• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

ఉదయాన్నే కీరదోస తింటే ఏమవుతుంది?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కీరదోస తీసుకుంటే శరీరానికి బోలెడంత నీటి శాతం అందుతుంది. శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. రోజంతా తాజాగా ఉండేలా చేస్తుంది. పీచుపదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఉదయాన్నే తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అయితే, కీరదోసను ఉదయాన్నే సలాడ్ రూపంలో లేదా జ్యూస్ లాగా తీసుకోవచ్చు.

May 26, 2026 / 08:04 AM IST

లోలాసనం వల్ల కలిగే ఉపయోగాలు

లోలాసనం (లాకెట్టు భంగిమ) ఒక అధునాతన యోగాసనం. ఈ భంగిమలో శరీరాన్ని చేతులపై బ్యాలెన్స్ చేసి, లాకెట్టు వలె ఊగవలసి ఉంటుంది. చేతులు, భుజాలు, ముంజేతులు, మణికట్టు బలపడతాయి. పొత్తికడుపు, వెన్నెముక కండరాలకు అద్భుతమైన వ్యాయామం. శరీరం దృఢంగా తయారవుతుంది. పొట్టలోని కొవ్వు కరిగి, ఉదర కండరాలు టోన్ అవుతాయి. ఉదర భాగంపై పడే ఒత్తిడి వల్ల జీర్ణశయావయవాలు ఉత్తేజితమై, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

May 26, 2026 / 07:32 AM IST

మార్నింగ్ ఈ పని చేయండి

ఉదయాన్నే ఒక గ్లాసు నీరు తాగడం వల్ల బరువు సులభంగా తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది జీవక్రియను పెంచి, శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగై, ఆందోళన తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది. మరింత మెరుగైన ఫలితాల కోసం వేడి నీటిలో చియా సీడ్స్, అజ్వైన్ లేదా నిమ్మరసం కలిపి తీసుకోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు.

May 26, 2026 / 06:39 AM IST

ALERT: శృంగారం చేస్తున్నారా..?

చిన్న వయసులోనే లైంగిక జీవితాన్ని ప్రారంభించే వారికి భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తక్కువ వయసులో శారీరక సంబంధం కలిగిన వారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపించే ఛాన్స్ ఉందని తేలింది. మానసిక ఒత్తిడి, ADHD, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదముందని పరిశోధకులు తెలిపారు. దీనివల్ల జీవితకాలం కూడా తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

May 25, 2026 / 09:26 PM IST

ALERT: ఇంకా పెళ్లి చేసుకోలేదా..?

ప్రస్తుత కాలంలో లేట్ మ్యారేజ్ ట్రెండ్‌ నడుస్తోంది. యువత ఎవరిని అడిగినా.. మేం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటామని అంటుంటారు. అయితే మానసిక పరిణతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ బాధ్యతలను మోయగల సామర్థ్యాన్ని బట్టి 25-32 ఏళ్ల వయసు పెళ్లికి అనుకూలమైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే మానసికంగా ఒత్తిడికి గురై.. దాంపత్య జీవితంపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.

May 25, 2026 / 07:28 PM IST

చూయింగ్ గమ్‌తో ముఖం అందంగా మారుతుందా?

చాలా మంది చూయింగ్ గమ్ తినడం వల్ల ఫేస్ కట్ అందంగా మారుతుందని అపోహపడుతుంటారు. కానీ అతిగా నమలడం వల్ల దవడ కండరాలు విపరీతంగా గట్టిపడి, వాపునకు గురవుతాయి. దీనివల్ల ముఖం సన్నగా మారాల్సింది పోయి.. మరింత వెడల్పుగా కనిపిస్తుంది.చక్కెర ఉన్న చూయింగ్ గమ్ నమలడం వల్ల దంత క్షయం, పళ్లపై పాచి పేరుకుపోవడం, పిప్ప పళ్లు రావడం సర్వసాధారణం. అయితే షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ వాడినా ముప్పే.

May 25, 2026 / 06:52 PM IST

రోహిణి కార్తె విశిష్టత ఏమిటి?

తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించినప్పటి నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే వరకు ఉండే కాలాన్ని రోహిణి కార్తెగా పిలుస్తారు. సాధారణంగా ఇది 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు భూమిపై నిటారుగా పడటంతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయి. అందుకే ఈ కాలంలో వడగాలులు, ఉక్కపోత తీవ్రంగా ఉంటాయి. ఈ కాలన్ని వ్యవసాయ పనులకు రైతులు అనుకూలంగా భావిస్తారు.

May 25, 2026 / 06:22 PM IST

రోజూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..?

