిటీ కోల్పోతున్నారని వెల్లడించింది.
మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కాలచక్రంలో కష్టసుఖాలు సహజం. అన్నీ అనుకూలంగా ఉన్న సమయంలో గర్వానికి పోకుండా సంతోషంగా గడపాలి. అదే సమయంలో జీవితంలో వచ్చే కష్టాలు ఎంతో కాలం ఉండవని గ్రహించి ధైర్యంగా ముందుకు పోవాలి. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయనే ఆశావాద దృక్పథంతో ముందుకు సాగడమే నిజమైన జీవన పరమార్థం.
కడుపు ఉబ్బరం తగ్గాలంటే ఆహారాన్ని తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవాలి. ఉప్పు, కూల్ డ్రింక్స్ తగ్గించి, తగినంతగా నీళ్లు తాగాలి. అయితే స్ట్రాతో జ్యూస్ తాగితే గాలి కడుపులోకి చేరి ఉబ్బరం పెరుగుతుంది, కాబట్టి గ్లాసుతో నేరుగా తాగడం మేలు. పాస్తా, వైట్ బ్రెడ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ చిన్న మార్పులతో జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు తేలికగా మారుతుంది.
వేసవిలో నేరేడు పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది. షుగర్ ఉన్నవారికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఎండల వల్ల శరీరంలో పెరిగే వేడిని తగ్గించి, చల్లబరుస్తుంది. వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది, కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తాన్ని శుద్ధి చేయడానికి, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
భేకాసనం యోగాసనాలలో చాలా ముఖ్యమైనది. ఇది వెన్నెముక, ఛాతీ, పొత్తికడుపు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం ఛాతీని విస్తరింపజేసి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ రుగ్మతలతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని విషపదార్థాలను హరించివేస్తుంది. వెన్నునొప్పి, భుజం, మోకాలి గాయాలు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో ఈ ఆసనం వేయాలి.
శరీర భాగాలు ఆరోగ్యం కొరకు ఉత్తమమైన ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీర కండరాల ఆరోగ్యం కొరకు అరటిపండు, బ్లూబెర్రీస్, గ్రీన్ టీ, చేపలు, గుడ్లు, సాల్మన్ తీసుకోవాలి. జట్టు పెరుగుదల కోసం గుడ్డు, మొక్కజొన్న, క్యారెట్లు తినాలి. కంటి ఆరోగ్యం కోసం ఆకుపచ్చ కూరగాయాలు, బీన్స్, సాల్మన్.. ఎముకల ఆరోగ్యం కొరకు నారింజ, పాలు ఉపయోగపడతాయి.
సపోటాలో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఎముకల దృడత్వానికి, కంటి చూపునకు ఎంతో మేలు చేస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఇవి తోడ్పడతాయి. అయితే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, డయాబెటిస్ బాధితులు వీటిని మితంగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.