• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

వడదెబ్బ తగిలితే ఇలా చేయండి!

వేసవిలో వడదెబ్బ తగిలినప్పుడు చర్మం ఉపరితలానికి సమీపంలో రక్తం ప్రసరించే చోట్ల.. అంటే మెడ మీద.. చంకలు, గజ్జల్లో.. మణికట్టు లోపలి భాగం వద్ద తడి బట్ట లేదా ఐస్‌ ప్యాక్‌ పెట్టటం మంచిది. ఇది ప్రసరిస్తున్న రక్తాన్ని నేరుగా చల్లబరుస్తుంది. మూల ఉష్ణోగ్రత బాగా తగ్గుతుంది. తడి తువ్వాలును పెట్టి, ఫ్యాన్‌ వేస్తే ఇంకా మంచిది.

May 22, 2026 / 04:25 PM IST

రుకో పథకం గురించి తెలుసా?

చిన్న చిన్న హోటళ్లు నడిపేవారు కాగిన నూనెను పారబోయటానికి ఇష్టపడరు. మళ్లీ మళ్లీ దాన్నే ఉపయోగిస్తారు. ఇలాంటివారి కోసం FSSAI, కేంద్ర ప్రభుత్వం రుకో (రీపర్పస్‌ యూజ్డ్‌ కుకింగ్‌ ఆయిల్‌) అనే పథకాన్ని తీసుకొచ్చింది. వాడిన నూనెను ఏజెంట్ల ద్వారా సురక్షితంగా సేకరించి, దాన్ని బయోడీజిల్‌గా మార్చటం దీని ఉద్దేశం. ఇలా సేకరించే నూనెకు కొంత డబ్బు కూడా చెల్లిస్తారు.

May 22, 2026 / 04:19 PM IST

కొవ్వు మనిషికి వ్యసనమే!

కొవ్వు మనిషిని, మనసును లొంగదీసుకుంటుంది! ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. కొవ్వుతో వంటకాల రుచి పెరుగుతుంది. పదార్థాలను మృదువుగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేయటం ద్వారా నోరూరేలా చేస్తుంది. వేపుళ్ల వంటి పదార్థాలను ఎక్కువగా, మాటిమాటికి తినటానికి ఇదీ ఒక కారణమే. అందుకే దీన్ని ఒకరకంగా వ్యసనమనీ చెప్పుకోవచ్చు.

May 22, 2026 / 04:06 PM IST

వాడిన నూనె మళ్లీ వాడుతున్నారా..?

మన దగ్గర పిండి వంటల వంటివి చేసినప్పుడు మిగిలిన నూనెను తిరిగి వాడుకోవటం తరచూ చూసేదే. రెండోసారి అంటే ఏమో గానీ మళ్లీ మళ్లీ వేడి చేసి, వంటలకు ఉపయోగించకూడదు. ఇలా తిరిగి కాచినప్పుడు ట్రాన్స్‌ఫ్యాట్స్‌ పుట్టుకొస్తాయి. అంతేకాదు, కొన్ని క్యాన్సర్‌ కారకాలూ వెలువడతాయి. ఇలాంటి నూనెతో చేసిన పదార్థాలను అదేపనిగా తినటం వల్ల కొందరికి జీర్ణకోశ క్యాన్సర్లు తలెత్తే ప్రమాదముంది.

May 22, 2026 / 03:59 PM IST

అడవి ద్రాక్ష పండ్లతో ఇన్ని లాభాలా..?

అడవి ద్రాక్ష పండ్లను తినడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. వీటి నుంచి ఎర్రరంగును తయారు చేస్తారు. ఈ రంగుకు మార్కెట్‌లో గిరాకీ ఉంది. ఈ గింజల నుంచి పలుకులను వేరు చేసి తింటారు. ఈ పలుకులు మొర్లి పలుకులను పోలి ఉంటాయి. ముఖ్యంగా విరేచనాలు, బొల్లి, పంటి సమస్యలు, కడుపు నొప్పి, వీక్‌ నెస్‌ తదితర సమస్యల నుంచి ఉపశమనం కోసం వాడుతారు.

May 22, 2026 / 02:59 PM IST

గర్భిణుల ఆరోగ్యంపై వేసవి ఉష్ణోగ్రతల ప్రభావం

తీవ్రమైన ఎండల వల్ల గర్భిణులకు డీహైడ్రేషన్, వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణ సమయంలో ఉండే హార్మోన్ల మార్పుల వల్ల వీరు ఉష్ణోగ్రతలను తట్టుకోలేరు. అందుకే నిరంతరం నీళ్లు, పండ్ల రసాలు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. కాటన్ దుస్తులు ధరిస్తూ, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

May 22, 2026 / 11:07 AM IST

వెన్నునొప్పి తగ్గించే అద్భుత ఆసనం ఇదే!

సేతు బంధాసనం వెన్నెముక వీపు కండరాలను బలపరుస్తూ వెన్నునొప్పిని తగ్గిస్తుంది. మెదడుకు రక్తప్రసరణ పెంచి ఒత్తిడిని దూరం చేస్తుంది. పొట్ట, తొడలు, పిరుదులు, చీలమండల కండరాలను బలోపేతం చేసి శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. ఉదర అవయవాలు ఊపిరితిత్తులు, థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపిస్తుంది. వెన్ను లేదా మెడకు తీవ్రమైన గాయాలు ఉన్నవారు ఈ ఆసనాన్ని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.

