ఒత్తిడితో బాధపడే వారికి అక్వేరియం అద్భుతమైన థెరపీలా పనిచేస్తుంది. చేపల కదలికలను చూడటం వల్ల మెదడులో ఒత్తిడి హార్మోన్ ‘కార్టిసాల్’ తగ్గి, BP అదుపులోకి వస్తుంది. అక్వేరియం నీటి సవ్వడి నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. ఇది పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి, వృద్ధుల ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు దీనిని చూడటం వల్ల మనసు ప్రశాంతంగా మారి గాఢ నిద్ర పడుతుంది.
రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగించి గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే పడుకోవడం వల్ల అధిక బరువు పెరుగే అవకాశం ఉంది. ఇది నిద్రలేమికి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి రాత్రి 8 గంటల లోపే తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.
మీరు చేసే పనిపై ఏకాగ్రత లోపించినప్పుడు 25 నిమిషాల పాటు పూర్తి ఏకాగ్రతతో పనిచేసి, ఆ తర్వాత 5 నిమిషాల పాటు చిన్న బ్రేక్ తీసుకోవాలి. పని సమయంలో పరధ్యానం కలగకుండా ఉండటానికి మొబైల్ ఫోన్‌ను సైలెంట్‌లో ఉంచి, SM నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ లేదా పని ఉన్నప్పుడు అయోమయానికి గురికాకుండా, వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని పూర్తి చేయాలి.
మనలో చాలా మందికి టీ తాగనిదే రోజు ప్రారంభమవదు. టీలో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-బాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే మానసిక ఒత్తిడి, పని వల్ల కలిగే స్ట్రెస్ నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. అల్లం టీ, చామోమిల్ టీ లాంటి హెర్బల్ టీలు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. నార్మల్ టీ కంటే.. బ్లాక్ టీ, గ్రీన్ టీ వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ఎండాకాలంలో వచ్చే జలుబుకు ముఖ్య కారణం ఎంటెరో వైరస్. ఎండ నుంచి రాగానే ఒక్కసారిగా చల్లటి ఏసీ గదుల్లోకి వెళ్లడం, కూల్ వాటర్ తాగడం వల్ల ఈ సమస్య వస్తుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి గొంతు ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అందుకే ఎండ నుంచి రాగానే నార్మల్ వాటర్ తాగడం ఉత్తమం. శరీరం డీహైడ్రేట్ కాకుండా కొబ్బరినీళ్లు, నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి మంచిది.
ఎండాకాలంలో వచ్చే జలుబుకు ముఖ్య కారణం ఎంటెరో వైరస్. ఎండ నుంచి రాగానే ఒక్కసారిగా చల్లటి ఏసీ గదుల్లోకి వెళ్లడం, కూల్ వాటర్ తాగడం వల్ల ఈ సమస్య వస్తుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి గొంతు ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అందుకే ఎండ నుంచి రాగానే నార్మల్ వాటర్ తాగడం ఉత్తమం. శరీరం డీహైడ్రేట్ కాకుండా కొబ్బరినీళ్లు, నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి మంచిది.
గంటల తరబడి కీబోర్డుపై టైప్ చేయడం వల్ల చేతివేళ్లు, మణికట్టు నొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలు రావచ్చు. అందుకే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చిన్న విరామం ఇచ్చి చేతులను స్ట్రెచ్ చేయాలి. వెన్నుముక నిటారుగా ఉంచి, కీబోర్డ్ మోచేతుల ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. సౌకర్యవంతమైన కీబోర్డ్, మౌస్ వాడటం మంచిది.
వాకింగ్ చేసేటప్పుడు భుజాలు వంచి, ముందుకు వంగుతూ లేదా ఫోన్ వైపు చూస్తూ నడవడం వల్ల మెడ, నడుముపై ఎక్కువగా ఒత్తిడి పెరుగుతుంది. తప్పుడు పద్ధతిలో అడుగులు వేయడం, రెండు కాళ్లపై సమానంగా బరువు పడకపోవడం వల్ల మోకాళ్లు, నడుము కీళ్ల సహజ అమరిక దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలిక నొప్పులకు దారితీస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ వెన్ను నిటారుగా ఉంచి, సరైన శైలిలో నడవాలని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని చిట్కాలతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి. ఇది శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. జంక్ ఫుడ్, పంచదార పూర్తిగా పక్కన పెట్టాలి. ప్రతిరోజూ 30 నిమిషాల నడక లేదా వ్యాయామం తప్పనిసరి. రాత్రి 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు డైట్‌లో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మొలకలు చేర్చుకోవాలి.
ఉడికించిన మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో 2-3 రోజులకు మించి ఉంచకూడదు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే అందులో ‘లిస్టిరియా’, ‘సాల్మొనెల్లా’ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా చేరి, ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. రాత్రి మిగిలిన కూరను మరుసటి రోజు తినేటప్పుడు, బాగా వేడి చేసి మాత్రమే తినాలి. పదే పదే వేడి చేయడం వల్ల పోషకాలు నశించి, గ్యాస్, కడుపునొప్పి వంటి జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.
తీవ్రమైన ఒత్తిడిని తేలికగా తీసుకోవద్దు. అది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిరంతర ఆందోళన, అలసట, నిద్రలేమి వంటివి ఒత్తిడి లక్షణాలు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే గుండెజబ్బులు, డిప్రెషన్‌కు దారితీయవచ్చు. రోజువారీ వ్యాయామం, ధ్యానం, పోషకాహారం, ఇంకా కుటుంబంతో సమయం గడపడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉంటూ మనసుకు నచ్చిన పనులు చేయాలి.
పిల్లలు పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఉప్పు, కాల్షియం వల్ల 4 నుంచి 15 ఏళ్లలోపు వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. సకాలంలో గుర్తించకపోతే తీవ్రమైన ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. కాబట్టి చిన్నారుల డైట్ విషయంలో జాగ్రత్త అవసరం.
కాకరకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాకరకాయలో చారంటిన్, పోలిపెప్టైడ్-P, విజనిన్ వంటి సహజ ఇన్సులిన్ పదార్థాలు అధికంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో కాకరకాయ జ్యూస్ తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. దానివల్ల మధుమేహం నియంత్రణలో ఉండటమే కాదు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇది మెటాబాలిజంను వేగవంతం చేస్తుంది. అలాగే బరువు తగ్గే ప్రక్రియను సపోర్ట్ చేస్తుంది.
పార్శ్వోత్తనాసనం అనేది నిలబడి చేసే యోగాసనం. కాళ్లను, వెన్నెముకను బలోపేతం చేసి, శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. తొడల వెనుక ఉండే హామ్‌స్ట్రింగ్స్, పిక్కలు, తుంటి కండరాలను సాగదీస్తుంది. పొత్తికడుపు భాగంపై ఒత్తిడి పడటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. శరీరాన్ని బ్యాలెన్స్ చేసే సమయంలో దృష్టి కేంద్రీకరించడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గి మానసిక స్పష్టత పెరుగుతుంది.
ఖర్జూరం తినడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం, పలు రకాల క్యాన్సర్లను తగ్గిస్తుంది. బీపీని నియంత్రణలో ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధిక బరువును నియంత్రిస్తుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలను నివారిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.