• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రకృతిపై విద్యార్థులకు అవగాహన

SKLM: ఆమదాలవలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు ‘నేచర్ క్యాంప్’ నిర్వహించారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రకృతిని అర్థం చేసుకుని పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవాలన్నారు. బుడుమూరు, బి.కోడూరు, సింగు పురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.

March 24, 2026 / 05:04 PM IST

‘సంపన్నకారి’ పథక పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

KKD: డ్వాక్రా సభ్యులతో అనుసంధానమైన వ్యాపార అభివృద్ధికి సంపన్న కారి కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందని కలెక్టర్ షన్మోహన్ అన్నారు. మంగళవారం తన చాంబర్లో సంపన్నకారి పథక పోస్టర్‌ను ఆవిష్కరించారు. రూ. 12లక్షల పైబడి టర్నోవర్ చేస్తున్న మహిళా సంఘ సభ్యురాలికి ఇంక్యుబేషన్ ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం లక్ష్యమన్నారు.

March 24, 2026 / 05:00 PM IST

‘తమిళ జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి’

NLR: ఆంధ్ర ప్రాంత సముద్ర జలాలలో చొరబడి చేపల వేట సాగించే తమిళ జాలర్ల అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. జువ్వలదిన్నె ఘటనపై నెలకొన్న అపోహలు తొలగించి ప్రభుత్వం అండగా ఉందన్న సందేశాన్ని చేరవేసి మత్స్యకారులలో ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నారు.

March 24, 2026 / 05:00 PM IST

పగడాల ప్రవీణ్‌కుమార్‌ మొదటి సంస్కరణ సభ

ఏలూరు స్థానిక కర్రల వంతెన వద్ద పాస్టర్ జాన్ మోజేష్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగీకుడు పగడాల ప్రవీణ్‌కుమార్‌ మొదటి సంస్కరణ సభ నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనుమానాస్పద స్థితిలో ఆయన మరణించడం ప్రపంచం వ్యాప్తంగా క్రైస్తవులకు తీరని లోటు అని అన్నారు.

March 24, 2026 / 04:58 PM IST

భీమవరంలో సీపీఐ ధర్నా

W.G: ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ముఖ్యంగా పేదల సొంతింటి కల నెరవేర్చాలని కోరుతూ.. భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు మంగళవారం ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్స్‌తో కూడిన వినతిపత్రం తహసీల్దార్ రాంబాబుకి సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ పెన్మెత్స దుర్గాభవాని పాల్గొన్నారు.

March 24, 2026 / 04:57 PM IST

‘శ్రామిక మహిళలపై వేధింపులు ఆపాలి’

VSP: శ్రామిక మహిళలపై వేధింపులను అపాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన శ్రామిక మహిళా సదస్సు డిమాండ్ చేసింది. జగదాంబలో జరిగిన ఈ సమావేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అంతర్గత లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. తక్కువ వేతనాలు, ఆలస్యంగా జీతాలు, విశ్రాంతి గదుల లేమితో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

March 24, 2026 / 04:51 PM IST

ఆర్డీవో కార్యాలయం ఎదుట CPI నాయకుల ధర్నా

అనంతపురం ఆర్డీవో కార్యాలయం ముందు మంగళవారం సీపీఐ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, జిల్లా నాయకులు జగదీశ్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమితో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

March 24, 2026 / 04:50 PM IST

బోడసకుర్రు MLHP సౌమ్యకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు

కోనసీమ: అల్లవరం మండలంలోని బోడసకుర్రు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రాపాక సౌమ్యకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు దక్కింది. టీబీ ముక్తా అభియాన్ కార్యక్రమాల నిర్వహణలో విశేష సేవలు అందించిన ఆమెను అమలాపురంలో డీఎంహెచ్‌వో దుర్గారావు దొర, అడిషనల్ డీఎంహెచ్‌వో భరత లక్ష్మి అభినందించి ఆమెకు అవార్డును అందజేశారు.

March 24, 2026 / 04:50 PM IST

ఆదోనికి ఎంపీ స్థానం డిమాండ్

KRNL: అసెంబ్లీ, ఎంపీ స్థానాల పెంపు నిర్ణయంపై ఆదోని జిల్లా సమితి కన్వీనర్ నూర్ అహ్మద్ ఇవాళ హర్షం వ్యక్తం చేశారు. ఆదోని కేంద్రంగా కొత్త పార్లమెంట్ స్థానం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా ఆధారంగా ఆదోని నియోజకవర్గాన్ని రూరల్, అర్బన్‌గా విభజించాలని కోరారు. ఆదోని జిల్లా సాధన కోసం గత ఆరేళ్లుగా చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు.

March 24, 2026 / 04:47 PM IST

‘జనగణన బాధ్యతాయుతంగా నిర్వహించాలి’

VSP: సెన్సస్-2027లో భాగంగా మద్దిలపాలెం వీఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఫీల్డ్ ట్రైనర్స్ శిక్షణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి మాట్లాడుతూ.. డిజిటల్ విధానంలో జరిగే జనగణనను తప్పులు లేకుండా నిర్వహించాలని సూచించారు. మొదటి దశ మే 1 నుంచి ప్రారంభం అవుతుందన్నారు.

March 24, 2026 / 04:47 PM IST

‘అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలి’

E.G: అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వం వెంటనే ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని సీపీఐ తూ.గో జిల్లా సమితి డిమాండ్ చేసింది. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని కోరారు.

March 24, 2026 / 04:40 PM IST

మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా జేసీ

KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా కడప జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి, తహసీల్దార్ గంగయ్యలు ఆమెకు స్వాగతం పలికారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

March 24, 2026 / 04:39 PM IST

కస్తూర్బా బాలికా విద్యాలయంలో ప్రవేశాలు ప్రారంభం

అన్నమయ్య: చిట్వేల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఆడపిల్లలకు ఉచిత నాణ్యమైన విద్య అందించేందుకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. 6వ తరగతికి 40, 7వ తరగతికి 13, 8వ తరగతికి 5, 9వ తరగతికి 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఇంటర్మీడియట్ MPCలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. యూనిఫాం, పుస్తకాలు, భోజనం వంటి సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తులసి తెలిపారు.

March 24, 2026 / 04:38 PM IST

వచ్చే నెల 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

కోనసీమ: ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఉప్పలగుప్తం పరిసర సముద్ర తీరంలో వేటపై నిషేధం విధిస్తున్నట్లు మత్స్యశాఖ అధికారి చలపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు రెండు నెలల పాటు ఈ నిబంధన అమలులో ఉంటుందన్నారు. చేపలు పునరుత్పత్తి సమయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, వేట నిలిపివేసిన కాలంలో మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

March 24, 2026 / 04:30 PM IST

‘లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేత’

ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలోని 42 మంది లబ్ధిదారులకు రూ. 35.60 లక్షలు విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మంగళవారం అందజేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

March 24, 2026 / 04:30 PM IST