హెర్బల్ టీని 30 రోజుల పాటు తాగితే నిద్ర నాణ్యత మెరుగవుతుంది. రాత్రి మధ్యలో మేల్కొనే సందర్భాలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ సులభంగా మారుతుంది. పుదీనా, అల్లం వంటి హెర్బల్ టీలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి పొట్టలో వాయువు, ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి. ఒత్తిడి నియంత్రణ మెరుగుపడుతుంది. మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది.
వేసవిలో చెమట, జిడ్డు ఉన్నా చర్మానికి మాయిశ్చరైజర్ తప్పనిసరి. ఎండ, ఏసీ వల్ల చర్మం కోల్పోయే తేమను ఇది తిరిగి అందిస్తుంది. ఈ కాలంలో మందపాటి క్రీములకు బదులు హైలురోనిక్ యాసిడ్, కలబంద వంటివి ఉన్న తేలికపాటి జెల్ లేదా వాటర్-బేస్డ్ ఉత్పత్తులు వాడాలి. ఇవి చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా ముఖాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
రుచి కోసం ఉపయోగించే చింత పండుతోనే కాదు, దాని గింజలతోనూ ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గింజలను నిపుణులు పోషకాల గనిగా చెబుతున్నారు. వీటిలో ప్రొటీన్లు, విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తాయి. అలాగే జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, దంత సంరక్షణను మెరుగుపరుస్తాయి. ఇంకా షుగర్ నియంత్రణకు మేలు చేస్తాయి.
కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలో ఆహార భద్రత సంస్థ FSSAI వెల్లడించింది. ఒక గాజు సీసా లేదా టెస్ట్ ట్యూబ్‌లో కరిగించిన నెయ్యి తీసుకుని దానికి కొంచెం చక్కెర, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపి బాగా షేక్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత ఆ మిశ్రమం ఎరుపు రంగులోకి మారితే అందులో వనస్పతి కలిపినట్లు భావించాలి. అలా కాకుండా ఆ మిశ్రమం ముదురు గోధుమ రంగులో ఉంటే స్వచ్ఛమైనదని అర్థం.
TG: హైదరాబాద్ సనతనగర్ ESIC మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ 2019 నుంచి 2025 మధ్య కాలంలో నిర్వహించిన ప్రత్యేక అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యయనంలో పాల్గొన్న రోగులలో చాలా మందికి చనుమొన వెనుక గడ్డలు, చర్మం మొద్దుబారటం, చనుమొన లోపలికి కుంచించుకుపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. ఇలాంటి లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఉదయాన్నే 1-2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. రాత్రంతా నానబెట్టిన జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండి, బరువు తగ్గడానికి దోహదపడుతుంది. రాత్రి నానబెట్టిన శనగల నీటిని తాగడం, శనగలను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. రక్త శుద్ధి జరుగుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చే 9 చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకతితో సమయం గడపడం, వ్యాయామం చేయడం, డీప్ బ్రీత్ తీసుకోవడం, నచ్చిన వారితో సమయం గడపటం, రోజులో కనీసం గంటపాటు ఫోన్‌కు దూరంగా ఉండటం, క్రియేటివ్ వర్క్ చేయడం, జీవితం మీకు లభించిన వాటిపై కృతజ్ఞత చూపించడం, ప్రశాంతంగా నిద్రపోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
వాటర్ ఫాస్టింగ్ అనేది 24 నుంచి 72 గంటల పాటు ఎలాంటి ఆహారం లేదా కాలరీల పానీయాలు తీసుకోకుండా కేవలం నీటినే తీసుకునే పద్ధతి. ఇటీవల కాలంలో ఇది ఒక ప్రముఖ ఆరోగ్య ట్రెండ్‌గా మారింది. బరువు తగ్గడం, మెటబాలిజం మెరుగుపరచడం కోసం చాలా మంది ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది.
వేసవి తాపం నుంచి విముక్తినిచ్చే చలవ చేసే పానియమే ఈ మారేడు పానకం. దీన్ని ఒడిశా ప్రజలు తమ సంవత్సరాది రోజున చేసుకుని తింటారు. పండిన మారేడు పండు లోపలి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకుని.. తగినన్ని నీళ్లు పోసి, చేతితో బాగా పిసికి 15-20min నానబెట్టాలి. పిసికిన మిశ్రమాన్ని వడపోయాలి. ఈ రసంలో రుచికి సరిపడా బెల్లం తురుము లేదా పంచదార వేసి కరిగే వరకు కలుపుకుని సర్వ్ చేసుకోవచ్చు.
చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనానికి ముందు చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత, బాత్రూంకి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు కడగాలి. నిత్యం తాకే కీబోర్డు, మౌస్, డోర్ హ్యాండిల్స్ వంటి వస్తువులపై కంటికి కనిపించని ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి. కేవలం చేతులు కడగడం ద్వారా 50% వరకు అంటువ్యాధులను అడ్డుకోవచ్చు.
ఏకపాద శీర్షాసనం అనేది యోగాలో కష్టతరమైన, అధునాతనమైన భంగిమ. ఇది తలకిందులుగా ఉంటూ, ఒక కాలును తల వెనుకకు ఉంచే ఆసనం. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది భుజాలు, చేతులు, మెడ, వెన్నెముక కండరాలను బలపరుస్తుంది. పొత్తికడుపుపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. ముఖానికి రక్తప్రసరణ పెరగడం వల్ల ముఖం మీద కాంతి పెరుగుతుంది.
ప్రతి భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్‌గా కనిపిస్తుంది. అయితే రోజూ పొద్దున్నే కరివేపాకు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తం శుద్ది, జుట్టు ఆరోగ్యం, చెడు కొలెస్ట్రాల్, రోగనిరోధక వ్యవస్థ, బరువు తగ్గడం, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి కరివేపాకు ఉపయోగపడుతుంది.
కోసి ఉంచిన పండ్లను తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పండ్లను కోసిన వెంటనే గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి వాటిలోని కీలక పోషకాలు నశిస్తాయి. అంతేకాకుండా, ఎక్కువ సేపు బయట ఉంచిన ముక్కలపై బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ ముందే కోసి పెట్టుకోవాలనుకుంటే, వాటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి భద్రపరచుకోవడం ఉత్తమం.
కేక్ అతిగా తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదముంది. కేక్‌లో ఉండే మైదా, చక్కెరతో పాటు అదనపు క్రీమ్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని అతిగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట కేక్ తినడం తగ్గించాలి. పార్టీల్లో అప్పుడప్పుడు తిన్నా.. మితంగా తింటేనే ఆరోగ్యానికి మేలు.
వేసవి ఎండల నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి ఐస్ క్యూబ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. సాధారణ నీటికి బదులు పచ్చిపాలను ఐస్ క్యూబ్స్‌గా మార్చి చర్మంపై రుద్దితే చల్లదనంతో పాటు తేమ అంది చర్మం తాజాగా మారుతుంది. అలాగే ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ మిశ్రమంతో చేసిన క్యూబ్స్ వాడితే ఎండ వల్ల కలిగే ట్యాన్ తగ్గి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. రాత్రి పడుకునే ముందు వీటిని వాడటం మంచిది.