రోజూ కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సరదాగా స్నేహితులతో కలిసినప్పుడు, ఎండ వేడిని తట్టుకోలేక, ఎదైన పని చేసి అలసిపోయినప్పుడు ఇలా రకరకాల కారణాలతో డ్రింక్స్ తాగుతుంటారు. కానీ, దీంతో లివ‌ర్ దెబ్బతినడంతో పాటు, షుగర్, గుండె జ‌బ్బులు వ‌చ్చే ఛాన్స్ ఉందట. సాఫ్ట్ డ్రింక్, డైట్ సోడా కూడా డేంజర్ అంటున్నారు.

May 25, 2026 / 04:26 PM IST

ఇలా చేశారంటే వేసవి వేడికి చెక్..!

వేసవిలో తీవ్రమైన సూర్యరశ్మి వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా బాడీలో వేడి ఎక్కువైపోతుంది. అందుకే శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, కీరదోసకాయ, కర్బూజా వంటి పండ్ల రసాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. అలాగే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో ఉండే విటమిన్-C ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది.

May 25, 2026 / 03:22 PM IST

మెదడు సరిగా పనిచేయాలంటే?

మెదడు సరిగా పనిచేయడానికి శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడం ఎంతో అవసరం. నిరంతర నడక, గాఢ నిద్ర, స్థిరమైన గ్లూకోజ్ స్థాయిలు, క్రమం తప్పని వ్యాయామం ఈ జీవక్రియలను మెరుగుపరుస్తాయి. శారీరక ఆరోగ్యం ఎంత బాగుంటే, మీ జ్ఞాపకశక్తి, ఆలోచనా విధానం అంత చురుకుగా ఉంటాయి. కాబట్టి మెదడు ఆరోగ్యం కోసం శారీరక శ్రమను అలవాటు చేసుకోండి.

May 25, 2026 / 07:34 AM IST

డబ్బుల ప్రాధాన్యం తెలుసుకుంటే!

డబ్బులంటే కేవలం చాక్లెట్లు, బిస్కెట్ల కోసమే కాదు.. నచ్చిన బొమ్మలు కొనేందుకు దాచుకోవచ్చని పిల్లలకు చిన్నప్పుడే నేర్పాలి. దీనివల్ల వారు తమకు కావాల్సిన వాటిని ఎంచుకోవడం, ఓర్పుగా ఉండటం, ప్రాధాన్యతలను గుర్తించడం నేర్చుకుంటారు. ఈ చిన్న పాఠాలే భవిష్యత్తులో వారు ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహించుకునేలా చేస్తాయి.

May 25, 2026 / 06:57 AM IST

భరద్వాజసనం వల్ల కలిగే ఉపయోగాలు

భరద్వాజసనం ఒక అద్భుతమైన కూర్చుని చేసే యోగాసనం. ఉదర భాగంపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. వెన్నుముక వశ్యత మెరుగై, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి. నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి, మానసిక ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తుంది. శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడానికి, అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

May 25, 2026 / 06:36 AM IST

కేక్ తినగానే కూల్ డ్రింక్ తాగుతున్నారా..?

మనలో చాలామంది కేక్ తిన్న వెంటనే కూల్ డ్రింక్ తాగుతుంటారు. అయితే కేక్‌లో ఉండే మైదా, చక్కెర శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. దీనికి తోడు కూల్ డ్రింక్ కూడా తాగితే, అందులోని ‘లిక్విడ్ షుగర్’ రక్తంలో చక్కెర శాతాన్ని భారీగా పెంచుతుంది. దీంతో జీర్ణక్రియను మందగించడమే కాకుండా, విపరీతమైన కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. అలాగే అధిక బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.

May 24, 2026 / 09:41 PM IST

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే వీటిని తినండి

* ధనియాలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే బరువు తగ్గుతారు* ప్రతిరోజు ఒక అరటి పండు తింటే జీవితంలో గుండె జబ్బులు రావు* ప్రతిరోజు కరివేపాకు తింటే కంటి చూపు మెరుగవుతుంది.* ప్రతిరోజు రెండు తులసాకులు తింటే జీవితంలో క్యాన్సర్ రాదు* ప్రతిరోజు వెల్లుల్లిని తీసుకుంటే ఎముకలు బలంగా తయారవుతాయి

May 24, 2026 / 05:20 PM IST

DANGER: ఎండగా ఉందని బీర్లు తాగుతున్నారా?

ఎండలు మండిపోతున్నాయి.. చల్లని బీరు తాగితే శరీరం చల్లబడుతుందని చాలా మంది అనుకుంటుంటారు. ఇలా భావిస్తే పొరపాటుపడ్డట్టే అంటున్నారు వైద్యులు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో బీర్లు తాగడం వల్ల డీహైడ్రేషన్‌‌తో పాటు లివర్‌, గుండె సమస్యల ముప్పు ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తున్నారు. వేసవిలో శరీరానికి నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి సహజ పానీయాలే మంచివని సూచిస్తున్నారు.

May 24, 2026 / 03:58 PM IST