May 22, 2026 / 08:06 AM IST

జెన్-G అంటే ఎవరు?

కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చినప్పటి నుంచి జెన్-జీ పదం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జెన్-జీ అని పిలుస్తారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పుట్టిన మొదటి తరం వీరు. అందుకే వీరికి టెక్నాలజీపై పట్టు ఎక్కువ. రీల్స్, యూట్యూబ్, షార్ట్ వీడియోల ద్వారా తమ ప్రతిభను చాటుకోవడంలో ముందుంటారు.

May 21, 2026 / 08:01 PM IST

INTERNATIONAL TEA DAY: చాయ్‌ తాగారా..?

2005లో ప్రారంభమైన అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నారు. ఇక చాయ్ విషయానికి వస్తే.. బంధాలను, అనుబంధాలను దగ్గర చేసేది. మౌనాన్ని మాట్లాడించే తీయని అనుభూతి. బాధల్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా, అలసిపోయినా.. మనసుకు తక్షణమే ప్రశాంతతను ఇచ్చే అమృతం. ఎంతమంది స్నేహితులు ఉన్నా.. ఒంటరిగా ఉన్నప్పుడు వేడి వేడి చాయ్ ఇచ్చే తోడు, హాయి మరేదీ ఇవ్వలేదు. మరి మీరు చాయ్ తాగారా?

May 21, 2026 / 04:24 PM IST

బరువు తగ్గాలంటే భోజనం మానేయొద్దు!

చాలామంది బరువు తగ్గాలని మొదట భోజనం మానేయడం లేదా ఆకలిని చంపుకోవడం చేస్తారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. నిజానికి ఆకలి వేస్తుందంటే మీ జీర్ణక్రియ చురుగ్గా ఉందని అర్థం. కడుపు ఖాళీగా ఉంచి ఆకలిని నియంత్రించడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. దీనివల్ల భవిష్యత్‌లో షుగర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మన ఇంజిన్‌కు ఇంధనం ఎలాగో.. శరీరానికి ఆహారం అలా అవసరం.

May 21, 2026 / 01:56 PM IST

జ్ఞాపక శక్తిని పెంచే చిట్కాలు ఇవే..!

కొన్ని చిట్కాలతో జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర మెదడుకు చాలా అవసరం. బాదం, వాల్‌నట్స్, ఆకుకూరలు, ఓమెగా-3 ఫుడ్స్ మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. పజిల్స్ పూరించడం, చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత, రక్తం సరఫరా మెరుగవుతాయి. ప్రశాంతంగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి దెబ్బతినకుండా ఉంటుంది.

May 21, 2026 / 01:31 PM IST

చలువ చేసే కులిత్‌ కలాన్‌..!

వేసవిలో చలవచేసే గోవా, మహారాష్ట్ర స్పెషల్ డ్రింక్ కులిత్ కలాన్. రాత్రంతా నానబెట్టి ఉడికించిన ఉలవల నీటిని, మజ్జిగతో కలిపి.. నెయ్యి, జీలకర్ర, ఇంగువతో పోపు వేసి దీన్ని తయారుచేస్తారు. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. దీనిలోని ప్రొబయాటిక్స్ కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ఐరన్, ప్రొటీన్ల వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమం.

May 21, 2026 / 11:30 AM IST

పిల్లల్లో ఎముకల దృఢత్వం కోసం ఇలా చేయండి

* ఇనుప కడాయిలో వేయించిన నువ్వులను రోజూ 1 టీ స్పూన్ తినడం పిల్లలకు అలవాటు చేయండి* వారానికి 3 నువ్వుల లడ్డులు అయినా తినేలా చూడండి* మునగాకు రసాన్ని పాలతో చేర్చి తాగించండి* పిల్లల రెగ్యులర్ డైట్‌లో తాటి బెల్లం ఉండేలా చూసుకోండి* వారానికి 2 లేదా 3 సార్లు తోటకూర, మునగాకు లేదా ఏదైనా ఆకుకూరను అందించండి

May 21, 2026 / 09:28 AM IST

ఒక రోజులో చక్కెర ఎంత తినాలంటే?

ఒక రోజులో మహిళలు 25 గ్రాములు, పురుషులు 36 గ్రాములకు మించి చక్కెర తీసుకోరాదని అమెరికా హార్ట్ అసోసియేషన్ సూచించింది. ఈ నేపథ్యంలో రోజువారీ మీరు తీసుకునే చక్కెరను లెక్కేసుకోండి. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలను తినేటప్పుడు దాని లేబుల్‌పై ప్రచురించే చక్కెర శాతాన్ని తప్పక గమనించి తీసుకుంటే మంచిది.

May 21, 2026 / 08:57 AM IST

ఉదయం అల్పాహారం తీసుకోకపోతే?

ఉదయం అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) మానేయడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందక నీరసం, అలసట, ఏకాగ్రత లోపిస్తుంది. దీంతో జీవక్రియ మందగిస్తుంది. కడుపులో యాసిడ్స్ ఎక్కువై ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆకలిని తట్టుకోలేక మధ్యాహ్నం ఎక్కువ మొత్తంలో తినడం, లేదా జంక్ ఫుడ్స్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

May 21, 2026 / 07:56 AM IST